Big Tv Kissik Talks: బిగ్ టీవీ కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే .ప్రతివారం ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు సెలబ్రిటీలు పాల్గొంటూ వారికి సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ కార్యక్రమంలో జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ (Kevvu Karthik)హాజరయ్యారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో వీడియో విడుదల చేశారు. ఈ ప్రోమో వీడియోలో భాగంగా కార్తీక్ తన వ్యక్తిగత విషయాలతో పాటు ఇండస్ట్రీలో ఆయన ఎదుర్కొన్న అవమానాలు గురించి కూడా ప్రస్తావించారు.
ఈ ప్రోమో వీడియోలో భాగంగా యాంకర్ వర్ష (Anchor Varsha)మాట్లాడుతూ.. ఇక్కడ షోలు, షూటింగ్స్ అన్నీ మానేసి యూకే వెళ్లిపోయారు ఏమైనా న్యాయం ఉందా ?అంటూ వర్షా ప్రశ్నించడంతో వెంటనే కార్తీక్ మాట్లాడుతూ ఇదే ప్రశ్న మా ఆవిడ వేసింది అందుకే వెళ్లాల్సి వచ్చిందని తెలిపారు. నువ్వు షూటింగ్స్ చేసుకుంటూ అక్కడే ఉంటే నేను ఇక్కడే ఉన్నాను అంటూ ఆమె మాట్లాడటంతో తాను కూడా యూకే (U.K.) వెళ్ళిపోయాను అని అందుకే జబర్దస్త్(Jabardasth) ఇతర కార్యక్రమాలకు దూరం కావలసి వచ్చిందని తెలిపారు. తన కుమార్తె మెలోడీ అక్కడే పుట్టింది.
ఇలా పాప పుట్టడం మా జీవితంలో ఒక అద్భుతమైన మూమెంట్ అందుకే చాలా ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని యూకే వెళ్లానని అయితే ఈ తొమ్మిది నెలలు మాకు ఏమాత్రం సరిపోలేదని కార్తీక్ చెప్పారు. ఇక ఇండియా వదిలి యూకేలోనే సెటిల్ అయిపోతారని విన్నాము నిజమేనా? అనే ప్రశ్న కూడా వేశారు అయితే కార్తీక్ సమాధానం చెబుతూ.. ఇది అన్ ప్లాన్డ్, లైఫ్ అనేది ఎప్పుడూ ఊహించిన విధంగా జరగదు. మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాదనీ ఈయన తెలిపారు. ఇలా నా భార్య యూకే లో ఉండడం నేను హైదరాబాద్ లో ఉండడం చాలా బాధాకరంగా అనిపించింది.
ప్రతిరోజు ఫోన్లో అన్ని విషయాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నా ఏదో తెలియని బాధ ఉంటుందని కార్తీక్ తెలిపారు. ఇలా తన భార్య కోసమే తాను ఇక్కడ కార్యక్రమాలు ఈవెంట్ షూటింగ్స్ అన్ని వదులుకొని యూకే వెళ్లాల్సి వచ్చిందని ఈయన తెలియజేశారు. మరి అక్కడే సెటిల్ అవ్వకుండా కార్తీక్ తిరిగి హైదరాబాద్ వస్తారా? యధావిధిగా జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేయబోతున్నారా? అనేది తెలియాలి అంటే ఈ కార్యక్రమం పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు మనం ఎదురు చూడాల్సిందే. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ఆదివారం రాత్రి 8 గంటలకు బిగ్ టీవీలో ప్రసారమవుతుంది.
Also Read: ఇండస్ట్రీని వదిలేద్దాం అనుకున్నా..తనూజ షాకింగ్ స్టేట్మెంట్!