Railway News: ఓ వధువు రైలు ఫ్లోర్ మీద కూర్చొని ప్రయాణిస్తున్న ఫోటో గత రెండు రోజులు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ ఫోటోను చూసి రైల్వే సంస్థపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద ప్రయాణీకుల విషయంలో రైల్వేశాఖ దారుణంగా వ్యవహరిస్తోందని కామెంట్స్ పెడుతున్నారు. అయితే, ఆ ఫోటోను బేస్ చేసుకుని కొంత మంది కావాలనే భారతీయ రైల్వే సంస్థపై తప్పుడు ప్రచారం చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇంతకీ ఈ ఫోటో వెనుకున్న అసలు సంగతి ఏంటంటే..
ఈ నెల 19న ఫోటో షేర్ చేసిన జితేష్
నవంబర్ 19న జితేష్ అనే ఓ వ్యక్తి రైలు ఫ్లోర్ మీద కూర్చొని ఉన్న వధువు ఫోటోను ఎక్స్ వేదికగా షేర్ చేశాడు. “ధన్యవాదాలు, అశ్విని వైష్ణవ్ జీ. మీ వల్ల నా భార్యకు ఈ రోజు ప్రపంచ స్థాయి రైల్వే సౌకర్యంతో ప్రయాణిస్తుంది. నేను మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను” అని రాసుకొచ్చాడు. ఈ పోస్టు కాసేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రైల్వే తీరును చాలా మంది తప్పుబట్టారు.
స్పందించిన రైల్వే సంస్థ
ఈ ఫోటో వైరల్ అయిన నేపథ్యంలో రైల్వే సేవా స్పందించింది. జితేష్ ను PNR నంబర్ వివరాలు చెప్పాలని కోరింది. “దయచేసి PNR/UTS Noతో పాటు మొబైల్ నెంబర్ ను ఇవ్వండి. వెంటనే మీ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తాం” అని కోరింది. పదే పదే PNR వివరాలు చెప్పాలని జితేష్ ను రిక్వెస్ట్ చేసినప్పటికీ ఆయన పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో చాలా మంది నెటిజన్లు ఆ పోస్టు మీద అనుమానాలు వ్యక్తం చేశారు.
Thank you @AshwiniVaishnaw ji because of you my wife is getting this world class Train facility today.
I will always be indebted to you 🙏 pic.twitter.com/w9W2WwLK90
— Jitesh (@Chaotic_mind99) November 19, 2024
ఫేక్ ప్రచారం చేస్తున్న రితేష్ పై నెటిజన్ల ఆగ్రహం
రేల్వే సేవా రియాక్ట్ అయినా, రితేజ్ తన వివరాలను చెప్పకపోవడంతో ఇదంతా ఓ ఫేక్ ప్రచారంగా నెటిజన్లు భావిస్తున్నారు. కేవలం రైల్వే సంస్థ మీద ఫేక్ ప్రచారం చేసేందుకు అతడు ఈ ఫోటోను వాడుకుంటున్నట్లు మండిపడ్డారు. నిజానికి ఆమె తన భార్యే కాదని మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు. అతడి కంటే ముందే మరో ఎక్స్ అకౌంట్ ద్వారా ఆ ఫోటోను షేర్ చేశారంటూ ఆధారాలతో సహా బయటపెడుతున్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న రితేష్ లాంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఒకవేళ రితేష్ చెప్పినట్లు ఆమె తన భార్య అయినప్పటికీ, “కన్ఫర్మ్ చేసిన రిజర్వేషన్ టికెట్ లేకుండా రిజర్వ్ చేయబడిన కోచ్ లో ప్రయాణించడం నేరం. ఆమె కోసం కన్ఫర్మ్ టికెట్ బుక్ చేయకపోవడం పట్ల భర్తగా నువ్ విఫలం అయినందుకు సిగ్గుపడాలి. ఇంకా చెప్పాలంటే రైల్వే అధికారులు పోనీలే అని వదిలేశారు. ఆమెను కిందికి దిగాలని చెప్పలేదు” అని ఓ నెటిజన్ రాసుకొచ్చాడు. “నీ భార్య కోసం ముందుగా సీటు బుక్ చేయలేని నువ్వు రైల్వే మంత్రిత్వశాఖను నిందించడం నిజంగా బాధ్యతా రాహిత్యం” అంటూ మరికొంత మంది మండిపడుతున్నారు. త్వరలోనే ఈ ఫోటో వెనుకున్న అసలు నిజాలను రైల్వేశాఖ బయటపెట్టే అవకాశం ఉంది.
Read Also: రైల్వే ట్రాక్ పై ఐరన్ పైపు.. కటకటాల్లో 20 ఏండ్ల యువకుడు!