Ye Devi varamo Neevu : తెలుగు బుల్లి ధర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సీరియల్స్లలో ఏ దేవి వరమో నీవు సీరియల్ కూడా ఒకటి. ఇటీవల కాలంలో ప్రారంభమైన ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిఫరెంట్ స్టోరీ తో తల్లి కూతుర్ల సెంటిమెంట్తో మొదలైన ఈ సీరియల్ జనాలని కట్టిపడేస్తుంది. ప్రేమ కోసం కూతురు పడే ఆవేదన.. తల్లికి దగ్గర అవ్వాలన్న బాధ ఈ సీరియల్ కి హైలైట్ గా నిలుస్తాయి.. అనాధగా పెరిగిన అమ్మాయి తన తల్లి ప్రేమ కోసం ఆ ఇంట్లోనే పనిమనిషిగా చేరి తల్లి ప్రేమను పొందాలని ప్రయత్నాలు చేస్తుంది.. ఎమోషనల్ స్టోరీ తో వచ్చిన ఈ సీరియల్ ప్రస్తుతం జనాలని విపరీతంగా ఆకట్టుకుంటుంది.. ఈ సీరియల్ లో హీరోయిన్ గా నటించిన అంజలి తాజాగా గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఇంతకీ ఆమె షేర్ చేసిన ఆ న్యూస్ ఏంటో ఒకసారి మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..
స్టార్ మా లో ప్రసారం అవుతున్న కొత్త సీరియల్స్లలో ఈమధ్య ఎక్కువగా వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్లే కనిపిస్తున్నారు. ఒకప్పుడు కేవలం తెలుగు వాళ్ళు మాత్రమే కనిపించే వాళ్ళు కానీ ఈమధ్య ఎక్కడ చూసినా కూడా వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్లే కనిపించడంతో తెలుగు వాళ్లకి డిమాండ్ బాగా తగ్గిపోయింది అని అర్థమవుతుంది. అయితే స్టార్ మా లో ప్రసారమవుతున్న యే దేవి వరమో నీవు సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తున్న అంజలి అసలు పేరు సోనియా సురేష్.. ఈమె చెన్నై ముద్దుగుమ్మ. తమిళంలో పలు సీరియస్లలో నటించి మంచి క్రేజ్ ను సంప్రదించుకుంది.. తెలుగులో కూడా ఈమె వరుసగా సీరియల్స్ చేసింది. అయితే ఈమె తాజాగా ప్రెగ్నెంట్ అన్న వార్తని షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడంతో ఈమె ఇకమీదట సీరియల్స్ లో కనిపించదా అంటూ కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి త్వరలోనే దీని గురించి ఒక క్లారిటీ రావాల్సి ఉంది..
ఈమె తమిళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన బ్యూటీ అయినా కూడా తెలుగులో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. తమిళంలో వరుసగా సీరియస్లలో నటించి ప్రేక్షకులను తన నటనతో మెప్పించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో కూడా పలు సీరియస్లలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తెలుగులో ఇప్పటివరకు ఈమె చేసిన అన్ని సీరియల్స్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈమె నటించిన సీరియల్స్లలో.. అమ్మకు ప్రేమతో, స్నేహం కోసం వంటి సీరియల్స్లలో నటించి తెలుగు ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంది సోనియా సురేష్.. ప్రస్తుతం ఈమె నటిస్తున్న సీరియల్ కి గాను మంచి రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. ఈమె ఒక్కరోజు గాను దాదాపు 45 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇదయితే హాట్ టాపిక్ గా మారింది.. ఈ లెక్కను చూస్తే ఈమె నెలకి దాదాపు లక్షల్లోని సంపాదిస్తుంది అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..