Indian Team – WTC Final: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత జట్టుకు మరోసారి చుక్కెదురైంది. మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ టెస్ట్ లో 184 పరుగుల తేడాతో భారత జట్టు ఓటమిపాలైంది. ఐదు టెస్టుల సిరీస్ లో 2 -1 తో ఆస్ట్రేలియా ముందంజలో ఉంది. బ్యాటింగ్ వైఫల్యం కారణంగా భారత్ మరోసారి ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
Also Read: Yashasvi Jaiswal: అంపైర్లు ఛీటింగ్.. వివాదంగా మారిన జైశ్వాల్ వికెట్ !
340 భారీ పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. ఆసీస్ బౌలర్ల ధాటికి 155 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్ లో భారత్ ఓటమితో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్లు పట్టికలో కీలక మార్పు కనిపించింది. దక్షిణాఫ్రికా జట్టు ఫైనల్ లో తన స్థానాన్ని ధ్రువీకరించింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025 టోర్నమెంట్ లోకి ఎంట్రీ ఇచ్చింది దక్షిణాఫ్రికా. తాజాగా పాకిస్తాన్ జట్టును ఓడించి దక్షిణాఫ్రికా డబ్ల్యూటిసి ఫైనల్ కీ చేరింది.
రెండవ స్థానం కోసం ఆస్ట్రేలియా, శ్రీలంక, భారత్ జట్లు తలపడుతున్నాయి. అయితే మెల్ బోర్న్ లో జరిగిన నాలుగోవ టెస్ట్ ఓటమి తర్వాత భారత జట్టు ఆశలకు పెద్ద దెబ్బ తగిలింది. ఈ పరిస్థితిలో డబ్ల్యూటీసి ఫైనల్ రేసు నుంచి భారత జట్టు దాదాపుగా తప్పుకున్నట్లే. కానీ డబ్ల్యూటీసి తుది అర్హత విధి ఇకపై మాత్రం టీమిండియా చేతుల్లో లేదు. అంటే ఇప్పుడు భారత జట్టు ఫైనల్ చేరాలంటే శ్రీలంక మద్దతు అవసరం.
దీనికంటే ముందు ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సిడ్నీ వేదికగా జరిగే చివరి టెస్ట్ లో భారత జట్టు ఎలాగైనా గెలవాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ వచ్చే ఏడాదిలో జరిగే మొదటి మ్యాచ్. ఇందులో ఓడిపోతే ఫైనల్స్ రేసుకు దూరం అవుతుంది భారత జట్టు. ఇందులో గెలిచినప్పటికీ భారత జట్టు ఫైనల్ కి వెళ్లే అవకాశం లేదు. శ్రీలంక – ఆస్ట్రేలియా మధ్య జరగనున్న రెండు టెస్టుల సిరీస్ ఫలితాన్ని బట్టి నిర్ణయం అవుతుంది. ఈ రెండు మ్యాచ్ ల సిరీస్ లో ఆస్ట్రేలియా జట్టు కనీసం ఒక్క మ్యాచ్ లోనైనా ఓడిపోవాలి.
Also Read: Happy Retirement: ఇక మీ సేవలు చాలు.. అశ్విన్ లాగా రిటైర్మెంట్ ఇవ్వండి..!
అప్పుడే భారత జట్టు ఫైనల్ కీ చేరే అవకాశం ఉంటుంది. అలాకాకుండా రెండు మ్యాచ్ లు 0-0 తో డ్రా గా ముగిసినా భారత జట్టు ఫైనల్స్ కి చేరే అవకాశం ఉంటుంది. ఈ సిరీస్ లో శ్రీలంక ఒక్క మ్యాచ్ గెలిచినా.. భారత జట్టు డబ్ల్యూటీసి ఫైనల్ కీ వెళ్లి దక్షిణాఫ్రికా తో తలపడుతుంది. నాలుగోవ టెస్ట్ లో ఓటమితో భారత్ డబ్ల్యూటీసి 2023 25 పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో కొనసాగుతుంది. ఈ ఓటమితో టీమిండియా విన్నింగ్ శాతం 55.89 నుండి 52.77 కి పడిపోయింది. ఇక గెలుపుతో ఆస్ట్రేలియా మాత్రం తన విన్నింగ్ శాతాన్ని 58.89 నుంచి 61.46కి మెరుగుపరుచుకుంది.