Pushpa2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప 2.. ఈ మూవీకి సుకుమార్ దర్శకత్వం వహించారు. ఇటీవలే ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ఐదు రోజులు అవుతున్నా కూడా సినిమా టాక్ మారలేదు. బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసేలా కలెక్షన్స్ ఉన్నాయి. కేవలం ఐదు రోజుల్లోనే పుష్ప 2 1000 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. అన్ని ఏరియాల్లో ఈ మూవీ దున్నెస్తుంది.. ఇదే జోరులో మూవీ కొనసాగితే మాత్రం గతంలో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తుందని బన్నీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటుగా ఇతర రాష్ట్రాల్లో కూడా కలెక్షన్ల ఊచకోత మొదలైంది.. మలయాళంలో అల్లు అర్జున్ మంచి సక్సెస్ టాక్ ను అందుకోవడం విశేషం.. తెలుగు హీరోకు అక్కడ సినీ అభిమానులు నిరాజనం పలుకుతున్నారు. అసలు మలయాళంలో బన్నీ సక్సెస్ అవ్వడానికి కారణం ఓ వ్యక్తి.. ఆయన వల్లే అల్లు అర్జున్ మల్లు అర్జున్ అయ్యాడని ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ అతను ఎవరు? అతని సినిమాల గురించి తెలుసుకుందాం..
గతంలో వచ్చిన పుష్ప మూవీ నేషనల్ వైడ్ గా రిలీజ్ అయ్యింది. ముఖ్యంగా మలయాళంలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అసలు బన్నీకి అంతగా క్రేజ్ రావడానికి కారణం ఖాదర్ హాసన్.. ఈయన సహాయ దర్శకుడు, నిర్మాత, డిస్ట్రిబ్యూటర్. ఆయన హైదరాబాదులో ‘ఆర్య’ సినిమా చూసి, ఆయనకు నచ్చి ఆయనే ఆ సినిమాను మలయాళంలోకి తేవాలని అనుకున్నారు. అల్లు అర్జున్ అనే పేరును ‘మల్లు’ అర్జున్ అని మార్చింది కూడా ఆయనే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని చెప్పారు.. ఈయన గొంతు వల్లే మలయాళంలో అల్లు అర్జున్ నిలబడటానికి కారణం ఆయనే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.. ఆయన సీరియల్స్, సినిమాలకు డబ్బింగ్ చెప్తుండేవాడు. ఈయన కన్నా ముందు మరో ముగ్గుర్ని అల్లు అర్జున్‌కి డబ్బింగ్ చెప్పేందుకు పిలిచారు. కానీ వాళ్లెవరి గాత్రంతోనూ ఆయన తృప్తిగా లేరు. నా చేత కూడా డబ్బింగ్ చెప్పించారు. కానీ ఆయన ఏమాత్రం సంతృప్తి చెందలేదు.. చివరికి సినిమాను పూర్తి చేశారు.
ఈయన సినిమా మొత్తానికి డబ్బింగ్ చెప్పారు. అది నచ్చడంతో నన్నే పుష్ప 2 కూడా తీసుకున్నారని చెప్పారు. ఇక అల్లు అర్జున్‌కి డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టినప్పుడు ఇద్దరం దాదాపు ఒకే వయసులో ఉన్నాం. కాలం గడుస్తుండగా ఇద్దరం వయసు పెరిగాం. ఆయన నటనతోపాటు నా వాయిస్ కూడా మరికొంత గంభీరంగా మారింది. పైగా అల్లు అర్జున్ తెలుగులో చెప్పే డైలాగుల్ని మలయాళ నేటివిటీకి తగ్గట్లు మార్చడంలోనూ ఆయన దిట్ట అందుకే అల్లు అర్జున్ అక్కడ ఈ స్థాయిలో నిలబెట్టాడు.. అది అసలు విషయం.. మల్లు స్టార్ కు ఆ క్రేజ్ రావడానికి కారణం ఈయనే..
ఇక పుష్ప 2 సినిమా విషయానికొస్తే.. దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో పుష్ప 2ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ఇందులో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11000 థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ 5 రోజులకు గాను 900 కోట్లకు పైగా క్రాస్ ను అందుకుంది.. వారంలోపే 1000 కోట్లు రాబట్టడం మామూలు విషయం కాదు..