E-Paper
Advertisement

విశాఖ నుంచి ఢిల్లీకి స్పెషల్ రైళ్లు, దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం!

విశాఖ నుంచి ఢిల్లీకి స్పెషల్ రైళ్లు, దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం!
Advertisement

SCR Introduces Summer Specials: వేసవి సెలవుల కారణంగా దేశ వ్యాప్తంగా రైళ్లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరుగుతోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లే రైళ్లలో వెయిటింగ్ లిస్టులు ఎక్కువవుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా విశాఖపట్నం, నాందేడ్ నుంచి ఢిల్లీకి నాలుగు ప్రత్యేక వేసవి రైళ్లను ప్రకటించింది. ఈ ప్రత్యేక సర్వీసులు మే 21 నుంచి మే 26 వరకు నడవనున్నాయి. సాధారణంగా వేసవిలో విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో ఢిల్లీకి ప్రయాణిస్తుంటారు. దీంతో కన్ఫర్మ్ టిక్కెట్లు దొరకడం కష్టమవుతోంది. ఈ సమస్యను తగ్గించేందుకు అదనపు రైళ్లను నడపాలని రైల్వే అధికారులు నిర్ణయించారు.

విశాఖ-ఢిల్లీ ప్రత్యేక రైలు

విశాఖపట్నం నుంచి ఢిల్లీకి వెళ్లే ప్రత్యేక రైలు(నంబర్ 08513) మే 21న సాయంత్రం 5:40 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు మే 23 ఉదయం 11:40 గంటలకు హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్‌ కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబర్ 08514 మే 24 రాత్రి 11:55 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి, మే 26 రాత్రి 10:40 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, తుని, రాజమండ్రి, విజయవాడ, బల్హర్షా, నాగ్‌పూర్, భోపాల్, ఝాన్సీ, ఆగ్రా లాంటి ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతుంది. ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ఏరియా ప్రయాణికులకు కూడా ఈ సర్వీస్ ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.

నాందేడ్-ఢిల్లీ ప్రత్యేక రైలు

Advertisement

ఇక నాందేడ్ నుంచి ఢిల్లీకి వెళ్లే ప్రత్యేక రైలు(నంబర్ 07660) మే 22 ఉదయం 6:35 గంటలకు బయలుదేరుతుంది. ఇది మే 23 మధ్యాహ్నం 2:30 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణ రైలు 07661 మే 25 తెల్లవారుజామున 1:25 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి, మే 26 ఉదయం 9:45 గంటలకు నాందేడ్ చేరుకుంటుంది. ఈ రైలు ఆదిలాబాద్, నాగ్‌ పూర్, భోపాల్, ఝాన్సీ, ఆగ్రా లాంఇ ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాల ప్రయాణికులకు ఈ రైలు మంచి కనెక్టివిటీని అందించనుంది.

స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు మాత్రమే!

ఈ రెండు ప్రత్యేక రైళ్లలో ప్రధానంగా స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు మాత్రమే ఏర్పాటు చేశారు. తక్కువ ఖర్చుతో ప్రయాణించే మధ్యతరగతి, కార్మికులు, విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఈ రైళ్లను నడుపుతున్నారు. సాధారణ రైళ్లతో పోలిస్తే కొత్తగా ప్రకటించిన ఈ స్పెషల్ రైళ్లలో టిక్కెట్లు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

Advertisement

విశాఖపట్నం నుంచి ఢిల్లీకి ఈ ప్రయాణానికి సుమారు 42 గంటల సమయం పడుతుంది. నాందేడ్ నుంచి ఢిల్లీకి దాదాపు 32 గంటల ప్రయాణ సమయం ఉంటుంది. ప్రయాణికులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకునేలా రైల్వే టైమింగ్స్ ను రూపొందించింది. వేసవి రద్దీ సమయంలో ఉపశమనం కలిగించేందుకు దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం ప్రయాణికులకు ఎంతో ఉపయోగపడనుంది.

Read Also: 3 గంటల్లో హైదరాబాద్- ముంబై ప్రయాణం.. బుల్లెట్ రైలు డీపీఆర్ రెడీ!

Related News

పిల్లల చదువుల కోసం పర్వతానికి లిఫ్ట్.. 3 గంటల ప్రయాణం ఇక 30 నిమిషాలే!

జస్ట్ 4.5 గంటల్లో 1,170 కిమీ ప్రయాణం.. బుల్లెట్ రైలు జోష్ మామూలుగా లేదుగా!

నమో భారత్‌కు ఇక సూర్యుడి పవర్.. ఇండియన్ రైల్వే ప్లాన్ అదిరింది భయ్యా!

ఎక్స్‌ ప్రెస్‌ వేపై ఫ్యామిలీ పిక్నిక్.. అసలు అక్కడ ఏం జరిగిందంటే?

జొన్నగిరిలో రూ.లక్షల కోట్ల విలువైన బంగారం.. ఏపీ దశ తిరిగినట్టేనా?

అమరావతిలో మినీ అమెజాన్.. ఐదు ఎకరాల్లో అద్భుత వర్షారణ్యం!

మహాభారత ఆనవాళ్లు.. బౌద్ధ మహాస్తూపం.. రామదాసు జన్మస్థలం.. ఈ ఊరి కథ తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఎలాన్ మస్క్ ఫ్లయింగ్ ప్యాలెస్.. ఈ జెట్‌లోని ఫీచర్లు తెలిస్తే పరేషాన్ కావాల్సిందే!

Big Stories

Advertisement
×