కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుడు కొలువై ఉన్న దివ్యక్షేత్రం తిరుమల. ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా? శ్రీవారిని దర్శించుకోవాలా? అని చాలా మంది ఎదురు చూస్తారు. కొంత మంది ముందుగానే ప్లాన్ చేసుకుని తిరుమలకు ఫ్యామిలీతో లేదంటే ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తారు. మరికొంత మంది అప్పటికప్పుడు అనుకొని తిరుమలకు వెళ్తారు. ముందస్తుగా ప్లాన్ చేసుకునే వారు దర్శనం టికెట్లు, ఉండేందుకు గదులు బుక్ చేసుకుంటారు. కానీ, అప్పటికప్పుడు వెళ్లే వాళ్లకు గదులు అంత ఈజీగా దొరకవు. తిరుమలలో అప్పటికప్పుడు కొంత మందికి అందిస్తున్నా, చాలా మందికి అవి సరిపోవు మిగతా వాళ్లు లాకర్ తీసుకుని తమ సామాన్లు అందులో పెట్టుకుని బయట ఉంటారు. కానీ, ఇకపై తిరుమల కొండ మీద రూమ్ కోసం ఇబ్బంది పడక్కర్లేదు. ఇలా చేస్తే, ఈజీగా రూమ్ లభిస్తుంది.
తిరుమల కొండ మీద టీటీడీ అందించే గదులతో పాటు కొన్ని మఠాలు కూడా ఉన్నాయి. ఆయా మఠాలలోనూ ఉండేందుకు గదులు ఉంటాయి. ఈ మఠాలలో వీకెండ్స్ లో గదులు దొరకడం కాస్త కష్టం అయినా, మిగతా రోజుల్లో ఈజీగా దొరుకుతాయి. ఆయా మఠాలకు వెళ్లి దర్శనం టోకెన్స్ లేదంటే టికెట్స్ చూపిస్తే రూమ్స్ అందిస్తారు. కొన్ని మఠాలు దర్శనం టోకెన్స్ లేకున్నా గదులు ఇస్తారు. ఇక్కడ రూ. 700 నుంచి యావరేజ్ రూమ్స్ అందుబాటులో ఉంటాయి. ఐదుగురు లేదంటే ఆరుగురు కలిసి ఉంటే మూడు నుంచి నాలుగు వేలు తీసుకుంటారు.
Read Also: తెలంగాణలో కంచి ఆలయం.. తప్పకుండా ఒక్కసారైనా వెళ్లాల్సిందే!
తిరుమలలో గదులు అందించే పలు మఠాలు ఉన్నాయి. వాటిలో కంచి కామకోటి మఠం, చిన్న జీయర్ స్వామి మఠం, మౌనస్వామి మఠం, విశాఖ శారద పీఠం, శృంగేరి శంకర మఠంతో పాటు ఏకంగా 35 మఠాల్లో గదులు అందిస్తారు. చాలా మందికి మఠాల్లో రూమ్స్ దొరుకుతాయని తెలియక ఇబ్బంది పడుతారు. కొంత మంది కొండ కిందికి వెళ్లి లాకర్స్ తీసుకుని ఉంటారు. ఇకపై అప్పటికప్పుడు తిరుమల టూర్ ప్లాన్ చేసినా, కొండ మీదకు వెళ్లి మఠాల్లో రూమ్స్ కోసం ప్రయత్నించవచ్చు. ఒక అరగంట తిరిగితే ఈజీగా రూమ్ దొరికే అవకాశం ఉంటుంది. సో, ఇకపై ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. హ్యాపీగా మఠంలోని గదుల్లో ఉంటూ తిరుమల శ్రీవారిని దర్శించుకోండి. కలియుగ ప్రత్యక్షదైవ ఆశీర్వాదాలు పొందే ప్రయత్నం చేయండి.
Read Also: కార్వాన్ కాంపెన్ To క్యాంప్ ఫైర్ విత్ తంబోలా.. ఒక్కసారైనా ఈ క్రేజీ ఎక్స్ పీరియెన్స్ చేయాల్సిందే!