Fake Jobs Scam: నిరుద్యోగం ఒక శాపమైతే, వారిని నమ్మించి మోసం చేయడం మరో పాపం. కలలు అమ్మే ఈ బజారులో ఉద్యోగం నిరుపేద నిరుద్యోగులకు అందని సింహాసనంగా మారింది. అలాంటి నిరుద్యోగులను నిలువుదోపిడీ చేస్తున్నారు కొందరు కేటుగాళ్ళు
‘ఉద్యోగం ఇప్పిస్తాం రూ.50 వేలు ఇవ్వు’
ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు. అలాంటి మోసగాళ్లే.. నిరుద్యోగులు కనిపిస్తే చాలు నిధి దొరికినంతా హ్యాపీగా ఫీలవుతారు. వనపర్తి జిల్లా గోపాల్‌పేట్ మండలం చెన్నూరు, పోలికేపాడు గ్రామాల్లో ఇద్దరు మహిళల ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారు. వారి నిరుద్యోగమే ఆ కేటుగాళ్లకు అస్త్రమైంది. మీకు ప్రభుత్వ శాఖలో అటెండర్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఆశ పెట్టారు. నమ్మి వచ్చిన ఆ ఆడబిడ్డల నుంచి ఒక్కొక్కరి దగ్గర 50 వేల చొప్పున.. టోటల్‌గా లక్ష రూపాయలు వసూలు చేశారు. అంతటితో ఆగకుండా, విద్యాంజలి పేరుతో ఉన్న ఒక నకిలీ లెటర్‌ప్యాడ్‌ను సృష్టించి.. ఈ-మెయిల్ ద్వారా ఫేక్ అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ పంపారు. చేతిలో జాబ్ ఆర్డర్ పడగానే ఆ మహిళలు ఎగిరి గంతులేశారు.
ఐదు నెలలు పనిచేశారు.. తీరా చూస్తే
ఇక అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. ఉద్యోగంలో చేరి ఐదు నెలలు గడిచిపోయాయి. నెల తిరిగితే అకౌంట్‌లో పడాల్సిన జీతాలు మాత్రం ఒక్క రూపాయి కూడా రాలేదు. ఏంట్రా బాబూ ఇది అని ఆరా తీస్తే అసలు నిజం బయటపడింది. చేతిలో ఉన్న ఆ జాబ్ ఆర్డర్స్ అన్నీ పచ్చి బూటకమని, అదంతా పెద్ద మోసమని తెలిసి ఆ బాధితులు షాకైపోయారు.
పోలీసుల దెబ్బకు కక్కేసిన కేటుగాళ్లు!
బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగారు గోపాల్‌పేట్ పోలీసులు. ఈ ఫ్రాండ్‌కు పాల్పడిన వంగురు రవిప్రసాద్, తొగట హనుమాన్ దాస్‌ను అదుపులోకి తీసుకుని వారి స్టైల్‌లో విచారించారు. పోలీసుల దెబ్బకు ఆ కేటుగాళ్లు తమ నేరాన్ని కక్కేశారు.
Also Read: కుంభమేళా రేంజ్‌లో గోదావరి పుష్కరాలు.. రేవంత్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్!