E-Paper
Advertisement

రష్మీ పై వైసీపీ నేతలు ట్రోల్స్.. ఘాటుగా రియాక్ట్ అయిన యాంకరమ్మ .. తగ్గేదేలేదంటూ!

రష్మీ పై వైసీపీ నేతలు ట్రోల్స్.. ఘాటుగా రియాక్ట్ అయిన యాంకరమ్మ .. తగ్గేదేలేదంటూ!
Advertisement

Rashmi Gautham: ప్రముఖ బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్(Rashmi Gautham) ఒకరు. ప్రస్తుతం ఈమె జబర్దస్త్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా యాంకర్ గా కొనసాగుతున్నారు. కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న రష్మీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా జంతువులకు సంబంధించిన అంశాల గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు. రష్మి గౌతమ్ జంతు ప్రేమికురాలు అనే సంగతి అందరికీ తెలిసిందే.

రష్మీని టార్గెట్ చేసిన వైసీపీ నేతలు..

మూగ జంతువులను ఎవరైనా హింసిస్తే ఈమె తన గళాన్ని వినిపిస్తూ వాటి సంరక్షణ కోసం పోరాటం చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే రష్మీ జంతువుల గురించి వాదన చేస్తూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విమర్శలను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ప్రస్తుతం ఈమె సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతల నుంచి విమర్శలను ఎదుర్కొంటున్నారు. అయితే వైసీపీ నాయకులు (YCP Leaders)ఈమెను టార్గెట్ చేయడానికి గల కారణం ఏంటనే విషయాన్ని వస్తే.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో డీజిల్ పెట్రోల్ కొరత ఉన్న సంగతి తెలిసిందే. ఇలా పెట్రోల్ డీజిల్ కొరత పట్ల వైసీపీ నాయకులు నిరసన తెలియజేస్తూ ఉన్నారు.

వెయ్యి రెట్లు ఆవేదన చెందుతారు..

Advertisement

ఈ నేపథ్యంలోనే తిరుపతిలో వైసిపి నాయకుడు భూమా అభినయ్ రెడ్డి ఏకంగా ఎడ్లపండి పై ఆటో ఎక్కించి ఆటోలో మనుషులతో పాటు ఎడ్ల బండి ప్రయాణం చేస్తూ నిరసన తెలిపారు.అయితే ఎడ్ల బండి పై ఆటోని ఎక్కించడంతో ఆ బండి లాగడం కోసం ఆ ఎద్దు చాలా ఇబ్బంది పడింది. ఈ నేపథ్యంలోనే రష్మీ ఈ ఘటనపై స్పందిస్తూ ఆ ఎద్దు ఎంత అయితే ఆవేదన చెందుతుందో అంతకు 1000 రెట్లు మనుషులు కూడా ఆవేదన చెందుతారు అంటూ ఈమె తనదైన శైలిలోనే ఈ అంశంపై ఘాటుగా స్పందించారు. ఇలా రష్మీ ఈ వీడియో పై స్పందించడంతో వైసిపి నేతలు ఈమెను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

నేను పార్టీలకు వ్యతిరేకం కాదు…

Advertisement

కూటమి ప్రభుత్వం నుంచి ఎంత మొత్తంలో ప్యాకేజ్ అందింది అంటూ పలువురు కామెంట్లు చేయగా మరి కొంతమంది ఈమెను వ్యక్తిగతంగా దూషిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా తన గురించి సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో రష్మీ కూడా స్పందిస్తూ వైసిపి నేతలకు తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారు. ఏ మతం లేదా పార్టీకి మేము వ్యతిరేకం కాదు. జంతుబలి, ఏనుగు హింస వంటి ఏ సమస్యపై గళమెత్తినా నన్ను తిడుతున్నారు. ఎవరినో ఒకరిని విమర్శించడం కంటే మూగజీవాల సంక్షేమానికి ఎవరు తోడ్పడితే వారికే నా మద్దతు ఉంటుంది. ఎన్ని అవమానాలు ఎదురైనా జంతువుల హక్కుల కోసం నా గళం వినిపిస్తూనే ఉంటానంటూ రష్మీ గౌతమ్ సోషల్ మీడియా వేదికగా తనదైన శైలిలోనే కౌంటర్ ఇస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.

Also Read: రామ్ చరణ్ చేతుల మీదుగా ‘సతీ లీలావతి’ ట్రైలర్ రిలీజ్..

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×