High-Speed Trains Seat Belts: టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో చాలా దేశాల్లో హైస్పీడ్ రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి. భారత్ లో ఇప్పుడిప్పుడే సెమీ హైస్పీడ్ రైళ్లు ప్రయాణీకులకు సేవలను అందిస్తున్నాయి. ప్రపంచంలో అత్యధిక హైస్పీడ్ రైళ్లు ఉన్న దేశంగా చైనా గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు, అత్యధిక వేగంతో ప్రయాణించే హైస్పీడ్ రైళ్లు కూడా చైనాలోనే ఉన్నాయి. జపాన్, కొరియాతో పాటు కొన్ని యూరప్ దేశాల్లోనూ హైస్పీడ్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. అయితే, విమానాలు, కార్లలోనూ సీటు బెల్టు కచ్చితంగా పెట్టుకోవాలని అధికారులు సూచిస్తుంటారు. అయితే, హైస్పీడ్ రైళ్లలో మాత్రం సీటు బెల్టులు ఉండవు. ఎందుకో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
హై-స్పీడ్ రైళ్లలో సీటు బెల్టులు ఎందుకు ఉండవు?
చైనాలోని హైస్పీడ్ రైళ్లు గంటకు ఏకంగా 350 కి.మీ ప్రయాణిస్తాయి. ఇందుకోసం ప్రత్యేకమైన రైల్వేట్రాక్ లు ఉంటాయి. ఇవి చాలా మృదువుగా ఉంటాయి. లేన్ మారడం కూడా చాలా సున్నితంగా ఉంటుంది. చైనీస్ హైస్పీడ్ రైళ్లలో దాదాపు సడెన్ బ్రేకింగ్ ఉండదు. రోలర్ కోస్టర్ రైడ్ లాగా అనిపిస్తుంది. అందుకే హైస్పీడ్ రైళ్లలో సీట్ బెల్టులు అవసరం లేదు. ప్రయాణీకులు ఎప్పుడు కావాలంటే అప్పుడు చుట్టూ తిరిగే అవకాశం ఉంటుంది. ఎలాంటి పరిమితులు లేకుండా వాష్ రూమ్ కు వెళ్లే అవకాశం ఉంటుంది.
సీటు బెల్టులు మరింత ప్రమాదకరమా?
హైస్పీడ్ రైళ్లలో సీట్ బెల్టులు ఉపయోగించడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో మంచి కంటే చెడే ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. హైస్పీడ్ రైలు సడెన్ బ్రేక్ వేసినప్పుడు వేగం 300 కిమీ నుంచి 0కు పడిపోతుంది. సీటు బెల్టుల కారణంగా ప్రయాణీకులు ఎక్కువ ఒత్తడికి గురై గాయపడే అవకాశం ఉంటుంది. పొట్ట భాగంతో పాటు వెన్నెముక దెబ్బతింటుంది. అందుకే, హైస్పీడ్ రైళ్లలో సీటు బెల్టులు ఉండవు.
Read Also: రైల్వే ట్రాక్ పై ఐరన్ పైపు.. కటకటాల్లో 20 ఏండ్ల యువకుడు!
హైస్పీడ్ రైళ్లలో క్రాష్ బారియర్ సేఫ్టీ సీట్లు
హైస్పీడ్ రైళ్లలో రక్షణ విషయం ప్రత్యేక ఏర్పాటు చేశారు. సీటు బెల్టులతో పోల్చితే మరింత ప్రొటెక్షన్ కల్పించేలా క్రాష్ బారియర్ సీట్లు అమర్చారు. వాస్తవానికి చైనాలో రైలు సీట్లు ప్రత్యేకంగా కనిపించవు. కానీ, అవి నిర్దిష్ట పదార్థాలతో తయారు చేస్తారు. ఇవి ప్రయాణీకులకు ఎలాంటి గాయాలు కాకుండా కాపాడుతాయి. ఇంకా చెప్పాలంటే బ్యాక్ ఒత్తిడిని గ్రహించేందుకు కుషన్ లాగా కుదించబడుతుంది. దీని వల్ల ప్రయాణీకులకు ఎలాంటి గాయాలు కావు. అయితే, లేటెస్ట్ టెక్నాలజీతో తయారు చేయబడిన చైనా హైస్పీడ్ రైళ్లు అత్యంత సురక్షితమైనవి. ప్రయాణీకులు రక్షణ కోసం ప్రత్యేకంగా ఎలాంటి సేఫ్టీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. రైలు బోగీల నిర్మాణమే ప్రయాణీకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డిజైన్ చేశారు. చైనాలోనే కాదు, ఇతర దేశాల్లోని హైస్పీడ్ రైళ్లలో కూడా సీటు బెల్టులు ఉండవు. వీటి కారణంగా జరిగే మంచి కంటే నష్టమే ఎక్కువ అంటున్నారు నిపుణలు.
Read Also: రైలు ఫ్లోర్ మీద కూర్చున్న పెళ్లి కూతురు, వైరల్ పిక్ వెనుక అసలు సంగతి ఏంటంటే?