E-Paper
Advertisement

హైదరాబాద్‌లో షిన్‌ చాన్ సందడి.. పిల్లలకు ఫుల్ ఎంటర్‌ టైన్‌ మెంట్!

హైదరాబాద్‌లో షిన్‌ చాన్ సందడి.. పిల్లలకు ఫుల్ ఎంటర్‌ టైన్‌ మెంట్!
Advertisement

Shin Chan World At Ramoji Film City: క్రేయాన్ షిన్ చాన్ అంటే చిన్న పిల్లలకే కాదు, పెద్దలకూ ఎంతో ఇష్టం. తన అల్లరి పనులు, సరదా మాటలు, ఆకట్టుకునే డ్యాన్స్ స్టెప్పులతో ఈ కార్టూన్ క్యారెక్టర్ ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులను సంపాదించుకుంది. ఇప్పటికీ చాలామంది తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకునే సమయంలో షిన్‌ చాన్ పేరు తప్పకుండా గుర్తుకు వస్తుంది.

హైదరాబాద్ లో షిన్‌ చాన్ సందడి

ఇప్పుడు హైదరాబాద్‌ లోని అభిమానులకు షిన్‌ చాన్ ఎంటర్ టైన్ చేయబోతున్నాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన  హౌస్ ఆఫ్ మస్తీ  ప్రత్యేక ఆకర్షణలో షిన్‌ చాన్ థీమ్‌ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ ఈవెంట్ ప్రస్తుతం ఫ్యామిలీస్, చిల్ర్డెన్, యూత్, యానిమేషన్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ ప్రత్యేక కార్యక్రమం మే 15న ప్రారంభమై మే 31, 2026 వరకు కొనసాగనుంది. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సందర్శకులకు అనుమతి ఉంటుంది. రామోజీ ఫిల్మ్ సిటీలోని ఈ ప్రాంతాన్ని పూర్తిగా రంగురంగుల కార్టూన్ ప్రపంచంలా తీర్చిదిద్దారు. భారీ షిన్‌ చాన్ కటౌట్లు, ప్రత్యేక అలంకరణలు, లైటింగ్, థీమ్ సెటప్‌ లు అక్కడికి వెళ్లే వారిని వెంటనే ఆకట్టుకుంటున్నాయి.

ఫుల్ ఎంజాయ్ చేస్తున్న పిల్లలు

Advertisement

పిల్లలు ఈ ప్రదేశాన్ని చూసి ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు.  ఎందుకంటే, టీవీలో చూసే తమ ఇష్టమైన కార్టూన్ పాత్రను నిజ జీవితంలో చూసినట్లుగా అనిపించేలా అక్కడ వాతావరణాన్ని రూపొందించారు. సందర్శకులు భారీ షిన్‌ చాన్ మోడళ్లతో ఫోటోలు దిగుతున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన థీమ్ జోన్‌ లలో తిరుగుతూ సరదాగా గడుపుతున్నారు. హౌస్ ఆఫ్ మస్తీలో కేవలం ఫోటోలు మాత్రమే కాదు,  బోలెడు ఆటలు, వినోద కార్యక్రమాలు కూడా ఉన్నాయి. పిల్లల కోసం పజిల్ గేమ్స్, డ్రాయింగ్ యాక్టివిటీలు, చిన్న చిన్న పోటీలు, ఫన్ కార్నర్‌లు ఏర్పాటు చేశారు. రోజంతా సంగీతం, వినోద కార్యక్రమాలు కొనసాగుతుండటంతో అక్కడి వాతావరణం మరింత ఉత్సాహంగా కనిపిస్తోంది.

రంగురంగుల సెల్ఫీ స్పాట్లు, కార్టూన్ బ్యాక్‌ డ్రాప్‌ లు, ప్రత్యేక సెట్స్ కారణంగా యువత ఎక్కువగా ఫోటోలు తీసుకుంటున్నారు. చాలా ఫ్యామిలీ మెంబర్స్ అక్కడ గంటల తరబడి గడుపుతూ పిల్లలతో కలిసి ఆనందంగా సమయం గడుపుతున్నాయి.

ఎంట్రీ టికెట్ ధర ఎంతంటే?

Advertisement

టికెట్ విషయానికి వస్తే, ప్రత్యేకంగా వేరే టికెట్ అవసరం లేదు. రామోజీ ఫిల్మ్ సిటీ ఎంట్రెన్స్  టికెట్‌ తోనే షిన్‌ చాన్ థీమ్ ప్రాంతాన్ని చూసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం పెద్దల డే టూర్ ప్యాకేజీ సుమారు రూ.1,550 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఫ్యామిలీ, గ్రూప్ టూర్ కోసం కొన్ని ప్రత్యేక ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇటీవల హైదరాబాద్‌ లో వినోద రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. యానిమే ఈవెంట్లు, థీమ్ కేఫ్‌ లు, గేమింగ్ జోన్లు  పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో షిన్‌ చాన్ థీమ్‌ తో వచ్చిన  హౌస్ ఆఫ్ మస్తీ ఈ సమ్మర్ లో ఫ్యామిలీ ఎంటర్‌ టైన్‌ మెంట్ లలో ఒకటిగా నిలుస్తోంది.

Read Also: థాయ్‌ లాండ్, బాలి ఎందుకు దండగ.. భారత్‌ లోనే వాటిని తలదన్నే టూరిస్ట్ స్పాట్స్ ఉండగా!

Related News

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

అజంతా To ఎల్లోరా.. 6 రోజుల క్రేజీ టూర్.. ధర మరీ ఇంత తక్కువా?

జపాన్‌కు వెళ్లేవారికి గుడ్ న్యూస్.. ఢిల్లీ నుంచి ఒసాకాకు నాన్‌స్టాప్ విమానాలు!

సౌదీ అరేబియాకు వెళ్లే భారతీయులకు అలర్ట్.. అక్టోబర్ 24 వరకు ఫ్లైట్స్ క్యాన్సిల్!

ఇండియన్ పాస్‌పోర్ట్ ర్యాంక్ పెరిగింది.. కానీ, వీసా ఫ్రీ దేశాలు తగ్గాయ్!

రైలు ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. ఆఫ్‌లైన్ టిక్కెట్లకూ ఇన్సూరెన్స్.. రూ. 10 లక్షల బీమా కవరేజ్!

విమానాల్లో అగ్ని ప్రమాద ఘటనలు.. పవర్ బ్యాంకులపై DGCA నిషేధం! ఇంకా ఏంటంటే..

Big Stories

Advertisement
×