E-Paper
Advertisement

Viral News: రైల్లో చొరబడ్డ 40 మంది ఆగంతకులు, ప్రాణ భయంతో వాష్ రూమ్ లో దాక్కున్న మహిళ.. సీన్ కట్ చేస్తే..

Viral News: రైల్లో చొరబడ్డ 40 మంది ఆగంతకులు, ప్రాణ భయంతో వాష్ రూమ్ లో దాక్కున్న మహిళ.. సీన్ కట్ చేస్తే..
Advertisement

Viral News: రైల్లో ఒంటరిగా ప్రయాణించే మహిళకు భద్రత లేదని మరోసారి రుజువైంది. జైనగర్-మణిహరి జాంకీ ఎక్స్‌ ప్రెస్ కంపార్ట్‌ మెంట్‌ లో పెద్ద గొడవ జరగడంతో ఓ మహిళా ప్రయాణికురాలు రైలు వాష్‌ రూమ్‌ లో తాళం వేసుకోవలసి వచ్చింది. బీహార్‌ లోని కతిహార్ జంక్షన్ దగ్గర ఈ భయానక పరిస్థితి నెలకొంది. అక్రమంగా రైలు లోపలికి దూసుకెళ్లిన కొంత మంది పురుషులు గొడవ సృష్టించారని తెలుసుకుని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) వెంటనే రైలు కోచ్ లోకి వెళ్లి ఆ మహిళను తిరిగి తన సీట్లో కూర్చొబెట్టారు.

వాష్ రూమ్ లో భయంతో 

ఒంటరిగా ప్రయాణిస్తున్న ప్రయాణీకురాలు వాష్‌ రూమ్ లోపల చిక్కుకున్న వీడియోను రికార్డ్ చేసింది. ఊహించని ఘటనలో భయంతో వణికిపోయిన ఆ మహిళ..  “రైలులో గొడవ జరిగింది. బయటి నుంచి కొంత మంది వాష్‌ రూమ్ తలుపు కొడుతున్నారు” అని చెప్పడం వీడియోలో రికార్ట్ అయ్యింది. బయటి నుంచి జనాలు కేకలు వేస్తుండగా, ఆ మహిళ “నాకు చాలా భయంగా ఉంది” అని వీడియోలో చెప్పడం వినిపించింది.

Advertisement

ఆ తర్వాత సదరు మహిళ ఎక్స్ వేదికగా ఈ వీడియో షేర్ చేసింది. పరిస్థితి “చాలా భయానకంగా ఉంది” అని క్యాప్షన్ పెట్టింది. “ప్రయాణ సమయంలో భద్రతా సమస్యలు ఎలా ఉంటాయో నాకు ఈరోజు అర్థమైంది. నేను ఒంటరిగా ప్రయాణిస్తున్నాను. మా రైలు కతిహార్ జంక్షన్ (బీహార్) దగ్గర ఆగిపోయింది. అకస్మాత్తుగా 30-40 మంది యువకులు అరుస్తూ, ఒకరినొకరు తోసుకుంటూ కోచ్‌లోకి దూసుకొచ్చారు. నేను వాష్‌ రూమ్‌ లో ఉన్నాను. బయటకు అడుగు కూడా వేయలేకపోయాను. వాష్ రూమ్ డోర్ దగ్గర జనాలు గుమిగూడారు. నేను వెంటనే డోర్ క్లోజ్ చేశాను. రైల్వే హెల్ప్‌ లైన్ (139)కి కాల్ చేశాను. కాసేపట్లో RPF వచ్చింది. వారు నన్ను సురక్షితంగా నా సీటు దగ్గరికి తీసుకొచ్చారు” అని పరిస్థితిని వివరించింది.

బీహార్ ను ఎప్పటికీ మార్చలేరు!

Advertisement

ఇదే సమయంలో సదరు మహిళ బీహార్ గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. బీహార్ ను ఎప్పటికీ మార్చలేరని కామెంట్ చేసింది “మీరు ఎంత చేసినా, మీరు బీహార్‌ ను మార్చలేరు” అంటూ రైల్వే సేవాకు తన పోస్టును ట్యాగ్ చేసింది.  తాను ఇంతకు ముందు ఎప్పుడూ బీహార్‌కు వ్యతిరేకంగా ఏం మాట్లాడలేదని, ఇటీవల తాను భయంతో వణికిపోయానని చెప్పింది.  “ఈ రోజు నేను భయపడ్డాను. రైల్లోకి అక్రమంగా వచ్చిన వారు రెండు వైపుల నుంచి తలుపు మూసివేశారు. దుండగులు (TTE)తో కూడా వాదించారు. బోగీలో ప్రయాణీకులతో అక్రమంగా ప్రవేశించిన వారు చేస్తున్న గొడవకు సంబంధించిన వీడియోలను కూడా సదరు ప్రయాణీకురాలు షేర్ చేసింది. ఈ వీడియోలో ఒక వ్యక్తి తలుపు తెరవండి అని అరవడం వినిపించింది. ప్రస్తుతం ఈ ఘటనపై రైల్వే పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Read Also:  భార్యతో గొడవ.. జేబులో చేతులు పెట్టుకుని 450 కి.మీలు నడుస్తూ వెళ్లిపోయిన భర్త!

Related News

డ్రోన్ తో వందే భారత్ వీడియోలు తీస్తున్నారా? ఇక కటకటాల్లోకి వెళ్లక తప్పదు!

కోడైకనాల్ టూర్‌కు వెళ్లేవారికి అలర్ట్.. ఇక ఆన్‌లైన్ లో టికెట్ తీసుకోవాల్సిందే!

పులులను దగ్గరగా చూడాలనుందా? అయితే, ఐఆర్‌సిటిసి ‘వన్ దర్శన్’ యాత్రకు రెడీ అవ్వండి!

హైదరాబాద్‌కి ఇంత దగ్గర్లో ఇలాంటి అందమైన జలపాతం ఉందా? వీకెండ్ ట్రిప్‌కు పర్ఫెక్ట్ ప్లేస్!

రైలు టికెట్లు బుక్ చేస్తున్నారా? సీట్లు ఉన్నాయో? లేవో? సింపుల్ గా ఇలా చెక్ చేయండి!

అయ్యప్ప భక్తులకు రైల్వే గుడ్ న్యూస్.. 148 స్పెషల్ ట్రైన్లు!

పండుగ సీజన్‌.. ఫ్యామిలీ నుంచి సోలో ట్రిప్ వరకు.. బెస్ట్ 5 టూరిస్ట్ డెస్టినేషన్లు!

దసరా వేళ మాత్రమే తెరుచుకునే అద్భుత ఆలయం.. ఏడాదిలో 11 రోజులే దర్శనం.. మిస్టరీ తెలిస్తే షాకే!

Big Stories

Advertisement
×