Akira Nandan : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కొడుకే అయినప్పటికీ ఏమాత్రం సెలబ్రిటీ స్టేటస్ ను వాడుకోకుండా అకిరా నందన్ (Akira Nandan) ఆటోలో ప్రయాణించారు. తాజాగా సాధారణ మనిషిలా అకీరా ఆటో రిక్షాలో కాశీలో చక్కర్లు కొడుతున్న వీడియోను ఆయన తల్లి రేణూ దేశాయ్ (Renu Desai) సోషల్ మీడియాలో పంచుకున్నారు.
మొక్కై వంగనిదే మానై వంగునా అనే సామెతను వినే ఉంటారు. చిన్నప్పటి నుంచే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వాన్ని అలవాటు చేయాలి పెద్దలు తమ పిల్లలకు. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో వాళ్లు ఎంత ఎత్తుకు ఎదిగినా, ఒదిగి ఉండే మనస్తత్వం ఉంటేనే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు కూడా ఇదే బాటలో నడుస్తున్నాడు. అకీరా నందన్ (Akira Nandan) కాశీలో సందడి చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
సాధారణంగా సెలబ్రిటీలు లేదంటే వాళ్ళ వారసులైనా సరే ఎక్కడికైనా వెళ్తే, వివిఐపి హోదాలో వెళ్లి హడావిడి చేస్తూ ఉంటారు. ముఖ్యంగా దేవాలయాలకు ఇలా వెళ్లడం వల్ల భక్తులకు ఇబ్బందులు ఎదురవుతాయి. పైగా వివిఐపిలు ఇలా ఇబ్బందులు కలిగించినప్పుడు జనాలకు తెగ చిరాకేస్తుంది. కానీ కొంతమంది మాత్రం ఎంతటి సెలబ్రిటీ స్టేటస్ ఉన్నప్పటికీ సింపుల్ గా వెళ్లి జనాల్లో కలిసి పోతుంటారు. అదే విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా కూడా చాలా సింపుల్ గా కాశీ ట్రిప్ లో ప్రయాణిస్తూ కనిపించారు. తన ఫ్రెండ్స్ తో కలిసి అఖీరా ఓ రిక్షాలో సాధారణ మనిషిలా ప్రయాణించడం విశేషం.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">
ఈ విషయాన్ని రేణూ దేశాయ్ స్వయంగా వెల్లడించింది. సోషల్ మీడియాలో ఈ మేరకు అకిరా నందన్ ఆటో రిక్షాలో ప్రయాణిస్తున్న వీడియోను షేర్ చేస్తూ “కాశీలో ట్రావెల్ చేయాలంటే నడుచుకుంటూ వెళ్లాలి. లేదంటే రిక్షాలోనే వెళ్లాలి” అంటూ ఆమె కామెంట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఇక మరోవైపు అకిరా నందన్ సినిమా ఎంట్రీకి రంగం సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ గ్యాంగ్ స్టర్ మూవీ ‘ఓజి’ (OG). డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీని యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతోనే పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఆయన పార్ట్ కు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ‘ఓజీ’ మూవీలో అకీరా పవన్ కళ్యాణ్ చిన్నప్పటి పాత్రను పోషిస్తున్నారు అనే టాక్ నడుస్తోంది. పైగా లీకైన వీడియోలు చూశాక అకీరా మూవీ ఎంట్రీకి ఫుల్ గా ప్రిపేర్ అయినట్టుగా కన్పించాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ మూవీలో అకిరా నందన్ యాక్టింగ్ కు ప్రేక్షకులు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.