Big Tv Kissik Talks: బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ (Kissik Talks)కార్యక్రమానికి చాలా మంచి ఆదరణ లభిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి వారం సెలబ్రిటీలు హాజరవుతూ వారికి సంబంధించిన ఎన్నో తెలియని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈవారం ఈ కార్యక్రమంలో భాగంగా జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ (Kevvu Karthik)హాజరయ్యారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వీడియో విడుదల చేశారు. ఇందులో భాగంగా ఈయన తన భార్య బిడ్డ గురించి, జబర్దస్త్ జర్నీ గురించి, జబర్దస్త్ లో అవకాశాల కోసం ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి, తన తల్లి మరణం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
ఇలా తనకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్న కార్తీక్ తన తల్లి మరణం గురించి కూడా మాట్లాడారు. వర్ష తన తల్లి గురించి అడుగుతూ అమ్మను మిస్ అయిన టైంలో మీరు ఎలా బేర్ చేశారంటూ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కార్తీక్ సమాధానం చెబుతూ మా అమ్మ 2024 మే నెలలో చనిపోయారనీ తెలిపారు. అమ్మ మరణం వల్ల ఒక సంవత్సరం పాటు తాను కోలుకోలేకపోయానని , రాత్రిళ్ళు నిద్ర కూడా పట్టేది కాదు, ప్రతిరోజు రాత్రి అమ్మ కలలోకి వచ్చేది. బసవతారకం హాస్పిటల్లో క్యాన్సర్ కి చికిత్స తీసుకుంటున్న సమయంలో ఎన్నో రాత్రులు ఫుట్ పాత్ మీద పడుకున్నానని అప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు.
అమ్మ చనిపోతే చాలామంది మనుషులు అన్నప్పుడు చచ్చిపోతారు అంత ఎక్సైట్ అవుతారు ఏంటి అంటూ విమర్శించిన వారు కూడా ఉన్నారని ఈయన అప్పటి విషయాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. ప్రతిరోజు షూటింగ్ అయిపోగానే ఇంటికి వెళ్ళగానే ముందు అమ్మ దగ్గరకు వెళ్లి అమ్మ అంటూ తనని లేపితే తను పలికేది కాదు ఆ క్షణం ఎంతో భయంకరంగా ఉండేదని తెలిపారు. ఇక అమ్మ చివరి రోజులకు వచ్చేసరికి నాకు అర్థమైంది అమ్మకు ఇవే చివరి రోజులని ఆ సమయంలో తాను ఒక వారం రోజులు నిద్ర కూడా పోలేదని తెలిపారు. ప్రపంచమంతా మన చుట్టూ ఉండి ఎన్నో త్యాగాలు చేయడానికి ఎంతో మంది రెడీగా ఉన్నా అరే అమ్మలేదే అనే ఒక బాధ ఎప్పుడు వెంటాడుతూనే ఉందని కార్తీక్ తన తల్లిని గుర్తు చేసుకుంటూ బాధపడ్డారు.
కార్తీక్ తల్లి దాదాపు 5 సంవత్సరాలపాటు క్యాన్సర్ తో పోరాటం చేస్తూ మరణించిన విషయం తెలిసిందే. కార్తీక్ సోషల్ మీడియా వేదికగా తన తల్లి మరణం గురించి తెలియజేశారు. ఇక తన తల్లి మరణం తర్వాత తన అమ్మ తన కూతురి రూపంలో జన్మించింది అంటూ కార్తీక తన కూతురు పుట్టిన సమయంలో ఎంతో ఎమోషనల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కార్యక్రమంలో మరోసారి తన అమ్మ గురించి మాట్లాడుతూ కార్తీక్ ఎమోషనల్ అయ్యారు.
Also Read: జబర్దస్త్ లో కాంట్రవర్సీలు ఎక్కువ.. ఎన్నో అవమానాలు పడ్డాను:కెవ్వు కార్తీక్