British Airways: ఉద్యోగం ఏదైనా విధి నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలి. తేడా వస్తే ఉద్యోగం ఊడుతుంది. కొన్ని సంస్థలైతే పక్కన బెడతాయి. ఆ పైలట్‌కు అదే పరిస్థితి ఏర్పడింది. విమానంలో చేయకూడని పని చేశాడు. ప్రయాణికులు ఫిర్యాదుతో వెంటనే అతడ్ని సస్పెండ్ చేశారు. అసలేం మేటరేంటి? లోతుల్లోకి వెళ్తే..
విమానం నడుపుతున్న విధానం చూసి కుటుంబ సభ్యులు ఎంజాయ్ చేయాలని భావించాడు పైలట్. అతడు చేసిన పని ఉద్యోగానికే ఎసరు తెచ్చింది. లండన్‌లోని హీత్రూ నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఓ బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానం బయలుదేరింది. అయితే ప్రయాణ సమయంలో కాక్‌పిట్ డోర్‌ను తెరిచారు పైలట్. అలా ఓపెన్ చేసి ఉంచడం ఉగ్రవాద నిరోధక చట్టాలను ఉల్లంఘించాడు.
చివరకు ఆ పైలట్‌ని సస్పెండ్ చేసింది సంబంధిత ఎయిర్‌లైన్స్ సంస్థ. హీత్రూ ఎయిర్‌పోర్టు నుంచి న్యూయార్క్‌కు బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానం బయలు దేరింది. విమానం టేకాఫ్ తర్వాత ఓ పైలట్ కాక్‌పిట్ డోర్‌ను ఓపెన్ చేశాడు. దాన్ని క్లోజ్ చేసే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే ఆ విమానంలో ఆయన కుటుంబసభ్యులు ఉన్నారు.
విమానాన్ని తాను ఏ విధంగా ఆపరేట్ చేస్తున్నానో చూపించాలనుకున్నాడు. విమానం ఆకాశంలో ఉండగా కాక్‌పిట్ డోర్ ఓపెన్ అయ్యింది. దీన్ని గమనించిన ట్రావెలర్స్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కాసేపు ఏం జరుగుతుందో తెలియక భయపడ్డారు. ల్యాండింగ్ అయ్యేవరకు ప్రయాణికులు సైలెంట్ అయ్యారు.
ALSO READ: దీపావళికి టికెట్ బుక్ చేసుకున్నారా? ఇప్పుడే త్వరపడండి?
న్యూయార్క్‌లో విమానం ల్యాండ్ కాగానే అధికారులకు ఫిర్యాదు చేశారు ట్రావెలర్స్. 9/11 ఉగ్రదాడుల తర్వాత విమానంలో భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నాయి విమాన సంస్థలు. ప్రయాణ సమయంలో కాక్‌పిట్ డోర్‌ను లాక్ చేసి ఉంచాలి. ఈ నిబంధనను పైలట్ ఉల్లంఘించడం తీవ్రమైన నేరంగా పరిగణించింది ఎయిర్ లైన్ సంస్థ.
వెంటనే పైలట్‌ని సస్పెండ్ చేసింది. పైలట్ సస్పెండ్ కారణంగా ఈనెల 8న న్యూయార్క్ నుంచి లండన్‌కు రావాల్సిన విమానాన్ని రద్దు చేసింది ఆ సంస్థ. ఆ విమానంలో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది బ్రిటీష్ ఎయిర్‌వేస్. ఆ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ భద్రత మా ప్రాధాన్యత అని ఈ తరహా ఆరోపణలను ఎల్లప్పుడూ పూర్తిగా పరిశీలిస్తామని తెలిపారు.