Sobhita – Naga Chaitanya: యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) సినిమాల కంటే వ్యక్తిగత కారణాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా ‘ఏ మాయ చేసావే’ సినిమాలో హీరోయిన్ గా నటించిన సమంత (Samantha) ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ వైవాహిక బంధంలో నాలుగేళ్లు మాత్రమే కొనసాగారు. ఆ తర్వాత ఆమెకు 2021 లో విడాకులు ఇచ్చారు. విడాకుల అనంతరం కెరియర్ పై ఫోకస్ పెట్టిన నాగచైతన్య.. అనూహ్యంగా మరో హీరోయిన్ శోభిత దూళిపాళ్ల (Sobhita Dhulipala) తో ప్రేమలో పడి, గత ఏడాది పెద్దల సమక్షంలో అన్నపూర్ణ స్టూడియోలో వివాహం చేసుకున్నారు. ఇక శోభితను వివాహం చేసుకున్న తర్వాత అటు నాగచైతన్యకు బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. అందులో భాగంగానే చివరిగా ఆయన నటించిన తండేల్ సినిమాకు ఏకంగా అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రారంభించింది విడుదలైన సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
నా భార్యను ప్రేమగా అలా పిలుస్తాను – నాగచైతన్య
ఇక ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టు చిత్రీకరణలో బిజీగా ఉన్నారు నాగచైతన్య. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగచైతన్య.. అటు సినిమా జీవితంతో పాటు ఇటు వ్యక్తిగత జీవితంపై కూడా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “వరుస సినిమా షూటింగ్స్ కారణంగా బిజీగా ఉండడం వల్లే నా భార్య శోభితతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాను. అందుకే మా ఇద్దరి మధ్య గ్యాప్ రాకూడదని కొన్ని కండిషన్స్ పెట్టుకొని, ఇద్దరం వాటిని ఫాలో అవుతున్నాము. ముఖ్యంగా నా భార్య శోభితను నేను ముద్దుగా ‘బుజ్జి తల్లి’ అని పిలుస్తాను” అంటూ తెలిపారు.
శోభిత – నాగచైతన్య పెట్టుకున్న కండిషన్స్ ఇవే..
ఇకపోతే తామిద్దరం ఎప్పటికీ తమ బంధాన్ని కొనసాగించాలి అనే కారణంతోనే కొన్ని కండిషన్స్ పెట్టుకున్నామని, అందులో మొదటిది ఇంట్లో ఉన్నప్పుడు తప్పకుండా కలిసే భోజనం చేయాలి. అంతేకాదు కలిసి సినిమాలు చూడడం, నైట్ షికార్ కి వెళ్లడం, నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం లేదా వంట చేసుకోవడం ఇలా ప్రతి క్షణాలను మధుర జ్ఞాపకంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారట. ఇక అందులో భాగంగానే అవే రూల్స్ ఫాలో అవుతున్నట్లు తెలిపారు నాగచైతన్య. ఇక శోభితకు పుస్తకాలు చదవడం అంటే ఇష్టమని, తనకు రేసింగ్ పై ఆసక్తి అని, ఇద్దరం కలిసి హాలిడే ప్లాన్స్ వేస్తాము. ఇటీవల తనకు రేస్ ట్రాక్ పై డ్రైవింగ్ కూడా నేర్పించాను అంటూ తెలిపారు.
పిల్లల విషయంలో ఆ జాగ్రత్తలు తప్పనిసరి – నాగ చైతన్య
ముఖ్యంగా పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాము.. 50 ఏళ్ల వయసు వచ్చేసరికి నా భార్య పిల్లలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నాలాగా నా పిల్లలు కాకూడదు. చిన్నప్పటి నుంచే మేమిద్దరం మా పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటాము.. ఇద్దరు పిల్లలు ఉండాలని కోరుకుంటున్నాను. అందులో కొడుకు పుడితే రేస్ ట్రాక్ కు తీసుకువెళ్తాను.. కూతురు పుడితే ఆమె అభిరుచులను ప్రోత్సహిస్తాను.. ఎక్కువగా పిల్లలతోనే సమయం గడుపుతూ.. అమ్మానాన్నతో కలిసి జీవించాలని కోరుకున్న నేను.. కోల్పోయిన ఎన్నో మధుర క్షణాలను మళ్లీ నా పిల్లలతో గడపాలని అనుకుంటున్నాను అంటూ నాగచైతన్య తెలిపారు. ఇక నాగచైతన్య మాటలను బట్టి చూస్తే ఆయన తన బాల్యాన్ని ఎంత మిస్ అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు.
Also read:Anasuya: 30 లక్షల మంది ఫాలోవర్స్ ను బ్లాక్ చేశా.. అసలు నిజం బయటకి.. ట్రోల్స్ వైరల్!