Indian Railways New Rule: దేశ పౌరులకు అతి తక్కువ ఖర్చుతో ఆహ్లాదకర ప్రయాణం అందించడంలో భారతీయ రైల్వే సంస్థ కీలక పాత్ర పోషిస్తున్నది. సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయాలనుకునే ప్యాసెంజర్లు ట్రైన్ లో జర్నీ చేసేందుకు మొగ్గు చూపుతారు. ఇక రైల్వే సంస్థ ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఈజీగా ఆన్ లైన్ లో టికెట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నది. ఇ టికెట్ ద్వారా రైల్లో ఈజీగా జర్నీ చేసే అవకాశం ఉంటుంది. అయితే, ఆన్ లైన్ ద్వారా బుక్ చేసుకున్న టికెట్లతో రైలు ప్రయాణం చేసే సమయంలో మీ దగ్గర మరో కీలక డాక్యుమెంట్ ఉండాలి. లేదంటే ఇ- టికెట్ చెల్లుబాటు కాదు. పైగా టీటీఈ జరిమానా విధించడంతో పాటు రైల్లో నుంచి కిందకు దింపే అవకాశం ఉంటుంది.
ఇంతకీ ఇ-టికెట్ తో ఏం ఉండాలంటే?
ప్రయాణీకులు రైల్వే కౌంటర్ నుంచి టికెట్ కొనుగోలు చేసినట్లైతే ఎలాంటి సమస్య లేదు. టికెట్ తో పాటు అదనంగా మరే డాక్యుమెంట్ చూపించాల్సిన అవసరం లేదు. కానీ, ఆన్ లైన్ లో మీరు టికెట్ బుక్ చేసుకున్నట్లయితే, మీ ఇ-టికెట్ తో పాటు చెల్లుబాటు అయ్యే ఫోటో IDని తప్పకుండా వెంట తీసుకెళ్లాలి. ఒక వేళ చెల్లుబాటు అయ్యే ID ప్రూఫ్ లేకుంటే రైలు టికెట్ ఎగ్జామినర్ (TTE) జరిమానా విధించడంతో పాటు మిమ్మల్ని డిబోర్డ్ చేసే అవకాశం ఉంటుంది. ఇ- టికెట్ తో పాటు ఓటరు ID కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్ లేదంటే ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఇతర ID కార్డును చూపించాల్సి ఉంటుంది.
ఫోటో ID ప్రూఫ్ లేకుంటే ఏమవుతుందంటే?
భారతీయ రైల్వే నింబంధనల ప్రకారం, మీరు ఆన్ లైన్ లో టికెట్ ను బుక్ చేసి, ఐడి ప్రూఫ్ ను మీతో తీసుకురాకపోతే, మీరు టికెట్ లేకుండా ప్రయాణించినట్లుగా పరిగణించబడుతుంది. అలాంటి ప్రయాణీకులకు జరిమానా విధించడంతోపాటు వారిని రైల్లో నుంచి కిందిక దింపే హక్కు రైల్వే అధికారులకు ఉంటుంది. మీరు ధృవీకరించబడిన టికెట్ ను కలిగి ఉన్నప్పటికీ ID ప్రూఫ్ లేకపోతే మీ టికెట్ వ్యాలీడిటీ అనేది ఉండదు. ఆ సమయంలో మీకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. మీరు ప్రయాణించే క్లాస్ ను బట్టి మీకు విధించే ఫైన్ ఆధారపడి ఉంటుంది. మీ బోర్డింగ్ పాయింట్ నుంచి మీరు దిగాల్సిన స్టేషన్ వరకు పూర్తి ఛార్జీని వసూళు చేస్తారు టీటీఈ. మీరు ఏసీ కోచ్ లో ప్రయాణిస్తే రూ. 440 జరిమానా విధిస్తారు. స్లీపర్ కోచ్ లో రూ. 220 వరకు ఫైన్ విధిస్తారు.
ఫైన్ చెల్లించిన తర్వాత సీటు కేటాయిస్తారా?
ఛార్జీలు వసూలు చేయడంతో పాటు జరిమానా చెల్లించిన తర్వాత కూడా సీటు కన్ఫర్మ్ అవుతుందనేది నమ్మకం లేదు. TTE మీ ఇ-టికెట్ ని క్యాన్సిల్ చేసిన తర్వాత మీ సీటు కూడా క్యాన్సిల్ అవుతుంది. ఒక్కోసారి TTE మిమ్మల్ని రైలు నుంచి కిందికి దింపే అవకాశం ఉంటుంది. సో, ఇ టికెట్ తో పాటు ఏదైనా ఐడీ ప్రూఫ్ తీసుకెళ్లడం మంచిది.
Read Also: సంక్రాంతి వేళ ప్రయాణీకులకు గుడ్ న్యూస్, జనవరి నుంచి ఆ రైళ్లకు అదనపు కోచ్‌లు!