Manchu Family..టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీ గా గుర్తింపు తెచ్చుకుంది మంచు కుటుంబం (Manchu family). ఎంతోమందికి ఒకప్పుడు అండగా నిలిచిన ఈ కుటుంబంలో సడన్గా గొడవలు రావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu), మంచు విష్ణు(Manchu Vishnu)ఒకవైపు.. మంచు మనోజ్(Manchu Manoj)ఇంకొక వైపు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సడన్గా రెండు రోజుల క్రితం మంచు మోహన్ బాబు , మంచు మనోజ్ ఆస్తి విషయంలో గొడవలు పడ్డారని వార్తలు వచ్చాయి. ఈ విషయంపై మంచు మోహన్ బాబు టీమ్ స్పందించి, ఇవన్నీ తప్పుడు వార్తలని కొట్టి పారేసింది. ఆ కొద్దిసేపటికి మంచు మనోజ్ గాయాలతో హాస్పిటల్లో కనిపించారు. దీంతో గొడవలు వార్తలకు మరింత బలం చేకూరింది. తన తండ్రితో గొడవ పడినప్పుడు డయల్ 100 కి ఫోన్ చేసిన మంచు మనోజ్.. నిన్న నేరుగా పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి, తనపై తన కొడుకు, భార్యపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని కంప్లైంట్ ఇచ్చారు. అంతేకాదు తనపై దాడి జరగడానికి, తన కుటుంబ సభ్యులకు ఎటువంటి సంబంధం లేదని కూడా ఆయన తెలిపారు.
మౌనిక, మనోజ్ లపై మోహన్ బాబు కంప్లైంట్..
అయితే అనూహ్యంగా మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ పై, ఆయన భార్య భూమా మౌనికపై కంప్లైంట్ చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తనకు మనోజ్ నుంచి ప్రాణహాని ఉందని, తనను కాపాడాలంటూ కూడా ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. “నిన్న రాత్రి 11 గంటలకు మోహన్ బాబు తన కొడుకు మనోజ్, కోడలు మౌనిక నుంచి ముప్పు పొంచి ఉందని, రక్షణ కల్పించాలని”వాట్సప్ లో ఫిర్యాదు ఇచ్చారు. ఇక ఆయన ఫిర్యాదు మేరకు మనోజ్ మరియు మౌనికపై సెక్షన్ 329, 351 కింద కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు మంచు మనోజ్ ఇచ్చిన కంప్లైంట్ లో మోహన్ బాబుకు చెందిన పదిమంది అనుచరులపై పహాడీ షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఇక ఈ విషయాలు ఎంతవరకు వెళ్తాయో చూడాలి.
అండగా మంచు లక్ష్మీ..
ఇక అసలు విషయంలోకి వెళ్తే.. గతంలో మనోజ్ తన తండ్రితో కలిసి కనిపించిన దాఖలాలు చాలా తక్కువ అని చెప్పాలి. మొదటి భార్యతో విడాకుల తర్వాత మంచు మనోజ్ అటు ఇండస్ట్రీకి కూడా దూరమయ్యారు. ఇటీవల తాను ప్రేమించిన రాజకీయ నేత వారసురాలు భూమా మౌనిక రెడ్డి తో వివాహం జరిగినప్పుడు కూడా మంచు ఫ్యామిలీ గెస్ట్ లు గానే వార్తలు కూడా వినిపించాయి.అందుకే మంచు లక్ష్మి దగ్గరుండీ మరీ మనోజ్ పెళ్లి జరిపించింది.
మంచు ఫ్యామిలీ రియాక్షన్ ఏంటో..
ఇదిలా ఉండగా గతంలో మంచు మనోజ్ , మంచు విష్ణు మధ్య గొడవలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఈ గొడవలపై స్పందించమని మంచు విష్ణు ని ఒక షోలో ప్రశ్నించగా.. ఆయన లేచి కోట్ విప్పి మరీ సీరియస్గా మా ఇంట్లో గొడవలు వాళ్లకెందుకు అంటూ నెటిజన్స్ ను ఉద్దేశించి కామెంట్లు చేశారు. దాంతో అందరూ సైలెంట్ అయిపోయారు. కానీ మంచు ఫ్యామిలీ ప్రెస్టేజియస్ మూవీ గా వస్తున్న కన్నప్ప సినిమా విషయంలో దారుణంగా ట్రోల్స్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అంతేకాదు సినిమాపై నెగెటివిటీ స్ప్రెడ్ చేసిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ని కూడా మంచు విష్ణు బ్లాక్ చేయించారు. ఇక దీంతో ఎప్పుడెప్పుడు చేతికి చిక్కుతారా అని చూసిన యూట్యూబర్స్ కి ఇప్పుడు మంచు ఫ్యామిలీ మంచి కంటెంట్ ఇచ్చింది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ గొడవలు ఎంతవరకు దారి తీస్తాయో చూడాలి.