E-Paper
Advertisement

విమానం టేకాఫ్ ముందు లైట్లు ఆపేస్తారు.. ఎందుకో తెలుసా?

విమానం టేకాఫ్ ముందు లైట్లు ఆపేస్తారు.. ఎందుకో తెలుసా?
Advertisement

విమానంలో ప్రయాణించే చాలా మందికి ఓ విషయం తెలిసే ఉంటుంది. విమానం టేకాఫ్‌ అవుతున్నప్పుడు, ల్యాండింగ్ అయ్యేటప్పుడు క్యాబిన్‌ లోని లైట్లను డిమ్ చేస్తారు. కొన్నిసార్లు పూర్తిగా చీకటి కాకపోయినా, సాధారణంగా ఉండే లైట్ తో పోలిస్తే చాలా తక్కువ లైట్ ఉంటుంది. చాలామంది దీని గురించి పెద్దగా ఆలోచించరు. కానీ, దీని వెనుక పెద్ద కారణం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

క్యాబిన్ లైట్లు ఎందుకు డిమ్ చేస్తారంటే?

Advertisement

విమాన ప్రయాణంలో టేకాఫ్, ల్యాండింగ్ అనేది అత్యంత కీలకమైన సమయాలుగా భావిస్తారు. ఎక్కువ శాతం ప్రమాదాలు,   సాంకేతిక సమస్యలు ఈ సమయంలోనే జరుగుతాయని విమానయాన నిపుణులు చెబుతుంటారు. అందుకే, ఈ సమయంలో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటారు. క్యాబిన్ లైట్లను డిమ్ చేయడానికి ప్రధాన కారణం ప్రయాణికులను చీకటి పరిస్థితులకు అలవాటు చేయడమే. సాధారణంగా మనం ఎక్కువ లైట్ లో ఉంటే, ఒక్కసారిగా చీకటిలోకి వెళ్తే కొద్ది సెకన్ల పాటు స్పష్టంగా కనిపించదు. ప్రయాణికులు అలవాటు పడేందుకు కొంత సమయం అవసరం అవుతుంది.

అటు టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడి విమానం విద్యుత్ సరఫరా కోల్పోతే, క్యాబిన్‌ లోని సాధారణ లైట్లు పని చేయకపోవచ్చు. అలాంటి సమయంలో ప్రయాణికులు ఇప్పటికే తక్కువ లైటింగ్ కు అలవాటు పడి ఉంటే బాగుంటుంది. విమానాల్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్లు, ఎగ్జిట్ సైన్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. ప్రమాద సమయంలో ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకెళ్లేందుకు ఉపయోగపడతాయి. అయితే, క్యాబిన్ మొత్తం ఎక్కువ వెలుతురుతో ఉంటే ఈ లైటింగ్స్ అంత స్పష్టంగా కనిపించవు. లైట్లు మసకబారినప్పుడు మాత్రం ఎగ్జిట్ గుర్తులు మరింత స్పష్టంగా కనిపిస్తాయి. ప్రయాణికులు గందరగోళానికి గురికాకుండా వేగంగా స్పందించే అవకాశం ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రతి సెకను విలువైనదే. కొన్ని క్షణాల ఆలస్యం కూడా ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంటుంది. అందుకే ముందుగానే లైట్లను తగ్గించి ప్రయాణికులను రెడీగా ఉండేలా చేస్తారు.

ప్రమాద హెచ్చరిక కాకపోయినా..

Advertisement

నిజానికి లైట్స్ డిమ్ చేయడం అనేది ప్రమాద హెచ్చరిక కాదు. విమానం సురక్షితంగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో ఎదురయ్యే అత్యవసర పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని తీసుకునే ముందస్తు జాగ్రత్త మాత్రమే. ప్రపంచంలోని దాదాపు అన్ని విమానయాన సంస్థలు ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి. టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో సీటు బెల్ట్‌ లు ధరించాల్సి ఉంటుంది. ట్రే టేబుల్స్ మడవాలి. సీట్లను నిటారుగా ఉంచాలి లాంటి సూచనలను కూడా ఇస్తుంటారు. క్యాబిన్ లైట్లను మసకబార్చడం కూడా ఈ భద్రతా చర్యల్లో ఒక భాగమే. సో, విమానంలో లైట్లు తగ్గించినప్పుడు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన పని లేదు. ప్రయాణికుల భద్రత కోసం తీసుకునే ముందస్తు జాగ్రత్తగా చెప్పుకోవచ్చు.

Read Also: హైదరాబాద్ To తిరుమల కారవాన్ జర్నీ.. ఒక్కొక్కరికి ఎంత ఖర్చు అవుతుందంటే?

Related News

ఆగస్టు 17 నుంచే భోగాపురం ఎయిర్‌పోర్ట్ సేవలు.. ఏ నగరానికి ఎన్ని ఫ్లైట్స్ అంటే?

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఎందుకంత ప్రత్యేకం? మీకు తెలియని ఇంట్రస్టింగ్ విశేషాలు ఇవే!

భోగాపురమే కాదు, ఇండియాలోని ఈ ఎయిర్‌పోర్టులూ సిటీకి దూరమే.. ఎంత టైమ్ పడుతుందంటే?

రైళ్లలో భారీ లగేజ్‌లు తీసుకెళ్లేవాళ్లకి షాక్.. కొత్త రూల్స్ ఇవే!

మనిషి కంటే ఎత్తు.. 15 ఏళ్లకు ఒక్కసారే పూచే ‘హిమాలయన్ డైమండ్’ విశేషాలివే!

పాస్‌పోర్ట్ రంగుల అసలు రహస్యం తెలుసా? బ్లూ, రెడ్, గ్రీన్, బ్లాక్ దేనికి సంకేతమంటే..!

విశాఖ రైల్వే స్టేషన్‌కు మహర్దశ.. ఎయిర్‌పోర్ట్ రేంజ్ సౌకర్యాలు.. 6 కొత్త ప్లాట్‌ఫామ్‌లు!

ఒక్క TTE‌కి ఎన్ని కోచ్‌లు కేటాయిస్తారు? ఇండియన్ రైల్వే రూల్స్ ఏం చెబుతున్నాయి?

Big Stories

Advertisement
×