పండుగ సీజన్ లో ప్రయాణీకులు ప్రశాంతంగా తమ ప్రయాణాలను కొనసాగించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సూచించారు రద్దీనికి అనుగుణంగా ప్రత్యేక రైళ్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. సోషల్ మీడియాలో రైల్వేలను లక్ష్యంగా చేసుకుని నకిలీ వీడియోలను ప్రసారం చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని అశ్విని వైష్ణవ్ హెచ్చరించారు. ప్రయాణీకులను గందరగోళానికి గురి చేసే ఏ ప్రయత్నాన్ని సహించమన్నారు.
పండుగ రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీ ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లో కొత్తగా నిర్మించిన హోల్డింగ్ ప్రాంతాన్ని పరిశీలించారు. భద్రత, సౌకర్యాల గురించి ప్రయాణీకులతో మాట్లాడారు. పండుగ సీజన్లలో ప్రయాణీకుల రద్దీని తగ్గించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి 12 వేల అదనపు రైళ్లను నడుపుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ పర్యటన సందర్భంగా.. ఆనంద్ విహార్ స్టేషన్ లో భారతీయ రైల్వే ఏర్పాటు చేసిన ప్యాసింజర్ హోల్డింగ్ ఏరియాతో సహా అన్ని ఏర్పాట్లను అభినందించిన ప్రయాణికులతో కూడా తాను సంభాషించానని చెప్పారు. దీపావళి, ఛత్ పండుగల సందర్భంగా లక్షలాది మంది ప్రయాణికులకు రద్దీ నిర్వహణ, ప్రయాణీకుల సౌకర్యాల కోసం ఈ ఏర్పాట్లు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు.
అటు పండుగ రద్దీ వేళ రైల్వే కార్యకలాపాలకు సంబంధించిన తప్పుదారి పట్టించే వీడియోలను ప్రసారం చేయవద్దని మంత్రి అశ్విని వైష్ణవ్ సూచించారు. ఆ వీడియోలు ప్రయాణీకులలో గందరగోళాన్ని సృష్టిస్తాయన్నారు. అవవసర వీడియోలను షేర్ చేయకూడదని నెటిజన్లకు సూచించారు. సోషల్ మీడియాలో రైల్వే గురించి నకిలీ వీడియోలను ప్రసారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం రైల్వే స్టేషన్లలో భారీ రద్దీ ఉన్నప్పటికీ ప్రయాణీకులు ఎటువంటి అసౌకర్యాన్ని ఎదుర్కోకుండా ఉండేలా రైల్వే సమగ్ర ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. “ప్రయాణికుల సౌకర్యం, భద్రత మా ప్రథమ ప్రాధాన్యత. సోషల్ మీడియాలో రైల్వేల గురించి నకిలీ వీడియోలను ప్రసారం చేసే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం. యువత అనవసరంగా చిక్కుల్లో పడకూడదని సూచిస్తున్నాను” అని వైష్ణవ్ వెల్లడించారు.
అటు దీపావళి, ఛత్ పూజ లాంటి పండుగ నేపథ్యంలో 12వేల ప్రత్యేక రైలు సర్వీసులను నడుపుతున్నామంటూ అశ్విని వైష్ణవ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ విమర్శలు చేసింది. ఈ విమర్శలను రైల్వే ఖండించింది. ‘రీల్ మినిస్టర్.. 12వేల రైళ్లు ఎక్కడ?’ అంటూ కాంగ్రెస్ సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టింది. దానికి రైల్వే కౌంటర్ ఇచ్చింది. పండుగ సీజన్ లో ప్రయాణీకుల సౌలభ్యం కోసం అక్టోబర్, నవంబర్ నెల్లో దేశ వ్యాప్తంగా నడిపే 12వేలకు పైగా ప్రత్యేక రైళ్ల లిస్టును సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. పండుగల సందర్భంగా ప్రయాణీకులు సజావుగా ప్రయాణాలు చేసేలా ఈ రైలు సర్వీసులను నడిపిస్తున్నట్లు వెల్లడించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణీకులను తప్పుదోవ పట్టించేలా ఫేక్ వీడియోలను షేర్ చేయకూడదని సూచించింది.
त्योहारों के दौरान यात्रियों की सुविधा हेतु
भारतीय रेल द्वारा 12,000 से अधिक विशेष ट्रेन सेवाएँ संचालित की जा रही हैं।
इन ट्रेनों की संपूर्ण सूची 👇🏼https://t.co/gT8L4P0L0Fअपील:
त्योहारों के समय यात्री अपने परिजनों से मिलने रेल सेवाओं का लाभ उठा रहे हैं।
ऐसे में भ्रामक वीडियो… https://t.co/gPZ3tk3PJ7— Ministry of Railways (@RailMinIndia) October 19, 2025
Read Also: గుడ్ న్యూస్, ఇక పోస్టాఫీసులోనూ రైల్వే టికెట్లు బుక్ చేసుకోవచ్చు.. ఇదిగో ఇలా!