BigTV English

IRCTC Offers: దీపావళికి టికెట్ బుక్ చేసుకున్నారా? ఇప్పుడే త్వరపడండి రాయితీ దొరుకుతుంది!

IRCTC Offers: దీపావళికి టికెట్ బుక్ చేసుకున్నారా? ఇప్పుడే త్వరపడండి రాయితీ దొరుకుతుంది!

Indan Railways: దీపావళి, ఛత్ పూజ దగ్గర పడుతున్న నేపథ్యంలో భారతీయ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. పండుగల వేళ సొంతూళ్లకు వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా రద్దీగా ఉండే రిజర్వ్డ్ కోచ్‌ లు, కిటకిటలాడే రైల్వే స్టేషన్లు దర్శనం ఇవ్వబోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభాన్ని అందించేందుకు  ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) రౌండ్ ట్రిప్ టికెట్ బుకింగ్‌పై 20% వరకు తగ్గింపును అందిస్తోంది. అయితే, IRCTC రైలు టికెట్ బుకింగ్ డిస్కౌంట్ కొన్ని తేదీలలోనే వర్తిస్తుంది. ప్రయాణీకులు తమ రిటర్న్ టికెట్‌ ను బుక్ చేసుకుంటేనే ఈ డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది. టికెట్ డిస్కౌంట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


IRCTC రైలు టికెట్ డిస్కౌంట్ బుకింగ్

అక్టోబర్, నవంబర్‌ లో ఛత్, దీపావళి వేడుకల సమయంలో రౌండ్ ట్రిప్ ప్యాకేజీల కోసం రిటర్న్ జర్నీ టికెట్లపై 20% తగ్గింపు ఉంటుంది. డిస్కౌంట్ సిస్టమ్ కింద బుకింగ్‌ లు ఆగస్టు 14 నుంచి ప్రారంభం అయ్యాయి. ఈ ప్రయోజనం పొందడానికి ప్రజలు ఐదు వారాల సెలవులను ప్లాన్ చేసుకునే అవకాశాన్ని అందిస్తుంది. ఈ డిస్కౌంట్ రౌండ్-ట్రిప్ ప్యాకేజీ అక్టోబర్ 13- 26 మధ్య ప్రయాణాన్ని అనుమతిస్తుంది. తిరుగు ప్రయాణాలను నవంబర్ 17- డిసెంబర్ 1 వరకు బుక్ చేసుకోవచ్చు. ఈ డిస్కౌంట్ టికెట్లకు 60 రోజుల ముందస్తు రిజర్వేషన్ వ్యవధి వర్తించదు.


రైలు టికెట్ బుకింగ్‌ కు అర్హత ఏంటి?

ఈ రైలు టికెట్ బుకింగ్ సిస్టమ్‌ కు ఏకైక అర్హత.. ప్రయాణీకులు రెండు వైపుల ఒకేసారి టికెట్లు బుక్ చేసుకోవాలి. ఇరువైపుల ప్రయాణాలకు ప్రయాణీకుల వివరాలు  సరిపోలాలి.

ఒకవేళ టికెట్లు బుక్ చేసుకుంటే రీఫండ్ ఉంటుందా?  

ఈ ఆఫర్ కింద బుక్ చేసుకున్న టికెట్లను ఏదైనా కారణం చేత రద్దు చేసుకుంటే రీఫండ్ అనేది ఉండదు. రెండు టికెట్లను ధృవీకరించాలి.  ప్రయాణం బోర్డింగ్ స్టేషన్ లో మొదలై, మళ్లీ అక్కడికే చేరాలి.  IRCTC రైల్వే టికెట్ బుకింగ్ పథకం అన్ని తరగతులకు వర్తిస్తుంది. ఫ్లెక్సీ ఛార్జీలు ప్రత్యేక రైళ్లలో ఈ డిస్కౌంట్ లభించదు. అదనంగా, రాయితీ ఛార్జీపై తిరుగు ప్రయాణ బుకింగ్ సమయంలో డిస్కౌంట్లు, రైలు ప్రయాణ కూపన్లు, వోచర్ ఆధారిత బుకింగ్‌లు, పాస్‌లు, PTOలు  అనుమతించబడవు. తిరుగు ప్రయాణ టికెట్లను ఆన్‌ లైన్, కౌంటర్ బుకింగ్‌ లో ఒకే మోడ్‌ ని ఉపయోగించి బుక్ చేసుకోవాలి. పండుగ సీజన్‌ లో ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి పైలట్ ప్రాజెక్టుగా రైల్వే టికెట్ బుకింగ్ కోసం డిస్కౌంట్ వ్యవస్థను అమలు చేశారు. దీపావళి, ఛత్ పండుగ వేడుకల సమయంలో లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లకు తిరిగి వస్తున్నందున రైల్వే ప్రయాణికులతో స్టేషన్లు కిక్కిరిసిపోనున్నాయి. ఈ రద్దీని కంట్రోల్ చేసేందుకు రైల్వే అధికారులు తగిన చర్యలు చేపడుతున్నారు.

Read Also:  స్లీపర్ రేటుకే ఏసీ టికెట్ ధరలు.. అమృత్ ఎక్స్‌ప్రెస్ 3.0 ప్లాన్ అదుర్స్!

Related News

Confirmed Railway Ticket: కన్ఫార్మ్ టికెట్ పక్కా.. సింపుల్ గా ఈ టిప్స్ పాటించండి!

Free Train Travel: రైల్వే ఉద్యోగుల కుటుంబాలు ఫ్రీగా ట్రైన్ జర్నీ చెయ్యొచ్చా? ఇదీ అసలు విషయం!

RailOne-OTT: రైల్‌ వన్ యాప్ లో ఓటీటీ సేవలు.. ఫ్రీగా సినిమాలు చూసేయండి బ్రో!

British Airways: విమానంలో చేయకూడని పని.. పైలట్‌పై వేటు

Amrit Bharat Express: స్లీపర్ రేటుకే ఏసీ టికెట్ ధరలు.. అమృత్ ఎక్స్‌ప్రెస్ 3.0 ప్లాన్ అదుర్స్!

Big Stories

×