ప్రయాణీకులకు బడ్జెట్ ఫ్రెండ్లీగా బస్ పాస్ లను అందుబాటులో ఉంచింది. తక్కువ ఖర్చుతో నెల రోజుల పాటు ప్రయాణం చేసే వెసులుబాటు కల్పిస్తోంది. తెలంగాణ ఆర్టీసీ బస్ పాస్ సౌకర్యవంతమైన, బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రయాణానికి ఉపయోగపడుతుంది. విద్యార్థులు, ఉద్యోగులు, రోజువారీ ప్రయాణీకులకు బస్ పాస్ గణనీయమైన పొదుపు, ప్రయాణ సౌలభ్యాన్ని అందిస్తుంది.
ఆర్టీసీ బస్ పాస్ తో కలిగే లాభాలు
తెలంగాణ ఆర్టీసీ బస్ పాస్ తో బోలెడు లాభాలు ఉన్నాయి. రోజువారీ టికెట్ కొనుగోళ్లతో పోలిస్తే డబ్బు ఆదా చేస్తుంది. నగదు లావాదేవీల అవసరం లేకుండా ఇబ్బంది లేని ప్రయాణాన్ని అందిస్తుంది. పాస్ హోల్డర్లు వారి పరిమిత రూట్లలో అపరిమితంగా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ప్రత్యేక డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. వారి ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గిస్తాయి.
ఆర్టీసీ బస్ పాస్‌ల రకాలు
తెలంగాణ ఆర్టీసీ వివిధ అవసరాలకు అనుగుణంగా వివిధ రకాల బస్ పాస్ లను అందిస్తోంది.
విద్యార్థి బస్ పాస్: స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు బస్ పాస్ ను అందుబాటులో ఉంచింది. దరఖాస్తు సమయంలో చెల్లుబాటు అయ్యే విద్యార్థి ID, విద్యాసంస్థ వివరాలు అందించాల్సి ఉంటుంది.
ఉద్యోగి బస్ పాస్: నిర్దిష్ట జోన్లలో పనిచేసే రోజువారీ ప్రయాణీకుల కోసం రూపొందించబడింది. ఉద్యోగులకు రవాణా ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుంది.
జనరల్ బస్ పాస్: నగరంలో తరచుగా ప్రయాణించే సాధారణ ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది.
బస్ పాస్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఆర్టీసీ బస్ పాస్ కోసం దరఖాస్తు చేసుకోవడం చాలా సులభం. ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ లోనూ బస్ పాస్ కోసం అప్లై చేసుకోవచ్చు.
ఆన్ లైన్ అప్లై చేసుకునే విధానం: ముందుగా TGSRTC వెబ్ సైట్ ఓపెన్ చేయాలి. TGSRTC బస్ పాస్ అప్లై మీద క్లిక్ చేయాలి. పేరు, అడ్రస్ సహా ఇతర వివరాలను ఫిల్ చేయాలి. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి. డబ్బులు చెల్లించిన తర్వాత RTC పాస్ కౌంటర్ నుంచి బస్ పాస్ తీసుకునే అవకాశం ఉంటుంది.
బస్ పాస్ ఆఫ్ లైన్ లో ఎలా అప్లై చేసుకోవాలి?
సమీపంలోని TGSRTC బస్ డిపోకు వెళ్లాలి. బస్ పాస్ ఫారమ్ తీసుకోవాలి. పూర్తి వివరాలను ఫిల్ చేయాలి. అవసరమైన పత్రాలను జత చేసి ఫారమ్‌ను బస్ పాస్ కౌంటర్ లో సమర్పించాలి. నిర్ణీత ఛార్జ్ చెల్లించి బస్ పాస్ తీసుకోవాలి.
బస్ పాస్ కోసం కావాల్సిన పత్రాలు
బస్ పాస్ తీసుకునే వాళ్లు, పాస్ పోర్ట్ సైజు ఫోటో, ఐడెంటీ కార్డు, అడ్రస్ ఫ్రూప్, ఆఫీస్, స్కూల్ వివరాలతో కూడిన ఫ్రూప్ తీసుకొని వెళ్లాలి. ఒకవేళ మీకు బస్ పాస్ కావాలంటే దగ్గర్లోని బస్ పాస్ కౌంటర్ దగ్గరికి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోండి. లేదంటే అధికారిక TGSRTC వెబ్ సైట్ లోకి వెళ్లి అన్ని వివరాలను తెలుసుకోండి.
Read Also: సమ్మర్ రద్దీ నేపథ్యంలో రైల్వే కీలక నిర్ణయం, అందుబాటులోకి మరిన్ని ప్రత్యేక రైళ్లు!