E-Paper
Advertisement

తిరుపతి జిల్లాలో పెను ప్రమాదం.. ప్రైవేట్ బస్సులో చెలరేగిన మంటలు!

తిరుపతి జిల్లాలో పెను ప్రమాదం.. ప్రైవేట్ బస్సులో చెలరేగిన మంటలు!
Advertisement

Bus Fire: తిరుపతి జిల్లా తడ సమీపంలో భారీ ప్రమాదం తప్పింది. శ్రీసిటీలోని ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులతో వెళ్తున్న ఓ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అదృష్టవశాత్తూ డ్రైవర్, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీసిటీలోని ‘IMOP’ కంపెనీకి చెందిన ఉద్యోగులు తమ విధి నిర్వహణ ముగించుకుని ప్రైవేటు బస్సులో సూళ్లూరుపేటకు బయలుదేరారు. బస్సు తడ సమీపంలోకి రాగానే ఇంజిన్ భాగం నుండి అకస్మాత్తుగా పొగలు, మంటలు వ్యాపించాయి. దీన్ని గమనించిన డ్రైవర్ వెంటనే వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపివేసి, లోపల ఉన్న ఉద్యోగులను అప్రమత్తం చేశారు.

Advertisement

సమయస్ఫూర్తితో వ్యవహరించిన ఉద్యోగులంతా ఒకరినొకరు సాయం చేసుకుంటూ క్షణాల వ్యవధిలో బస్సు నుంచి కిందకు దిగిపోయారు. వారు దిగిన కొద్దిసేపటికే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించి అగ్నిగోళంలా మారింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో బస్సులో ఉన్నవారెవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అటు కంపెనీ యాజమాన్యం, ఇటు కార్మిక కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.

Also Read: కారుపై పడిన కొమ్మలు తీస్తూ.. కరెంట్ షాక్‌తో తండ్రి, కూతురు దుర్మరణం!

Advertisement

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×