E-Paper
Advertisement

క్రాష్ టెస్ట్‌ లో దుమ్మురేపిన మహీంద్రా XUV 7XO.. అన్ని వేరియంట్లకు 5 స్టార్ రేటింగ్!

క్రాష్ టెస్ట్‌ లో దుమ్మురేపిన మహీంద్రా XUV 7XO.. అన్ని వేరియంట్లకు 5 స్టార్ రేటింగ్!
Advertisement

Mahindra XUV 7XO Crash Test Result: మహీంద్రా నుంచి వచ్చిన XUV 7XO భద్రత విషయంలో మంచి రిజల్ట్ సాధించింది. భారత్ న్యూ కార్ అసెస్‌ మెంట్ ప్రోగ్రామ్ (Bharat NCAP) నిర్వహించిన క్రాష్ టెస్టుల్లో ఈ SUVకి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. పెద్దలతో పాటు పిల్లల రక్షణలోనూ ఇదే రేటింగ్ తో సత్తా చాటింది. పెద్దల భద్రత విభాగంలో XUV 7XOకి 32 మార్కులకు 30.76 స్కోర్ వచ్చింది. పిల్లల భద్రతలో 49 మార్కులకు 44.97 మార్కులు సాధించింది. దీంతో కుటుంబ అవసరాలకు SUV కొనుగోలు చేయాలనుకునే వారికి XUV 7XO బెస్ట్ ఆప్షన్ గా మారింది.

రెండు రకాల క్రాష్ టెస్టులు

XUV 7XOను భారత్ NCAP రెండు క్రాష్ టెస్టులు చేసింది. ఇందులో ఫ్రంట్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌ తో పాటు సైడ్ మూవబుల్ బారియర్ టెస్ట్ కూడా ఉన్నాయి. పెద్దల ప్రొటెక్షన్ టెస్ట్ లో మొదటి టెస్ట్‌ కు 16 మార్కులకు 14.76, రెండో టెస్ట్‌ లో పూర్తి 16 మార్కులు సాధించింది. సైడ్ ఇంపాక్ట్ సమయంలో కూడా SUV మెరుగైన రక్షణను అందించింది.  ప్రమాదం జరిగినప్పుడు వాహనంలోని ప్రయాణికులకు రక్షణ కల్పించే నిర్మాణం కీలక పాత్ర పోషిస్తుంది.

పిల్లల భద్రతలోనూ మంచి స్కోర్!

Advertisement

పిల్లల రక్షణ విషయంలోనూ XUV 7XO మంచి మార్కులు సాధించింది. డైనమిక్ క్రాష్ టెస్ట్‌ లో చైల్డ్ రెస్ట్రెయింట్ సిస్టమ్ (CRS) ఉపయోగించగా, 24 మార్కులకు 23.97 స్కోర్ వచ్చింది. అంతేకాకుండా, CRS ఇన్‌స్టాలేషన్ విషయంలో కూడా SUV  స్కోర్ సాధించింది. చిన్నారులతో ప్రయాణించే కుటుంబాలకు చైల్డ్ సీట్ మౌంట్స్ లాంటి సదుపాయాలు మంచి సేఫ్టీని అందిస్తున్నాయి.

ఏ వేరియంట్లను పరీక్షించారు?

భారత్ NCAP ఈ పరీక్షల కోసం XUV 7XOకి చెందిన రెండు డీజిల్ 7-సీటర్ వేరియంట్లను తీసుకున్నారు. ఇందులో AX7 2WD ఆటోమేటిక్, AX7L డీజిల్ 4WD ఆటోమేటిక్ ఉన్నాయి. సాధారణంగా క్రాష్ టెస్టుల్లో బేస్ వేరియంట్‌ను పరీక్షించే విధానం కొన్ని అంతర్జాతీయ భద్రతా సంస్థల్లో కనిపిస్తుంది. అయితే, భారత్ NCAP పరీక్షలు ప్రస్తుతం వాలంటరీ విధానంలో జరుగుతున్నందున, తయారీదారులు తమకు నచ్చిన వేరియంట్‌ ను పరీక్షకు పంపే అవకాశం ఉంది.

Advertisement

అయితే, XUV 7XOలో ADAS, 360 డిగ్రీ కెమెరా లాంటి కొన్ని అధునాతన ఫీచర్లు మినహా కీలక భద్రతా పరికరాలు అన్ని వేరియంట్లలోనూ స్టాండర్డ్‌ గా ఉన్నాయి. అందుకే భారత్ NCAP నివేదికలో ఈ 5 స్టార్ రేటింగ్ XUV 7XO మొత్తం వేరియంట్స్ వర్తించనుంది.

XUV 7XOలో కీలక సేఫ్టీ ఫీచర్లు

XUV 7XOలో ప్రయాణికుల రక్షణ కోసం పలు భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి సిస్టమ్‌లు ఉన్నాయి. ముందు సీట్లకు ప్రీటెన్షనర్లు, లోడ్ లిమిటర్లు కూడా అందించారు. వెనుక సీట్లలో పిల్లల కోసం ISOFIX మౌంట్స్ ఉన్నాయి. సీట్‌ బెల్ట్ రిమైండర్ లాంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Read Also: చిన్న కారు.. పెద్ద రేంజ్.. భారత్‌ లోకి వస్తున్న కొత్త కాంపాక్ట్ ఈవీలివే!

Tags

Related News

స్పోర్టీ లుక్.. అదిరిపోయే స్పీడ్.. భారత్‌లో టాప్ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

బ్లాక్ కలర్‌కు గుడ్‌బై.. కొత్త లుక్‌తో 2027 కవాసకి వల్కన్ ఎస్ వచ్చేసింది!

చిన్న కారు.. పెద్ద రేంజ్.. భారత్‌ లోకి వస్తున్న కొత్త కాంపాక్ట్ ఈవీలివే!

2.7 సెకన్లలో 100 కిమీ స్పీడ్.. భారత్‌ లోకి అడుగు పెట్టబోతున్న BYD పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ కారు!

యాక్టివా To బర్గ్‌ మన్.. ఏథర్ కోనార్క్‌ కు పోటీ ఇచ్చే 6 స్కూటర్లు ఇవే!

హ్యుందాయ్ కొత్త SUV పేరు ఇదే.. త్వరలో మార్కెట్లోకి ఎంట్రీ!

మరోసారి పెరిగిన అమేజ్ ధర.. ఆటోమేటిక్ వేరియంట్‌పై భారీ పెంపు!

Big Stories

Advertisement
×