Raksha Bandhan: రాఖీ పౌర్ణమి కొన్ని రాశుల వారి జాతకాలను మార్చబోతుందా..? ఆ రాశుల వారు ఇన్నాళ్లు పడ్డ కష్టాలకు చెక్ పడనుందా..? ఆయా రాశుల జాతకులు ఇకపై లైఫ్ లో సక్సెస్ ను చూడబోతున్నారా..? అసలు పౌర్ణమి రోజు ఏర్పడే నవ పంచమ రాజయోగం ఎవరిని రాజులను చేయబోతుంది. ఎవరి జాతకాలు మార్చబోతుంది..? దశ మారే ఆ మూడు రాశులేవో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఈ సంవత్సరం ఆగష్టు ఎనిమిదో తేదీన రాబోతున్న రాఖీ పౌర్ణమి అత్యంత పవర్‌ఫుల్ తిథి అని పండితులు చెప్తున్నారు. ఆ రోజున కుజుడు, వరుణుడు ఒకదానికొకటి నూట ఇరవై డిగ్రీలలో ఉండి.. నవ పంచమ రాజయోగాన్ని సృష్టించబోతున్నారని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. ఈ నవ పంచమ రాజయోగం వల్ల గ్రహ కూటమిలోని మూడు రాశులకు సంబంధించిన వ్యక్తుల జాతకాలు మారబోతున్నాయి. పౌర్ణమి నుంచి వీరికి జీవితం ఉన్నత స్థాయికి వెళ్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయా రాశుల వారికి మహర్ధశ పట్టబోతుంది. ఇంతకీ ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి: ఈ రాశి వారికి రాఖీ పౌర్ణమి నాడు ఏర్పడే శుభయోగం వల్ల అద్బుతమైన ఫలితాలు ఉంటాయి. ఈ సమయంలో ఏ పనులు చేసినా వీరికి కలిసి వస్తుంది .అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వివాహం కానీ వారికి వివాహ యోగం ఉంది. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. ఇది వీరికి శుభ సమయం కావడంతో వ్యాపారాలలో కానీ షేర్ మార్కెట్ లో కానీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులకు పెట్టడం వల్ల విపరీత లాభాలు వచ్చే అవకాశం ఉందట. అదే కాకుండా నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా ఈ సమయం ఎంతో అద్బుతంగా ఉందని పండితులు చెప్తున్నారు.
మిథున రాశి: ఈ మిథున రాశి జాతకులకు కూడా ఈ రాఖీ పౌర్ణమి రోజు ఎంతో అద్బుతమైన యోగకాలం తీసుకురానుంది. నవ పంచమ రాజయోగం కారణంగా వీరి జాతకమే మారిపోనుంది. ఈ సమయంలో శుభవార్తలు వింటారు. అన్ని సానుకూల మార్పులే వస్తాయి. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మిథున రాశి వారికి గతంలో చేసిన అప్పులు తీరి ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ఎన్నో రోజులుగా వేధిస్తున్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది.
మీన రాశి: రాఖీ పౌర్ణమి రోజు ఏర్పడే నవ పంచమ రాజ యోగం కారణంగా మీన రాశి జాతకులకు కూడా అత్యంత అద్బుతమైన యోగ కాలం రానుంది. వీరి జీవితంలో ఇప్పటివరకు పడిన కష్టాలు తీరి జీవితంలో డెవలప్‌మెంట్ మొదలవుతుంది. ముఖ్యంగా వీరి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో సక్సెస్ అవుతారు. నవ పంచమ రాజయోగం కారణంగా వీరికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కెరీర్‌లో కూడా మంచి పురోగతి లభిస్తుంది. వీరికి రాఖీ పౌర్ణమి నుంచి అద్బుతమైన ఫలితాలు రాబోతున్నాయి.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: దేవుని పూజకు పనికిరాని పువ్వులేవో తెలుసా..? అవి వాడితే పుణ్యం కన్నా పాపం చుట్టుకుంటుందట