BigTV English

World’s Best Sleeper Trains: ప్రపంచంలోని బెస్ట్ స్లీపర్ రైళ్లు ఇవే.. జీవితంలో ఒక్కసారైనా ప్రయాణించాల్సిందే!

World’s Best Sleeper Trains: ప్రపంచంలోని బెస్ట్ స్లీపర్ రైళ్లు ఇవే.. జీవితంలో ఒక్కసారైనా ప్రయాణించాల్సిందే!

Best Sleeper Trains: ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అద్భుతమైన రైళ్లు ఉన్నాయి. వాటిలో ఒక్కసారైనా జర్నీ చేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలాంటి వాటిలో కొన్ని స్లీపర్ రైళ్లు కూడా ఉన్నాయి. స్టార్ హోటళ్లను తలపించేలా ఉన్న బెస్ట్ స్లీపర్ రైళ్ల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


⦿ షికి-షిమా, జపాన్

ఈ రైలు తూర్పు జపాన్ లో ఉంటుంది. అత్యంత అద్భుతమైన వసతులను అందించడంతో పాటు అద్భుతమైన ప్రదేశాల మీదుగా వెళ్తూ ప్రయాణీకులను ఎంతో ఆహ్లాదపరుస్తుంది. సెండాయ్‌ నుంచి బయల్దేరే ఈ రైలు ‘సీజన్స్ ఆఫ్ ఈస్టర్న్ జపాన్’ పేరుతో టూరిస్టులను ఐదు రోజుల పాటు తీసుకెళ్తున్నది. తీరప్రాంతాలు, పర్వతాలను మీదుగా కనువిందు చేస్తూ ముందుకుసాగుతుంది. ఈ అల్ట్రా- మోడ్రన్ రైలులోని సూట్లు లగ్జరీ క్యాబిన్ తో పాటు ప్రత్యేకంగా తయారు చేయబడిన సైప్రస్ బాత్, సాంప్రదాయ టాటామీ మాట్లతో కూడిన రెండు-అంతస్తుల్లో ఉంటుంది. ఇందులో చక్కటి జపాన్ వంటకాలను అందిస్తారు.


⦿కెనడియన్, కెనడా

కెనెడాలో  VIA రైల్ అత్యంత ప్రత్యేకమైన స్లీపర్ రైలు. దీన్ని ‘ది కెనడియన్’ అని పిలుస్తారు. వాంకోవర్ నుంచి మొదలయ్యే ఈ రైలు టొరంటో వరకు ప్రయాణిస్తుంది. 6 నుంచి 19 రోజుల వరకు ప్రముఖ పర్యాటక ప్రాంతాలను కలుపుతూ వెళ్తుంది. ఈ రైలు 4,446 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. ఇందులో కూడా ప్రత్యేమైన సూట్లు ఉంటాయి.  ప్రెస్టీజ్ క్లాస్ క్యాబిన్ డబుల్ బెడ్, ఫ్లాట్ స్క్రీన్ మానిటర్, పర్సనల్ కన్సైర్జ్‌ తో టర్న్‌ డౌన్ సర్వీస్ అందుబాటులో ఉంది.

⦿ఎల్ ట్రాన్స్‌ కాంటాబ్రికో గ్రాన్ లుజో, స్పెయిన్

ఇది నారో-గేజ్ రైలు మార్గంలో నడుస్తుంది. స్పెయిన్ ఉత్తర తీర ప్రాంతంలో ఈ రైలు ప్రయాణిస్తుంది. శాన్ సెబాస్టియన్ నుంచి శాంటియాగో డి కంపోస్టెలా వరకు 7 రోజుల పాటు ప్రయాణిస్తుంది. అద్భుతమైన శాంటాండర్ బీచ్ ల మీదుగా ఈ రైలు వెళ్తుంది. ఈ రైల్లోని సూట్లలో లెదర్ బాంకెట్ సీటింగ్, హార్డ్‌ వుడ్ ప్యానలింగ్‌ తో డబుల్ బెడ్లు ఉంటాయి. టీ సెలూన్, పనోరమా కోచ్, ఎంటర్‌ టైన్‌ మెంట్ సెలూన్, చిన్న నైట్‌ క్లబ్ కూడా ఉన్నాయి.

⦿ సెవెన్ స్టార్స్ రైలు, జపాన్

ఈ రైలును క్యుషు రైల్వే సంస్థ నడిపిస్తుంది. ఈ సెవెన్ స్టార్స్ రైలు క్యుషు ప్రాంతాన్ని కవర్ చేస్తుంది. మొత్తం మూడు రోజుల పాటు ఈ రైల్లో ప్రయాణించే అవకాశం ఉంటుంది. సాంప్రదాయ ఒన్సెన్స్, అద్భుతమైన ఉషినోహామా తీరం చూసే అవకాశం ఉంటుంది. ఈ రైలు ఇంటీరియర్లు రిచ్ వుడ్ ఫర్నీచర్, డెకర్‌ తో ఖరీదైన హోటల్ మాదిరిగా ఉంటుంది. అత్యంత సుందరమైన ప్రదేశాలను వీక్షించేలా ఈ రైలు ఉంటుంది. ఇందులో చక్కటి జపాన్ ఫుడ్ అందిస్తారు.

⦿ రాయల్ కెనడియన్ పసిఫిక్, కెనడా

పాతకాలపు తరహా క్యారేజీలతో రాయల్ కెనడియన్ పసిఫిక్ అత్యంత అద్భుతంగా ఉంటుంది. నాలుగు రోజుల పాటు ఈ రైల్లో ప్రయాణించే అవకాశం ఉంటుంది. నేషనల్ పార్క్స్ ఆఫ్ బాన్ఫ్, వాటర్టన్ లేక్స్ లాంటి పర్యాటక ప్రాంతాల మీదుగా ఈ ప్రయాణం కొనసాగుతుంది. ఇందులో చక్కటి ఫుడ్, డ్రింక్స్ అందిస్తారు. చక్కటి వుడ్ ఇంటీరియర్‌ తో ఈ రైలును నిర్మించారు. ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభూతిని కలిగిస్తుంది.

⦿ రోవోస్ రైలు, దక్షిణాఫ్రికా

రోవోస్ రైల్లో చెక్కతో చేసిన బోగీలు ఉంటాయి. అత్యంత ఖరీదైన ఎడ్వర్డియన్ స్టైల్ డిజైన్ ను కలిగి ఉంటుంది. ఈ రైలు 5,800 కీలో మీటర్ల మేర ప్రయాణిస్తుంది.  కేప్ టౌన్ నుంచి టాంజానియాలోని దార్ ఎస్ సలామ్ వరకు ఈ ప్రయాణం కొనసాగుతుంది. ఇందులో ఓపెన్-ఎయిర్ బాల్కనీ ఉంటుంది. ఆఫ్రికన్ వన్యప్రాణులను చక్కగా చూసే అవకాశం ఉంటుంది. అత్యంత విలాసవంతమైన, రాయల్ సూట్, ఒక లాంజ్, విక్టోరియన్ బాత్‌తో కూడిన బాత్రూమ్, ప్రత్యేక షవర్‌తో కూడిన క్యారేజ్‌ను కలిగి ఉంటుంది. చక్కటి ఫుడ్ ను అందిస్తారు.

Read Also: రాధేశ్యామ్ లో పూజా హెగ్డేలా రైలుకి వేలాడిన యువతి, రెప్పపాటులో ఘోరం!

Related News

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డ్.. ఒక్క రోజులోనే ఇంత మంది ప్రయాణికులా?

Mumbai Coastal Road: రూ. 12 వేల కోట్లతో మలుపుల రోడ్డు.. లైఫ్ లో ఒక్కసారైనా జర్నీ చేయండి!

Dirtiest railway stations: దేశంలోనే అత్యంత మురికిగా ఉన్న రైల్వే స్టేషన్లు ఇవేనట.. మీ స్టేషన్ కూడా ఉందా?

Railway history: ఈ రైలు వయస్సు 170 ఏళ్లు.. నేటికీ ట్రాక్ పై పరుగులు.. ఎక్కడో కాదు మన దేశంలోనే!

Railway passenger rules: రైల్వేలో ఈ రూల్ ఒకటి ఉందా? తెలుసుకోండి.. లేకుంటే ఇబ్బందే!

Vande Bharat Train: జర్నీకి పావుగంట ముందు.. IRCTCలో వందేభారత్ టికెట్స్ ఇలా బుక్ చేసుకోండి!

Big Stories

×