Ajith Kumar: ఐపిఎల్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ కీలక మ్యాచ్ జరిగింది. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో… తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన సెలబ్రిటీ లందరూ.. స్టేడియానికి వచ్చారు. మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ ఆడుతున్న నేపథ్యంలో…. తలాను చూసేందుకు తరలివచ్చారు. ఇందులో స్టార్ హీరో అజిత్ కుమార్ ( Ajith Kumar ) అలాగే ఆయన కుటుంబం కూడా స్టేడియానికి రావడం జరిగింది.
Also Read: Kavya Maran: హర్షల్ పటేల్ ను బండ బూతులు తిట్టిన కావ్య.. కమిందును కూడా !
చెన్నై మ్యాచ్ కు అజిత్ ఫ్యామిలీ
చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ నేపథ్యంలో… తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ కుటుంబం స్టేడియానికి రావడం జరిగింది. బ్లాక్ కోట్ వేసుకొని.. అజిత్ కుమార్ మెరవగా గ్రీన్ డ్రెస్ లో ఆయన భార్య శాలిని కనిపించారు. ఇక అజిత్ కుమార్ కుమారుడు చెన్నై సూపర్ కింగ్స్ ఎల్లో జెర్సీలో కనిపించాడు. ఈ ముగ్గురు ఒకే చోట కూర్చొని మ్యాచ్ తిలకించారు. అటు మహేంద్ర సింగ్ ధోని బ్యాటింగ్ కు వచ్చిన సమయంలో అజిత్ కుమార్ ఫ్యామిలీని… కెమెరామెన్ చూపించాడు. దీంతో ఓకే ఫ్రేమ్ లో ఇద్దరూ తలాలు ఉన్నారని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.
అటు తమిళ హీరో శివ కార్తికేయన్ కూడా… ఈ మ్యాచ్ కు రావడం జరిగింది. కాసేపు హీరో అజిత్ కుమార్ తో కలిసి కూడా మ్యాచ్ తిలకించాడు శివ కార్తికేయన్. మధ్యలో తమిళ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కూడా మెరిసింది. ఆమె కూడా తన ఫ్రెండ్స్ తో కలిసి చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కు రావడం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ చెన్నై లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతోంది. అందుకే తమిళనాడు ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్స్ అందరూ ఈ మ్యాచ్ కు రావడం జరిగింది.
400 క్లబ్ లో మహేంద్రసింగ్ ధోని
చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోని సరికొత్త రికార్డు సృష్టించాడు. 400 మ్యాచుల క్లబ్ లో చేరాడు మహేంద్ర సింగ్ ధోని. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ నేపథ్యంలో ఈ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు 400 టి20 మ్యాచ్ లు ఆడిన నాలుగవ ప్లేయర్గా రికార్డు సృష్టించాడు ధోని.
ఇక ఈ లిస్టులో ఇప్పటికే రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్ అలాగే విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉన్నారు. వాళ్ల తర్వాత 400 మ్యాచులు వాడిన సీనియర్ క్రికెటర్గా మహేంద్రసింగ్ ధోని రికార్డు సృష్టించాడు.
Ajith pookie is like a kid and Shalini is sweetly explaining things to him, calling adhu to show someone, ordering coffee for Ak. Ayo love them. Pookies♥️😍#AjithKumar #Ajithshalini #CSKvsSRH pic.twitter.com/FTQgzs2vEK
— Shakthi (@Stargirl117519) April 25, 2025
Pic of the day! ❤️#SK #AarthySK #Ajithkumar #ShaliniAjithkumar pic.twitter.com/SE0M2SELV9
— All India SKFC (@AllIndiaSKFC) April 25, 2025