E-Paper
Advertisement

కారుపై పడిన కొమ్మలు తీస్తూ.. కరెంట్ షాక్‌తో తండ్రి, కూతురు దుర్మరణం!

కారుపై పడిన కొమ్మలు తీస్తూ.. కరెంట్ షాక్‌తో తండ్రి, కూతురు దుర్మరణం!
Advertisement

Electric Shock: స్వేచ్ఛ బ్యూరో: అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టెలికాం కాలనీలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. గత రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఇంటి ముందు పార్క్ చేసిన కారుపై చెట్టు కొమ్మలు విరిగి పడ్డాయి. వాటిని తొలగించే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి తండ్రి సందీప్ (44), కూతురు రితిక (16) మృతిచెందారు.

స్థానికుల వివరాల ప్రకారం.. కారుపై పడిన చెట్టు కొమ్మలను తొలగిస్తుండగా వాటికి సమీపంలోని విద్యుత్ తీగలు తగిలి ఉండటంతో ఒక్కసారిగా కరెంట్ ప్రవహించింది. ఈ ప్రమాదంలో రితిక విద్యుత్ షాక్‌కు గురికాగా, ఆమెను రక్షించే ప్రయత్నంలో తండ్రి సందీప్‌కు కూడా విద్యుత్ షాక్ తగిలింది. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

అదే సమయంలో సహాయం చేసేందుకు వెళ్లిన సందీప్ భార్య శ్వేత (40)కు కూడా విద్యుత్ షాక్ తగలడంతో తీవ్రంగా గాయపడింది. ఆమెను కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే సమీప ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

సమాచారం అందుకున్న అల్వాల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Also Read:చంద్రబాబు పేరుతో సైబర్ మోసం.. డీప్‌ఫేక్ కాల్‌తో రూ. 80 వేలు స్వాహా!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×