Ravi Babu Comments: సినిమాలని భుజాలమీద ఎత్తుకొని మోసేదే అభిమానులు. అలాంటి అభిమానులకి సినిమా ఫ్రీగా చూపిస్తే తప్పేంటి అంటున్నాడు యాక్టర్ కమ్ డైరెక్టర్. దీంతో అభిమానాన్ని అడ్డుపెట్టుకొని తొలిరోజే ఫ్యాన్స్ దగ్గర వేలకి వేలు గుంజే మేకర్స్ గుండెల్లో ఈ కామెంట్స్ వణుకు పుట్టిస్తున్నాయ్. ఇక రవిబాబు చేసిన ఈ కామెంట్స్ కి ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ సపోర్ట్ కనిపిస్తుంది. ఇన్నాళ్ళకి ఒక మంచి మాట చెప్పావన్నా అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు మూవీ లవర్స్. ఇంతకీ రవిబాబు ఏమన్నాడో డీటైల్డ్‌గా చూసేద్దాం.
వేలకి వేలకి దోచుకోవడం ఏంటో
రవిబాబు దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం ‘రేజర్’ మే 8న గ్రాండ్ రిలీజ్ కానున్న సంగతి తెల్సిందే. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమాలు ఆడేదే ఫ్యాన్స్ వల్ల. వాళ్లు లేకపోతే సినిమా అంత హైప్ కూడా రాదు. అలాంటిది వారికోసం సినిమాని ఫ్రీగా చూపెట్టకుండా ఈ వేలకి వేలకి దోచుకోవడం ఏంటో అంటూ మండిపడ్డాడు.
హీరోల కోసం థియేటర్ల వద్ద నానా హంగామా చేస్తూ, అవసరమైతే ప్రాణాలని కూడా పణంగా పెట్టే అభిమానుల దగ్గర ఎక్కువ డబ్బులు వసూలు చేయడం ముమ్మాటికీ తప్పే అంటూ కరాఖండిగా తేల్చి చెప్పేశాడు. రవిబాబు ఇంకా మాట్లాడుతూ, సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా దాన్ని ఊరంతా మోస్తూ పబ్లిసిటీ చేసేది అభిమానులేనని, కుదిరితే వాళ్లకి ఫ్రీగా సినిమా చూపెట్టాలని సరికొత్త ప్రపోజల్ పెట్టాడు. అసలే ఫైనాన్షియల్‌గా అంతంత మాత్రంగా ఉండే అభిమానుల జేబులకి చిల్లులు పెట్టడం మానుకోవాలంటూ హితబోధ చేశాడు.
also read :రాజా శివాజీ రివ్యూ .. విజువల్స్ అద్భుతం.. కానీ
టికెట్ ప్రైస్ పెరగడం కూడా ఓ కారణమే
నిజానికి ఆడియన్స్ థియేటర్స్ కి దూరం కావడానికి ఈ టికెట్ ప్రైస్ పెరగడం కూడా ఓ కారణమే. ఒకప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ థియేటర్లో సినిమా చూడటం అంటే ఒక పండగలా ఫీల్ అయ్యేవారు. కానీ ఇప్పుడు థియేటర్ల వైపు చూడాలంటేనే భయపడే పరిస్థితి.
ఒక వైపు టికెట్ రేట్లు భారీగా పెరగడం, మరో వైపు పార్కింగ్, స్నాక్స్ అంటూ వందల్లో గుంజడం… వెరసి OTT లో వచ్చాక చూసుకుంటాం అంతే కానీ థియేటర్లలో మాత్రం అడుగు పెట్టం అంటూ భీష్మించుక్కూర్చున్నారు ఆడియన్స్.మరి ఇలాంటి పరిస్థితుల్లో రవిబాబు అన్నట్టుగా కనీసం కొంతలో కొంతైనా మేకర్స్ టికెట్ రేట్లు భరించి అభిమానులపై భారం పడకుండా ఎంకరేజ్ చేస్తే, ముందు ముందు అయినా ఈ పరిస్థితిలో మార్పు కనిపిస్తుందేమో చూడాలి.
పక్కా యాక్షన్ థ్రిల్లర్ జానర్
ఇక ‘రేజర్’ సినిమా విషయానికి వస్తే… పక్కా యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో రవిబాబు మెయిన్ లీడ్ గా నటిస్తుండగా నవీన్, నితిన్, వైష్ణవి మరియు ఇంద్రాణి కీలక పాత్రలు పోషిస్తున్నారు.మరి మే 8న రిలీజ్ కి సిద్ధం అవుతున్న ఈ సినిమా ఎలాంటి టాక్ రాబడుతుందో చూడాలి!
also read :రెబలోడి ఫ్యాన్స్ కి పెద్ద షాక్ .. సీక్వెల్ లో ‘కల్కి’ ఉండడా?