Indian Railways: విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో తల్లిదండ్రులు సమ్మర్ వెకేషన్స్ ప్లాన్ చేస్తున్నారు. వేసవి తాపం నుంచి బయటపడేందుకు హిల్ స్టేషన్లకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్లకు రద్దీ పెరిగింది. పెరిగిన రద్దీకి అనుగుణంగా రైల్వే అధికారులు కీలక చర్యలు చేపడుతున్నారు. ఆయా రూట్లలో అదనపు రైళ్లను నడిపించాలని నిర్ణయించారు.
విశాఖపట్నం-చర్లపల్లి మధ్య స్పెషల్ రైలు
వేసవి రద్దీ నేపథ్యంలో అదనపు రైళ్లను నడిపించాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. రైలు నెం. 08579 విశాఖపట్నం-చెర్లపల్లి స్పెషల్ తో పాటు రైలు నెం. 08311 సంబల్పూర్- ఈరోడ్ స్పెషల్ కు సంబంధించి ట్రిప్పులు పెంచనున్నట్లు తెలిపారు. విశాఖపట్నం-చెర్లపల్లి స్పెషల్ ఏప్రిల్ 25, మే 2, 9, 16, 23, 30 తేదీలలో సాయంత్రం 5.30 గంటలకు విశాఖపట్నం నుంచి బయలుదేరి సాయంత్రం 6.03 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ 2 నిమిషాలు ఆగి, సాయంత్రం 6.05 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.20 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఇక తిరుగు ప్రయాణంలో రైలు నెం. 08580 చర్లపల్లి- విశాఖపట్నం ప్రత్యేక రైలు ఏప్రిల్ 26, మే 3, 10, 17, 24, 31 తేదీలలో చర్లపల్లి నుండి రాత్రి 7 గంటలకు బయలుదేరుతుంది. 6.38 గంటలకు దువ్వాడ చేరుకుని 6.40 గంటలకు బయలుదేరి 8 గంటలకు విశాఖపట్నం జంక్షన్ చేరుకుంటుంది.
ఈ రైలు ఎక్కడెక్కడ ఆగుతుందంటే?
విశాఖపట్నం-చర్లపల్లి స్పెషల్ రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడలో హాల్టింగ్ ఉంటుంది. ఇక ఈ రైళ్లలో రెండు II-టైర్ AC, మూడు III-టైర్ AC, రెండు 3E, ఎనిమిది స్లీపర్ క్లాస్, నాలుగు జనరల్ సెకండ్ క్లాస్, సెకండ్ క్లాస్ లగేజీ-కమ్-దివ్యాంగజన్ కోచ్, ఒక జనరేటర్ టార్ కార్ ఉంటాయి.
Read Also: ఇండియాలో పట్టాలెక్కిన మొదటి రైలు ఇదే.. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించిందంటే?
సంబల్ పూర్–ఈరోడ్ వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్
అటు రైలు నెం.08311 సంబల్ పూర్–ఈరోడ్ వీక్లీ స్పెషల్ ఎక్స్ ప్రెస్ మే 7 నుంచి జూన్ 25 వరకు బుధవారం ఉదయం 11.35 గంటలకు సంబల్ పూర్ నుంచి బయలుదేరి అదే రోజు రాత్రి 9.30 గంటలకు దువ్వాడ చేరుకుని, రాత్రి 9.32 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి గురువారం ఉదయం 8.30 గంటలకు ఈ రోడ్ చేరుకుంటుంది.
ఇక తిరుగు ప్రయాణంలో రైలు నెం. 08312 ఈరోడ్–సంబల్ పూర్ వీక్లీ స్పెషల్ మే 9 నుంచి జూన్ 27 వరకు శుక్రవారం మధ్యాహ్నం 2.45 గంటలకు ఈరోడ్ నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.08 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. మధ్యాహ్నం 1.10 గంటలకు బయలుదేరి శనివారం రాత్రి 11.15 గంటలకు సంబల్ పూర్ చేరుకుంటుందని వాల్తేర్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె. సందీప్ వెల్లడించారు. ఈ రైలులో ఒక II-టైర్ AC, మూడు III-టైర్ AC, తొమ్మిది స్లీపర్ క్లాస్, మూడు జనరల్ సెకండ్ క్లాస్, రెండు సెకండ్ క్లాస్ కమ్ లగేజ్, దివ్యాంగజన్ కోచ్‌లు ఉంటాయి.
Read Also: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారమ్ లు క్లోజ్ చేసేది ఎప్పుడు? పనులన్నీ ఎప్పటికి పూర్తవుతాయి?