RailOne OTT Streaming: భారతీయ రైల్వే ప్రయాణీకులకు మరో క్రేజీ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవల ప్రారంభించిన రైల్వేస్ సూపర్ యాప్ రైల్ వన్ లో ఇప్పుడు ఉచిత OTT సేవలను అందించబోతున్నట్లు వెల్లడించింది. రైల్ వన్ యాప్ ఇప్పటికే రైల్వేకు సంబంధించిన అన్ని సేవలను అందిస్తోంది. టికెట్స్ బుకింగ్ నుంచి ఫుడ్ ఆర్డర్స్ వరకు, టికెట్స్ క్యాన్సిలేషన్ నుంచి ఫిర్యావుల వరకు అన్ని సేవలను ఇక్కడే పొందే అవకాశం ఉంది. ఇకపై రైల్వే ప్రయాణీకులకు జర్నీ సమయంలో బోర్ కొట్టకుండా సినిమాలు, సినిమాలు, వెబ్ షోలు, డాక్యుమెంటరీలు, ఆడియో ప్రోగ్రామ్‌లు, గేమ్‌లు లను అందించబోతోంది. ఉచితంగా ఓటీటీ సేవలను అందించబోతోంది.
రైల్ వన్ లో ఫ్రీ ఓటీటీ సేవలు ఎలా పొందాలంటే?
రైల్వే వన్ లో ఉచిత ఓటీటీ సేవలను పొందడానికి కింద ఇచ్చిన స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ ముందుగా రైల్ వన్ యాప్ లోని Mpin aodgzo బయోమెట్రిక్ ద్వారా లాగిన్ అవ్వండి.
⦿ హోమ్ స్క్రీన్ లోని ‘మరిన్ని ఆఫర్లు’ విభాగం కింద, ‘గో టు వేవ్స్’ మెను పై క్లిక్ చేయండి.
⦿ యూజర్ సినిమాలు, షోలు, డాక్యుమెంటరీలు, మరిన్నింటితో సహా ఉచిత OTT కంటెంట్ ను యాక్సెస్ చేయగల కొత్త పేజీకి తీసుకెళ్తుంది.
⦿ హ్యాపీగా ఉచిత ఓటీటీ కంటెంట్ చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు.
రైల్ వన్ యాప్‌లో OTT కంటెంట్
రైల్ వన్ మొబైల్ అప్లికేషన్ లో టికెట్ బుకింగ్, అన్ రిజర్వ్డ్ UTS టిక్కెట్లు, లైవ్ ట్రైన్ ట్రాకింగ్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. సేవలు మాత్రమే కాకుండా ఫిర్యాదుల పరిష్కారం, ఈ-క్యాటరింగ్, పోర్టర్ బుకింగ్, లాస్ట్ మైల్ టాక్సీ కూడా ఉన్నాయి. ఇండియన్ రైల్వేస్ రైల్ వన్ యాప్ WAVES OTT ప్లాట్ ఫామ్ ను మిక్స్ చేసిన తర్వాత ఈ ఉచిత OTT యాక్సెస్ వచ్చింది.
వేవ్స్ OTT అంటే ఏంటి?
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ WAVES OTTని ఉచిత యాక్సెస్ ప్లాట్ ఫామ్ గా అభివర్ణించింది. ఇది స్మార్ట్ ఫోన్లు, ఇంటర్నెట్-ఎనేబుల్డ్ పరికరాల్లో అందుబాటులో ఉంది. ఇది ఎటువంటి సబ్ స్క్రిప్షన్ ఫీజ్ లేకుండా మంచి కంటెంట్‌ను అందిస్తుంది. ఈ ప్లాట్ ఫామ్ ను ప్రసార భారతి నవంబర్ 2024లో ప్రారంభించింది. ఇది లైవ్ టీవీ, ఆన్ డిమాండ్ వీడియోలు, ఆడియో, గేమింగ్ నుంచి ఇ-కామర్స్ వరకు విభిన్న శ్రేణి వినోద ఎంపికలను కలిగి ఉన్నది. 10 కంటే ఎక్కువ భాషలలో కంటెంట్ ను అందిస్తుంది. సో, ఇకపై మీరు కూడా రైల్ వన్ యాప్ ద్వారా హ్యాపీగా ఓటీటీ సేవలను ఎంజాయ్ చేయండి. రైలు ప్రయాణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చుకోండి.