Big Tv Live Originals: రైలు ప్రయాణం సజావుగా సాగేలా చూసుకోవడంలో టికెట్ కలెక్టర్ (TC) కీలక పాత్ర పోషిస్తారు. కేవలం టిక్కెట్లను తనిఖీ చేయడమే కాకుండా ప్రయాణీకుల సమస్యలను కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. ప్రయాణీకులు క్రమశిక్షణతో ప్రయాణం చేసేలా చూడటంతో పాటు రైల్వేలో భద్రతకు భరోసా ఇస్తారు. అయితే, రైలు టికెట్ కలెక్టర్ ఎన్ని గంటలు డ్యూటీ చేస్తారు? రెస్ట్ టైమ్ ఎంత ఉంటుంది? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
⦿ షిఫ్ట్ లు. వర్కింగ్ అవర్స్
రైలు టికెట్ కలెక్టర్ వర్కింగ్ అవర్స్ అనేవి ఇన్ని గంటలు అని కచ్చితంగా ఉండదు. రైల్వే రకం, పనిచేసే రైల్వే నెట్ వర్క్ ఆధారంగా మారుతూ ఉంటాయి. చాలా వరకు టీసీలు షిఫ్ట్ లలో పని చేస్తారు. సాధారణంగా ఒక్కో టీసీ రోజుకు 8 నుంచి 12 గంటల పాటు డ్యూటీ చేస్తారు. ఈ షిఫ్ట్ లు రౌండ్ ది క్లాక్ ఉండేలా రూపొందించారు. ఎల్లప్పుడూ TC డ్యూటీలో ఉండేలా చర్యలు తీసుకుంటారు.
⦿ సుదూర రైళ్లు, డ్యూటీ టైమ్ పొడిగింపు
సుదూర రైళ్లలో టీసీ పని కేవలం టికెట్లు పరిశీలించడం మాత్రమే కాదు. టికెట్లను కన్ఫర్మ్ చేయడంతో పాటు ప్రయాణీకులకు సందేహాలకు సమాధానాలు చెప్తుంటారు. స్టాప్‌ల గురించి సమాచారం అందించడం, ప్రయాణ సమయంలో తలెత్తే ఏవైనా సమస్యలను పరిష్కరిస్తుంటారు. కొన్ని సందర్భాలలో, సుదూర రైళ్లలోని టీసీలు రైలు ప్రయాణ పొడవును బట్టి రాత్రిపూట లేదంటే వరుసగా కొద్ది రోజుల పాటు పని చేసే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి వారం, 10 రోజుల పాటు ఇంటికి దూరంగా ఉండాల్సి వస్తుంది.
⦿ లోకల్, తక్కువ దూర రైళ్లు
సుదూర సేవలకు భిన్నంగా, స్థానిక, తక్కువ దూర రైళ్లలో పనిచేసే TCలు సాధారణంగా తక్కువ షిఫ్ట్ లను నిర్వహిస్తారు. ఈ రైళ్లు ఒక నిర్దిష్ట ప్రాంతం లేదంటే నగరంలో నడుస్తాయి. ప్రయాణ సమయాలు సాధారణంగా చాలా వేగంగా ఉంటాయి. TCలు ఈ తక్కువ వ్యవధిలో మాత్రమే పని చేయాల్సి ఉంటుంది.
⦿ ప్రయాణానికి ముందు, తర్వాత డ్యూటీ అవర్స్
టీసీ డ్యూటీ అవర్స్ ను నిర్ణయించడంలో ఒక ముఖ్యమైన అంశం రైలు ప్రయాణానికి ముందు, ఆ తర్వాత గడిపిన సమయం. రైలు బయలుదేరే ముందు TC డ్యూటీకి రిపోర్ట్ చేయాలి. రైలును తనిఖీ చేయడం, టికెట్ సమాచారాన్ని ధృవీకరించి, ప్రయాణానికి ప్రతిదీ సిద్ధంగా ఉందని నిర్ధారించడం చేస్తారు. రైలు గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత TC డ్యూటీ అయిపోయినట్లు కాదు. రైలు తిరుగు ప్రయాణానికి సిద్ధంగా ఉందని నిర్ధారించుకుంటారు.
⦿ వీకెండ్, హాలీడేస్ లో పని చేయడం
చాలా మంది రైల్వే ఉద్యోగుల మాదిరిగానే, TC లు తరచుగా వీకెండ్స్ లో ప్రభుత్వ సెలవు దినాల్లో పని చేయాల్సి ఉంటుంది. రైళ్లు సంవత్సరంలో ప్రతి రోజు నడుస్తాయి. పండుగలు, సెలవులు, ఇతర రద్దీ సమయాల్లో TC లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ప్రయాణీకుల సంఖ్య పెరుగుదలకు అనుగుణంగా TC లు పనిచేయాల్సి వస్తుంది.
⦿ పని గంటల ఇబ్బందులు
TC డ్యూటీ అవర్స్ అనేవి ఎప్పుడూ ఒకేలా ఉండవు. కొన్నిసార్లు వర్కింగ్ అవర్స్ పొడిగిస్తారు. అన్నిరకాలుగా డ్యూటీ చేసేందుకు రెడీగా ఉండాలి. ఆయా అవసరాలు, ప్రయాణ డిమాండ్ ను బట్టి పని షెడ్యూల్ అప్పటికప్పుడు మారుతూ ఉంటుంది.
Read Also: సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక రైలు.. కేవలం తెలుగువారి కోసమే, ఎక్కడెక్కడ ఆగుతుందంటే?