E-Paper
Advertisement

Loco pilot: రైలు రన్నింగ్ లో ఉండగా లోకో పైలట్ నిద్రపోతే? 60 సెకెన్ల తర్వాత ఏం జరుగుతుందంటే?

Loco pilot: రైలు రన్నింగ్ లో ఉండగా లోకో పైలట్ నిద్రపోతే? 60 సెకెన్ల తర్వాత  ఏం జరుగుతుందంటే?
Advertisement

Indian Railway Safety System: ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థల్లో భారతీయ రైల్వే ఒకటి. నిత్యం లక్షలాది మంది ప్రయాణీకులు రైళ్ల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. దేశ రవాణాకు జీవనాడి లాంటి రైల్వే వ్యవస్థలు ప్రమాదాలను తగ్గించేందు అత్యాధునిక భద్రతా వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొచ్చారు. రైళ్లు ఎదరెదురుగా వచ్చి ఢీకొనకుండా కవచ్ వ్యవస్థను తీసుకురావగా, అనుకోని పరిస్థితులలో లోకోపైలెట్ నిద్రపోయినా, గుండెపోటు లాంటి సమస్య తలెత్తినా, ప్రయాణీకుల ప్రాణాలు రిస్క్ లో పడకుండా కాపాడేందుకు విజిలెన్స్ కంట్రోల్ డివైస్ లాంటి వ్యవస్థలను తీసుకొచ్చారు. లోకో పైలెట్ నిమిషం పాటు స్పందించకపోతే, ఈ సిస్టమ్ రైలును తన ఆధీనంలోకి తీసుకొని ఎమర్జెన్సీ బ్రేక్స్ వేసి రైలును ఆపేస్తుంది. ఇంతకీ ఈ విజిలెన్స్ కంట్రోల్ డివైస్ అంటే ఏంటి? ఎలా పని చేస్తుంది? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

విజిలెన్స్ కంట్రోల్ డివైస్ అంటే ఏంటి? ఎలా పని చేస్తుంది?   

రైలు నడుస్తున్న సమయంలో లోకో పైలెట్ కు గుండెపోటు రావడం లేదంటే నిద్రపోవడం లాంటి మర్జెన్సీ పరిస్థితులలో ప్రమాదం జరుగకుండా ఉండేందుకు భారతీయ రైల్వేల్లో పలు భద్రతా వ్యవస్థలు ఉన్నాయి. ఇవి డ్రైవర్ అప్రమత్తంగా లేకపోయినా రైలును కంట్రోల్ చేసేందుకు సాయపడతాయి. వాటిలో ముఖ్యమైనది విజిలెన్స్ కంట్రోల్ డివైస్ (VCD). ఇది లోకో పైలెట్ అప్రమత్తంగా ఉన్నాడా? లేడా? అని చూసే భద్రతా వ్యవస్థ. డ్రైవర్ నుంచి స్పందన రాకపోతే, రైలును తన ఆధీనంలోకి తీసుకుని రైలును ఆపేస్తుంది. ప్రమాదం జరగకుండా చేస్తుంది.

VCD పని చేసే విధానం

Advertisement

⦿ డ్రైవర్ యాక్టివిటీస్ ను గమనిస్తుంది: లోకో పైలెట్ క్యాబిన్ లో థ్రోటిల్ మార్చడం, బ్రేక్ వేయడం, హార్న్ కొట్టడం, ఇతర కంట్రోల్ బటన్లు ఉపయోగించడం లాంటి వివరాలను గమనిస్తుంది. ఈ పనులు చేస్తుంటే VCD లోకో పైలెట్ అప్రమత్తంగా ఉన్నాడని భావిస్తుంది.

⦿ 60 సెకన్ల పాటు స్పందించకపోతే?: సుమారు నిమిషం పాటు డ్రైవర్ ఎలాంటి కంట్రోల్‌ ను ఉపయోగించకపోతే మొదట విజువల్ అలర్ట్ (లైట్) వస్తుంది. కొద్ది సెకన్లలో అలారం మోగుతుంది.

Advertisement

⦿ లోకో పైలెట్ స్పందించకపోతే?: అలారం వచ్చిన తర్వాత కూడా లోకో పైలెట్ స్పందించకపోతే, VCD యాక్టివేట్ అవుతుంది. రైలును తన ఆధీనంలోకి తీసుకుంటుంది. ఆటోమేటిక్‌గా ఎమర్జెన్సీ బ్రేక్ వేసి రైలును ఆపేస్తుంది. ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడుతుంది.

⦿ VCD ఎందుకు చాలా ముఖ్యమంటే?: డ్రైవర్ నిద్రపోతే ప్రమాదం జరగకుండా కాపాడుతుంది. సిగ్నల్ దాటే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ప్రయాణికుల భద్రత పెరుగుతుంది. భారత రైల్వేలోని అన్ని ఎలక్ట్రిక్, డీజిల్ లోకోమోటివ్‌ లలో VCD తప్పనిసరి చేశారు. ఇది రైల్వే భద్రతలో చాలా కీలకమైన సిస్టమ్ గా పని చేస్తుంది.

అటు రైల్లలో ఆటోమేటిక్ వార్నింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. కొన్ని మార్గాల్లో సిగ్నల్‌ను దాటిపోతే లేదంటే, వేగం ఎక్కువైతే ఈ సిస్టమ్ స్వయంగా బ్రేక్ వేస్తుంది. లోకో పైలెట్ స్పందించకపోయినా రైలు ప్రమాదకర పరిస్థితుల్లోకి వెళ్లకుండా ఆపేస్తుంది. మరోవైపు రైలును కంట్రోల్ రూమ్ నుంచి కూడా మానిటరింగ్ చేస్తారు. రైలు వేగం, కదలికలను గమనిస్తుంటారు. ఏదైనా అబ్ నార్మల్ గా అనిపిస్తే వెంటనే అలర్ట్ అవుతారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా రైలును ఆపే ప్రయత్నం చేస్తారు.

Read Also: భౌగోళిక అద్భుతం ఖేష్మ్.. హోర్ముజ్‌ ను నియంత్రించే భూగర్భ క్షిపణి నగరంగా ఎలా మారింది?

Related News

టికెట్ ఉంటే స్టేషన్‌ లో ఎంతసేపు ఉండొచ్చు? చాలామందికి తెలియని రైల్వే రూల్!

స్పీడందుకుంటున్నాయ్ లగ్జరీ ప్రయాణాలు.. విజయవాడ ప్రయాణికులకు వందే భారత్ స్లీపర్ ధమాకా!

వీధులను ముంచెత్తిన బీరు వరద.. ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసిన ఘటన గురించి మీకు తెలుసా?

పక్షులతో యుద్ధం చేసి ఓడిపోయిన దేశం.. ఈ ఆసక్తికర చరిత్ర మీకు తెలుసా?

విమానాలతో పోటీపడి దూసుకెళ్తున్న రైళ్లు.. వీటి స్పీడ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

గోవా కంటే బెటర్.. పర్యాటకులను ఆకట్టుకుంటున్న 5 కొత్త టూరిస్ట్ డెస్టినేషన్స్

లోకో పైలెట్ నిద్రపోతే ఏం జరుగుతుంది? భారతీయ రైల్వేలో ఈ సీక్రెట్ సిస్టమ్ గురించి తెలుసా!

గంగమ్మ నిత్యం జలాభిషేకం చేసే అద్భుత శివలింగం.. ఈ దృశ్యం చూస్తే మైమరచిపోతారు!

Big Stories

Advertisement
×