E-Paper
Advertisement

తల్లి కాబోతున్న బిగ్ బాస్ ప్రేరణ.. పోస్ట్ వైరల్!

తల్లి కాబోతున్న బిగ్ బాస్ ప్రేరణ.. పోస్ట్ వైరల్!
Advertisement

Prerana kambam:ప్రేరణ కంబం (Prerana Kambam) .. ఈ ముద్దుగుమ్మ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా సీరియల్స్ కంటే బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో పాటిస్పేట్ చేసి టాప్ 4 ఫైనల్ లిస్టులలో ఒకరిగా నిలిచిన ప్రేరణ కప్పు కొడుతుంది అనుకున్నారు కానీ దక్కించుకోలేకపోయింది. ఆ తర్వాత ఇస్మార్ట్ జోడి 3 లో తన తెలివితేటలతో , తన భర్తతో కలిసి పార్టిసిపేట్ చేసి విన్నర్ గా నిలిచింది. ఇక అలాంటి ఈమె వినాయక చవితి సందర్భంగా అభిమానులకు , టీవీ ప్రేక్షకులకు, బిగ్ బాస్ ప్రియులకు శుభవార్త తెలిపింది.

గుడ్ న్యూస్ చెప్పిన ప్రేరణ..

వినాయక చవితి సందర్భంగా తాను గర్భవతిని అంటూ అధికారికంగా అనౌన్స్ చేసింది . తన భర్త శ్రీపాద్ దేశ్ పాండే తో కలిసి పంచుకున్న వీడియోలో త్వరలో మేము తల్లిదండ్రులం కాబోతున్నాము అంటూ బేబీ బంప్ వీడియోని ఆమె షేర్ చేశారు. వినాయక చవితి సందర్భంగా తమ ఇంట చిన్నారి అడుగుపెడుతున్న విషయాన్ని చెప్పడంతో పలువురు బుల్లితెర ప్రముఖులు, ప్రేరణ అభిమానులు, నెటిజన్లు ప్రేరణ, శ్రీపాద్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మొత్తానికైతే తల్లి కాబోతున్నారని ప్రకటించి సర్ప్రైజ్ ఇచ్చింది ప్రేరణ. ఇకపోతే ఇక్కడ తమ ఫేస్ లను రివీల్ చేయకుండా కేవలం బేబీ బంప్ , ఆ బేబీ స్కానింగ్ రిపోర్ట్ మాత్రమే అభిమానులతో పంచుకున్నారు.

చిన్ననాటి స్నేహితుడినే వివాహం చేసుకున్న ప్రేరణ..

Advertisement

ప్రేరణ తన చిన్ననాటి స్నేహితుడు, కాలేజ్ ఫ్రెండ్ అయినా శ్రీపాద్ ను ప్రేమించి మరీ పెళ్లి చేసుకుంది. ముఖ్యంగా వీరిది తమిళ సాంప్రదాయ పద్ధతిలో వివాహం జరిగింది. ఇక వివాహం తర్వాత కూడా ఆమె తన నటన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది.

also read:M.S. సుబ్బులక్ష్మిగా రష్మిక.. అఫీషియల్ అనౌన్స్మెంట్!

ప్రేరణ కెరియర్..

Advertisement

బెంగళూరులోని దయానంద సాగర్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసిన ప్రేరణ.. చిన్నప్పటినుంచే ఆటలలో చాలా చురుగ్గా6 పాల్గొనేది. లాంగ్ జంప్ ,హై జంప్, రన్నింగ్ పోటీలలో సత్తా చాటింది. కాలేజీలో ఉన్నప్పుడే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించిన ఈమె.. కన్నడ సీరియల్స్ తో తన నటనా కెరియర్ ను మొదలుపెట్టింది. ఆ తర్వాత కన్నడలో సినిమాలు కూడా చేసింది. ఇక తెలుగు ప్రేక్షకులకు ‘కృష్ణ ముకుందా మురారి’ చిత్రంలో కృష్ణ పాత్రతో దగ్గర అయింది. సీరియల్ లో తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈమె.. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో అవకాశాన్ని దక్కించుకుంది. అక్కడ తనదైన ఆట, నిజాయితీతో కూడిన ప్రవర్తన బుల్లితెర వీక్షకులను మరింత ఆకట్టుకుంది. దాంతో గ్రాండ్ ఫినాలే వరకు చేరుకుంది . కానీ ట్రోఫీ మాత్రం అందుకోలేకపోయింది. ఇక ఇస్మార్ట్ జోడి సీజన్ 3 లో తన భర్తతో కలిసి పోటీ చేసి టైటిల్ ను సొంతం చేసుకుంది.

?utm_source=ig_web_copy_link&stkn=NTc4MTIwNjQ2YQ==

Related News

గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ హీరోయిన్.. ఇదేం ట్విస్ట్ మావా..

Intinti Ramayanam Pallavi : అబ్బా.. లంగావోణీలో పల్లవి ఎంత క్యూట్ గా ఉందో.. ఫ్యాన్స్ ఫిదా..

Nuvvu leka Nenu lenu : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. షాకిచ్చిన హీరోయిన్..

Gundeninda GudiGantalu Today episode: తాగొచ్చి రచ్చ చేసిన బాలు.. మీనా సీరియస్.. బాలుకు దిమ్మతిరిగే షాక్..

Podarillu Today Episode : పెళ్లి క్యాన్సిల్ చేసేందుకు ప్లాన్..? నారాయణ పెర్ఫార్మన్స్ అదుర్స్.. మాధవ్ నిజం తెలుస్తుందా..?

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమకు దిమ్మతిరిగే షాక్.. మాటిచ్చిన ప్రేమ.. తిరుపతి ఎంట్రీతో భాగ్యంకు షాక్..

Ninnu kori Serial Today Episode September 15th ‘నిన్ను కోరి’ సీరియల్‌: విరాట్ చంపేస్తున్న రౌడీలు – అడ్డుపడిన మదన్  

Big Stories

Advertisement
×