Saraswati Pushkaralu: మే 15 నుంచి సరస్వతి పుష్కరాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. అయోధ్య- కాశీ పుణ్యక్షేత్ర యాత్ర పేరుతో ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. 9 రాత్రులు, 10 పగళ్లు కొనసాగే యాత్ర, సికింద్రాబాద్ నుంచి ప్రారంభం అవుతుంది. భారత్ గౌరవ్ ఎక్స్ ప్రెస్ ప్రయాణీకులు బయల్దేరుతారు. ఈ రైల్లో మొత్తం 718 సీట్లు అందుబాటులో ఉంటాయి. వీటిలో 460 స్లీపర్, 206 థర్డ్ ఏసీ, 52 సెకెండ్ ఏసీ సీట్లు ఉంటాయి.
మే 8న సికింద్రాబాద్ నుంచి ప్రయాణం
భారత్ గౌరవ్ ఎక్స్ ప్రెస్ ద్వారా పలు పుణ్యక్షేత్రాలను చూసే అవకాశం ఉంటుంది. మే 8న సికింద్రాబాద్ నుంచి బయల్దేరే భారత్ గౌరవ్ ఎక్స్ ప్రెస్ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా ఒడిశాకి వెళ్తుంది. ఆ తర్వాత బీహార్ కు వెళ్లి అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్ కి చేరుతుంది. అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అవుతుంది.
ఈ రైలు ఎక్కడెక్కడ ఆగుతుందంటే?
సికింద్రాబాద్ నుంచి ప్రయాణాన్ని మొదలు పెట్టే ఈ ఎక్స్ ప్రెస్, భువనగిరి, జనగామ, ఖాజీపేట్, వరంగల్, మహబూబాద్, డోర్నకల్ జంక్షన్, ఖమ్మం, మధిరతో పాటు ఏపీలో విజయవాడ, తెనాలి, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం స్టేషన్ లో ఆగి ప్రయాణీకులను ఎక్కించుకుంటుంది. ఈ స్టేషన్లలో ప్రయాణీకులకు బోర్డింగ్ తో పాటు డీబోర్డింగ్ అకాశాన్ని కల్పిస్తున్నారు.
ఏ పుణ్యక్షేత్రాలను చూసే అవకాశం ఉందంటే?
అయోధ్య- కాశీ పుణ్యక్షేత్ర యాత్ర ప్యాకేజీలో భాగంగా పూరీ, గయ, వారణాశి, అయోధ్య, ప్రయాగ్ రాజ్ కు వెళ్లవచ్చు. పూరీలో జగన్నాథుడి ఆలయం, కోణార్క్ సూర్య దేవాలయాలను దర్శించుకోవచ్చు. గయలో విష్ణుపాద ఆలయం, వారణాశీలో కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి, అన్నపూర్ణేశ్వరి అమ్మవారి ఆలయాలకు వెళ్లవచ్చు. ఆ తర్వాత అయోధ్యలో చారిత్రాత్మక బాలరాముడి ఆలయం, హనుమాన్ గర్హి ఆలయాల్లో పూజలు చేయవచ్చు. అక్కడి సరయూ నది హారతిలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అనంతరం ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలను ఆచరించవచ్చు. ప్రయాగ్ రాజ్ తో ఈ ప్యాకేజీ టూర్ అయిపోతుంది. అక్కడి నుంచి మళ్లీ సికింద్రాబాద్ భారత్ గౌరవ్ ఎక్స్ ప్రెస్ రైలు బయల్దేరుతుంది.
Read Also: సమ్మర్ లో ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? తక్కువ ఖర్చులో వెళ్లొచ్చే దేశం ఇదే!
ప్యాకేజీ ఛార్జీ వివరాలు
ఇక ఈ ప్యాకేజీలో భాగంగా స్లీపర్ లో ప్రయాణించే వారు ఒక్కొక్కరు రూ. 16,800 చెల్లించాల్సి ఉంటుంది. ఇదే క్లాస్ లో పిల్లలు వెళ్తే 11 సంవత్సరాల్లోపు వారికి రూ. 15,700 చెల్లించాలి. ఇక థర్డ్ ఏసీలో పెద్దలకు రూ.26,600, పిల్లలకు రూ. 25,300, సెకెండ్ ఏసీలో పెద్దలకు రూ. 34,900, పిల్లలకు రూ. 33,300 చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఈ వెబ్‌సైట్‌ని సందర్శించండి. https://www.irctctourism.com/pacakage_description?packageCode=SCZBG41
Read Also: కొద్ది రోజులు ఊటీ, కొడైకెనాల్ వెళ్లొద్దు.. ఎందుకంటే?
Read Also: వెయిటింగ్ లిస్టు టికెట్లు ఎలా కన్ఫర్మ్ అవుతాయి? IRCTC ఏ విధానం ఫాలో అవుతుందంటే?