Switzerland Trip: విదేశాలకు టూర్ వేస్తున్నారా? ఒక్క క్షణం ఆలోచించండి. ఇండియా మాదిరిగా రూల్స్ విషయంలో అక్కడ వ్యవహరిస్తే ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే అక్కడ అడుగడుగునా ఏఐ కెమెరాలు, నో పార్కింగ్ జోన్‌లో వాహనాలు ఆపినా జరిమానా తప్పదు. తాజాగా ఓ భారతీయ మహిళకు ఏకంగా లక్షన్నర రూపాయలు జరిమానా వేసింది అక్కడి ప్రభుత్వం. అది కూడా టూర్ వెళ్లొచ్చిన ఏడాది తర్వాత.
స్విట్జర్లాండ్ ట్రిప్.. తస్మాత్ జాగ్రత్త-లక్ష రెడీ చేసుకోండి
స్విట్జర్లాండ్ టూర్‌కి వెళ్లి వచ్చిన ఏడాది తర్వాత ఓ భారతీయ మహిళకు ఏకంగా రూ. 1.5 లక్షల ట్రాఫిక్ చలాన్ పంపించింది అక్కడి ప్రభుత్వం. భారత విదేశాంగ శాఖ ద్వారా వచ్చిన లీగల్ నోటీసు చూసి షాకైంది సదరు మహిళ. అక్కడ ఆమె చేసిన తప్పు అప్పట్లో తెలియలేదు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.
యూరప్‌లోని పలు దేశాల్లోని కఠినమైన ఆంక్షలు ఉంటాయి. ఆయా ప్రాంతాలకు టూరిస్టులు వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరూ లేరని అద్దె కారులో స్పీడ్‌గా వెళ్లినా, నో పార్కింగ్‌లో వాహనాలు పెట్టినా ఏఐ కెమెరాలు, కన్ఫ్యూజింగ్ ట్రాఫిక్ రూల్స్ వల్ల భారీ జరిమానాలు వడ్డిస్తుంది అక్కడి ప్రభుత్వం. టూర్ నుంచి వచ్చిన తర్వాత అసలు స్టోరీ మొదలవుతుందని అంటున్నారు.
ఈ క్రమంలో చాలామంది బాధితులు అలాంటి విషయాలను బయటపెట్టారు. విదేశాలకు వెకేషన్‌కు వెళ్లనవాళ్లు అందమైన లొకేషన్లకు వెళ్లేందుకు ఇష్టపడతారు. కారుని అద్దెకు తీసుకుని మనకు నచ్చిన విధంగా ఎంజాయ్ చేస్తుంటారు. ఆ విధంగా తిరగాలని చాలామంది కోరుకుంటారు. అప్పుడు గానీ ఎంజాయ్ చేశామన్న ఫీల్ రాదని చెబుతుంటారు.
రూల్స్ ఉల్లంఘన.. ఏడాది తర్వాత భారతీయ మహిళకు లక్షన్నర ఫైన్
స్విట్జర్లాండ్ ట్రిప్ వెళ్లొచ్చిన ఓ భారతీయురాలికి ఏడాది తర్వాత అక్కడి ప్రభుత్వం ఊహించని షాక్ తగలింది. స్విస్‌లో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినందుకు దాదాపు రూ. 1.5 లక్షల చలాన్ పేపర్లు భారత విదేశాంగ శాఖ ద్వారా ఆమెకి పంపింది. ఈ విషయాన్ని కాస్త ఆ మహిళ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
విదేశాలకు ప్రయాణాలకు వెళ్లేవారికి అసలు టెన్షన్ మొదలైంది. తొలుత లక్ష రూపాయల చలాన్ అనుకున్నారు ఆమె. పేపర్లన్నీ చెక్ చేసేసరికి రూ. 1.5 లక్షల రూపాయల పెనాల్టీ అని తేలింది. ఆ పేపర్స్ చూసి షాక్ కావడం ఆమె వంతైంది. దీన్ని తగ్గించుకోవడానికి లేకుంటే రద్దు చేయించుకోవడానికి లీగల్‌గా అప్పీల్ చేసుకునే అవకాశం ఉందా నెటిజన్ల సహాయం కోరడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
ఆ మహిళ పోస్ట్‌కు సోషల్ మీడియాలో భారీగా స్పందన వచ్చింది. చాలా మంది ప్రయాణికులు యూరప్‌లో తమకు ఎదురైన చలాన్ల కథలను పంచుకున్నారు. జర్మనీ వెళ్లినప్పుడు ఓ ట్రావెలర్‌కు ఎదురైన చేదు అనుభవం గురించి వివరించారు. చిన్న రాంగ్ టర్న్ తీసుకున్నా, సరిహద్దుల్లో ఎంట్రీ ఇచ్చినా భారీగా చలాన్ కట్టాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నారు.
ఐస్‌లాండ్, టర్కీ వంటి దేశాలకు వెళ్లినవారికి జరిమానాలు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఒకవేళ జరిమానాలు వేసినా ఆన్‌లైన్ ద్వారా పేమెంట్లు అందుబాటులో లేకపోవడం మరో సమస్యగా మారిందని చెబుతున్నారు. స్విఫ్ట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా బ్యాంక్ ఛానెల్స్ ఉపయోగించి చెల్లించే వీలు ఉంటుంది.
మళ్లీ స్విట్జర్లాండ్‌ను సందర్శించాలని అనుకోకపోతే దాని గురించి చింతించవద్దని మరికొందరు చెబుతున్నారు. ఒకవేళ మీరు జరిమానా చెల్లించకుండా వెళ్తే అక్కడ కారు అద్దెకు తీసుకోలేరు, నడపలేరు. వీలైతే అరెస్టు కూడా కావచ్చని మరొక ట్రావెలర్ సలహా ఇచ్చారు. తస్మాత్ జాగ్రత్త.. ఒక వేళ విదేశాలకు వెళ్లేముందు అక్కడి రూల్స్ తెలుసుకోవడం మరిచిపోవద్దు. లేకుంటే టూర్ వెళ్లి వచ్చిన తర్వాత లక్ష రూపాయలు రెడీ చేసుకోండి.