Paradise Movie Budget Rumours: ఇంటర్వ్యూలు, పాటలు, ట్రైలర్..ఒకప్పుడు సినిమా రిలీజ్ దగ్గరపడితే హీరో గురించే ఎక్కువ చర్చ జరిగేది.కాని ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది.సినిమా పేరు ప్రకటించిన రోజు నుంచి కథ కంటే ముందు బడ్జెట్ గురించే చర్చ మొదలవుతోంది. పైగా ప్రతి వారం ఒక కొత్త ఫిగర్ బయటకు వస్తోంది కూడా.
ఈరోజు రూ.100 కోట్లు అంటారు… రెండు వారాల తర్వాత రూ.160 కోట్లు అంటారు… నెల తిరిగే సరికి రూ.220 కోట్లని కొత్తగా మరో ఫిగర్ వినిపిస్తుంది.దీంతో అసలు మీరు సినిమా కోసం బడ్జెట్ పెడుతున్నారా లేక బడ్జెట్ కోసం సినిమా తీస్తున్నారా అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు మూవీ లవర్స్.
మరో రూ.60 కోట్లు పెరిగిందని టాక్
ఇపుడు తాజాగా నాని నటిస్తున్న ‘పారడైస్’ సినిమా చుట్టూ కూడా ఇలాంటి గాసిప్సే ఎక్కువ వినిపిస్తున్నాయి మరి.మొదట సినిమాని వంద నుండి 150 కోట్ల మధ్యలో సినిమాని కంప్లీట్ చేస్తామని బరిలోకి దిగారట మేకర్స్.కానీ ఇపుడు వినిపిస్తున్న టాక్ ఏంటంటే ఇంకా సినిమాకి మరో రూ.60 కోట్లు పెరిగిందని టాక్.దీంతో సినిమాని ఎలా బయటపడేయాలా అని నాని ఫుల్ టెన్షన్ పడుతున్నాడని రకరకాల గాసిప్స్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
దీంతో “ఇది ఇక్కడికి ఆగుతుందా లేక రిలీజ్ కల్లా మరో 60 కోట్లు పెరుగుతాయా అంటూ అంటూ సెటైర్స్ వేస్తున్నారు నెటిజన్లు.నిజానికి భారీ బడ్జెట్ పెట్టడం తప్పు కాదు. కథకు అవసరమైతే నిర్మాతలు ఎంతైనా ఖర్చు పెట్టొచ్చు. మంచి క్వాలిటీ కోసం, విజువల్స్ కోసం, యాక్షన్ కోసం పెట్టే ప్రతి రూపాయి తెరపై కనిపిస్తే ప్రేక్షకుడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు.కానీఇప్పటి ప్రేక్షకుడు కూడా చాలా తెలివిగా ఆలోచిస్తున్నాడు. ప్రతి వారం కొత్త బడ్జెట్ ఫిగరే బయటకు రావడం కాస్త కామెడీగా కనిపిస్తుంది.ఈ మధ్య కాలంలో చాలాసినిమాల విషయంలో ఇదే ట్రెండ్ కనిపిస్తుండడం కాస్త ఆశ్చర్యమే.సినిమా కంప్లీట్ కాకముందే బడ్జెట్ మూడు నాలుగు సార్లు మారిపోతుంది.ఎందుకనేది మేకర్సే ఆలోచించాలి.
వినిపించే ప్రతి నంబర్ నిజమేనా?
అయితే అంతటా వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే..ఫిలింనగర్‌లో వినిపించే ప్రతి నంబర్ నిజమేనా? లేక సినిమాపై హైప్ పెంచడానికి వస్తున్న ప్రచారమా?అని ఎందుకంటే ఈ మధ్య కాలంలో బడ్జెట్ కూడా ఒక ప్రమోషన్ టూల్‌గా మారిపోయిందనే అభిప్రాయం ఇండస్ట్రీలో చాలామందిలో పాతుకుపోయింది.
“ఇంత భారీ బడ్జెట్”, “ఇంత పెద్ద సెట్లు”, “హాలీవుడ్ టెక్నీషియన్స్”, “అంతర్జాతీయ స్థాయి విజువల్స్” అనే మాటలు వినిపిస్తే ప్రేక్షకుల్లో ఆటోమేటిక్‌గా ఆసక్తి పెరుగుతుందని భావిస్తున్నారేమో కాబోలు.కానీ ఇపుడున్న ఈ సోషల్ మీడియా యుగంలో ఆడియన్స్ అంత అమాయలు కారన్నది మేకర్స్ గుర్తుంచుకుంటే చాలు .బడ్జెట్ ఎంత అన్నది కంటే… సినిమా ఎలా ఉంది? డబ్బులు పెట్టి చూసేంత విషయం ఉందా? అనే దాన్నే ఎక్కువ చూస్తున్నారు ఇప్పటి ఆడియన్స్. ఎందుకంటే గతంలో భారీ బడ్జెట్‌తో వచ్చిన కొన్ని సినిమాలు ఫ్లాప్ అయితే చిన్న బడ్జెట్‌తో వచ్చిన సినిమాలు మాత్రం సూపర్ హిట్ అయ్యాయి మరి.
సోషల్ మీడియాలో రోజుకో కొత్త సెటైర్
అందుకే బడ్జెట్ లెక్కలు విన్న వెంటనే నమ్మేయడం కంటే… సినిమా రిలీజ్ అయ్యాక చూసి మాట్లాడితేనే బెటర్. ఎందుకంటే చివరికి ప్రేక్షకుడికి గుర్తుండేది బడ్జెట్ కాదు… సినిమా.కాబట్టి ‘పారడైస్’ బడ్జెట్ గురించి వస్తున్న వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు. మేకర్స్ అధికారికంగా చెబితేనే అసలు లెక్క తెలుస్తుంది. అప్పటి వరకు మాత్రం ఫిలింనగర్‌లో రోజుకో కొత్త ఫిగర్, సోషల్ మీడియాలో రోజుకో కొత్త సెటైర్ కనిపిస్తూనే ఉంటాయి.
also read :శోభిత ధూళిపాళ ర్యాంప్ వాక్.. చూపు తిప్పుకోలేకపోతున్న నెటిజన్లు!