E-Paper
Advertisement

PAK VS AUS: ఆస్ట్రేలియాతో వ‌న్డే సిరీస్‌…ప్ర‌ధాని మోడీ కాళ్ల ద‌గ్గ‌ర‌కు పాకిస్తాన్ !

PAK VS AUS: ఆస్ట్రేలియాతో వ‌న్డే సిరీస్‌…ప్ర‌ధాని మోడీ కాళ్ల ద‌గ్గ‌ర‌కు పాకిస్తాన్ !
Advertisement

PAK VS AUS:  ఒకవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) కొనసాగుతున్న నేపథ్యంలో మరోవైపు పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా (Pakistan vs Australia) మధ్య వన్డే సిరీస్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. నిన్న ప్రారంభమైన ఈ వన్డే సిరీస్ జూన్ 4వ తేదీ వరకు కొనసాగనుంది. ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మొత్తం మూడు వన్డేలు జరగనున్నాయి. అయితే ఈ మూడు వన్డేల సిరీస్ నేపథ్యంలో ఇండియాను ప్రాధేయ పడుతోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఈ టోర్నమెంట్ కు సంబంధించిన ప్రసార హక్కులను కొనుగోలు చేయండి అంటూ ఇండియాకు సంబంధించిన బ్రాడ్ కాస్టర్లను వేడుకుంటోంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.

Also Read: Ravichandran Ashwin: వైభ‌వ్ రెండుస్లార్లు సెంచ‌రీ మిస్‌..క‌న్నీళ్లు పెట్టుకున్న అశ్విన్‌ కసరత్తులు చేసి, వ్యూహాన్ని

ఆస్ట్రేలియాతో వ‌న్డే సిరీస్‌…ప్ర‌ధాని మోడీ కాళ్ల ద‌గ్గ‌ర‌కు పాకిస్తాన్ !

Advertisement

ఎలాడైనా డబ్బులు సంపాదించి… ఆర్థికంగా డెవలప్ కావాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వ్యూహరచనలు చేసింది. అయితే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు రచించిన ఈ వ్యూహం.. బెడిసి కొట్టింది. పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా కు సంబంధించిన సిరీస్ ఎవరు చూడరని.. దానివల్ల పెద్దగా ప్రయోజనం లేదని ఇండియాకు సంబంధించిన బ్రాడ్ కాస్టర్లు ఎవరు ముందుకు రాలేదు. దానికి తోడు ఇండియా వర్సెస్ పాకిస్తాన్  ( IND VS PAK) మధ్య యుద్ధం వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. మోడీ సర్కార్ ( MODI GOVT) అనుమతులు కూడా ఇచ్చే అవకాశాలు లేవు. అందుకే పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్ ను మన ఇండియాకు సంబంధించిన బ్రాడ్ కాస్టర్లు లైట్ తీసుకున్నారు.

యూట్యూబ్ లోనే ఫ్రీగా ప్ర‌సారాలు

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ సిరీస్ ను ఎవరు కొనుగోలు చేయడానికి ముందుకు రాని నేపథ్యంలో… పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సిరీస్ ను పాకిస్తాన్ లో ప్రసారం చేస్తూనే… యూట్యూబ్ లో ఉచితంగా అందిస్తోంది. నిన్న తొలి వన్డే జరగగా… యూట్యూబ్ లో ఉచితంగానే ప్రసారాలు అయ్యాయి. దీంతో ఇండియన్స్ కూడా ఈ మ్యాచ్ ను యూట్యూబ్ లోనే తిలకించడం జరిగింది. అయితే ఈ సంఘటన బయటకు వచ్చిన నేపథ్యంలో.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పరువు తీస్తున్నారు ఇండియన్స్. ఒక అంతర్జాతీయ వన్డే సిరీస్ జరుగుతున్నప్పుడు ఆ ప్రసారాలను కొనుగోలు చేసే బ్రాడ్ కాస్టర్లే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు దొరకకపోవడం దురదృష్టకరమని పరువు తీస్తున్నారు. ఇలాంటి వాళ్లు 2027 వన్డే వరల్డ్ కప్ లో ఇండియాను ఓడిస్తారా? అవన్నీ పగటి కలలు అని సెటైర్లు పేల్చుతున్నారు. ఇది ఇలా ఉండగా శనివారం రోజున పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య తొలి వన్డే జరిగింది. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 200 పరుగులకు కుప్ప కూలింది. ఈ లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి పాకిస్తాన్ ఛేదించింది. దీంతో మొదటి వన్డేలో విక్టరీ అందుకుంది పాకిస్తాన్.

Advertisement

Also Read: IPL 2026 Finals  RCB VS GT:  గుజ‌రాత్ వ‌ర్సెస్ RCB మ‌ధ్య ఫైన‌ల్స్..ముందే ఊహించిన అన‌న్య బిర్లా, పాత పోస్ట్ వైర‌ల్ 

 

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×