Galaxy A56 5G Price Drop: లాంచ్ ధరతో పోలిస్తే ఏకంగా రూ.9,000 తక్కువకు శాంసంగ్ గెలాక్సీ A56 5Gని సొంతం చేసుకునే ఛాన్స్ వచ్చింది. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌పై భారీ ప్రైస్ కట్ కనిపిస్తోంది. మంచి డిజైన్, అదిరిపోయే కెమెరాలు, పవర్‌ఫుల్ ఫీచర్లతో ఆకట్టుకునే ఈ ఫోన్ ఇప్పుడు మరింత తక్కువ ధరకే అందుబాటులోకి రావడంతో శాంసంగ్ ఫోన్ కొనాలని చూస్తున్న వారికి ఈ డీల్ ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ప్రస్తుతం Galaxy A56 5G ధర ఎంత? రూ.9,000 తగ్గింపు ఎలా లభిస్తోంది? పూర్తి వివరాలు ఇవే..
ఈ Samsung Galaxy A56 5G లాంచ్ అయినప్పుడు అసలు ధర రూ. 41,999 ఉండగా, ప్రస్తుతం అమెజాన్‌లో 8GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.34,999కి లిస్ట్ చేశారు. దీనికి తోడు పీఎన్‌బీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా రూ.2,000 తక్షణ డిస్కౌంట్ పొందొచ్చు. ఇవన్నీ కలిపితే ఈ ఫోన్ రూ.32,999కే దక్కుతుంది. మొత్తంగా చూస్తే లాంచ్ ధరతో పోల్చుకుంటే దాదాపు రూ.9,000 మిగులుతాయి.
Also Read: బరువు తగ్గడం ఇక ఈజీ.. ఒప్పో నుంచి అధునాతన ‘ఫ్యాట్ బర్నింగ్ వాచ్’ వచ్చేస్తోంది!
మనం రోజూ వీడియోలు చూసేందుకు, రీల్స్ స్క్రోల్ చేసేందుకు డిస్‌ప్లే చాలా ముఖ్యం కదా. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ స్క్రీన్ ఇచ్చారు. అది కూడా 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది కాబట్టి.. ఫోన్ చాలా స్మూత్‌గా పనిచేస్తుంది. ఇక లోపల ఎక్సినోస్ 1580 ఆక్టా కోర్ ప్రాసెసర్ ఉంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత వన్ యూఐ 7 సాఫ్ట్‌వేర్‌పై ఇది రన్ అవుతుంది. రోజువారీ వాడకానికి, గేమింగ్‌కి ఎటువంటి ఇబ్బంది లేకుండా దూసుకుపోతుంది.
ఫొటోలు బాగా తీసేవాళ్లకి ఇందులో వెనక వైపు మూడు కెమెరాలు ఉన్నాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అయితే, దానితో పాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, మరో 5 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఇచ్చారు. ఇక సెల్ఫీల కోసం ముందువైపు 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే.. 5000mAh బ్యాటరీతో పాటు 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది. అంటే ఒక్కసారి చార్జ్ చేస్తే రోజంతా హ్యాపీగా వాడొచ్చు.
ఇన్ని మంచి ఫీచర్లు ఉన్న Samsung Galaxy A56 5G ఫోన్‌కు ఐపీ 67 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్ కూడా ఉంది. వర్షాకాలంలో తడిసినా లేదా ధూళి పడినా తట్టుకునే శక్తి దీనికి ఉంటుంది. ఒకవేళ మీరు ఈ ఫోన్ తీసుకోవాలని చూస్తుంటే.. అమెజాన్‌లో ఆర్డర్ పెట్టేముందు బ్యాంక్ ఆఫర్లు, చివరి ధర ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. ఈ ప్రైస్ రేంజ్‌లో శాంసంగ్ నుంచి ఇది నిజంగా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.
Also Read: యాపిల్ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. iPhone 18 Pro చేతికి అందాలంటే అక్టోబర్ వరకు ఆగాల్సిందే!