Train Derailed: ప్రపంచవ్యాప్తంగా ఈ మధ్యకాలంలో విమానాలు, రైళ్లు ప్రమాదాలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా జర్మనీలో ఓ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో నలుగురు మత్యువాతపడ్డారు. దాదాపు 50 మంది వరకు గాయపడ్డారని అధికారులు చెబుతున్నారు.
జర్మనీలో నైరుతి ప్రాంతంలో ఓ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో కనీసం నలుగురు మరణించారు. మరో 50 మంది వరకు గాయపడ్డారని న్యూస్ ఏజెన్సీలు తెలిపాయి. ఈ ఘటన ఆదివారం సాయంత్రం 6 గంటలకు అక్కడి కాలమానం ప్రకారం జరిగినట్టు తెలుస్తోంది. ఫ్రాన్స్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న బిబెరాచ్ జిల్లాలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
జర్మన్ మీడియా వివరాల మేరకు సిగ్మరింగెన్ నుండి ఉల్మ్‌కు ప్రయాణిస్తుండగా రైలు పట్టాలు తప్పింది. డ్యూష్ బాన్ ప్రాంతీయ ఎక్స్‌ప్రెస్ రైలు రెండు బోగీలు పట్టాలు తప్పాయని స్టట్‌గార్ట్‌లో ఫెడరల్ పోలీసు ప్రతినిధి తెలిపారు. ఘటన సమయంలో 100 మంది ప్రయాణీకులు ఉన్నారు.
మ్యూనిచ్ సిటీకి పశ్చిమాన దాదాపు 158 కిలోమీటర్లు దూరంలో బాడెన్-వుర్టెంబర్గ్ రాష్ట్రంలోని రీడ్లింగెన్ పట్టణానికి సమీపానికి అటవీ ప్రాంతంలో జరిగింది. ముగ్గురు బాధితుల్లో రైలు డ్రైవర్, రైలు ఆపరేటర్ డ్యూష్ బాన్ ఉద్యోగి ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన 50 మందిలో 25 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక న్యూస్ ఏజెన్సీలు చెబుతున్నాయి.
ALSO READ: ఐఆర్‌సీటీసీ సూపర్ ఆఫర్.. తిరుపతి నుంచి షిర్డీకి గోల్డెన్ ఛాన్స్
ఘటన సమయంలో రైలు 40 కిలో మీటర్ల వేగంగా ప్రయాణిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రమాదం కారణంగా ఆ ప్రాంతంలో వెళ్లే పలు రైళ్లను ఎక్కడికక్కడ నిలిపివేశారు. ఈ ప్రాంతంలో కొద్దిరోజులు తుఫానులు వచ్చాయని, వర్షాల వల్ల ప్రమాదం జరిగిందా లేదా అనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారని బాడెన్-వుర్టెంబర్గ్ రాష్ట్ర అంతర్గత మంత్రి థామస్ స్ట్రోబుల్ తెలిపారు.
భారీ వర్షాల కారణంగా కొండ చరియలు విడిగిపడ్డాయని అంటున్నారు. దీనివల్లే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఘటన గురించి తెలియగానే మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని వ్యక్తం చేశారు జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్.
🇩🇪 Four people have been killed and several others injured after a passenger train derailed near #Riedlingen, southwest Germany.#Germany #Europe #Train #Derail pic.twitter.com/eORyHCOClW
— TheWarPolitics 🇮🇳 (@TheWarPolitics0) July 28, 2025