E-Paper
Advertisement

తండ్రి భూస్వామి.. 150 ఎకరాలు దానం..ఉదయభానుకి దక్కిందెంతో తెలుసా?

తండ్రి భూస్వామి.. 150 ఎకరాలు దానం..ఉదయభానుకి దక్కిందెంతో తెలుసా?
Advertisement

Udaya Bhanu: యాంకర్ గా మనందరికీ సుపరిచితురాలైన ఉదయభాను (Udaya Bhanu) వాస్తవానికి 14 సంవత్సరాల వయసులోనే.. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆర్ నారాయణ మూర్తి దర్శకత్వంలో 1994 లో వచ్చిన ఎర్రసైన్యం సినిమాతో నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఖైదీ బ్రదర్స్, కొండవీటి సింహాసనం, శ్రావణమాసం వంటి సినిమాలలో నటించిన ఈమె.. కన్నడ సినిమాలలో హీరోయిన్ గా కూడా నటించింది. అయితే సినిమాల కంటే కూడా ఈమెకు బుల్లితెర రంగం మంచి క్రేజ్ ,స్టార్డం తెచ్చి పెట్టింది. సుమ ,ఝాన్సీ లతో పాటు యాంకర్ గా బుల్లితెరను ఏలిన ఈమె ఈటీవీలో వచ్చిన హృదయాంజలి షో తో మంచి బ్రేక్ అందుకుంది. ఆ తర్వాత ఢీ, వన్స్ మోర్ ప్లీజ్, జాక్ పాట్, రేలారే రేలా, సాహసం చేయరా డింభకా, పిల్లలు పిడుగులు వంటి ఎన్నో సూపర్ హిట్ షోలలో యాంకర్ గా వ్యవహరించింది.

మా నాన్న పెద్ద భూస్వామి..

ఆ తర్వాత ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గడంతో దూరమైపోయిన ఈమె.. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ‘ఉదయభాను ప్రొడక్షన్స్’ అనే సొంత బ్యానర్ను స్థాపించి నిర్మాతగా మారింది. జీ ఫైవ్ వేదికగా పంచనామా అనే సిరీస్ విడుదల చేసి మంచి విజయం అందుకుంది. ప్రస్తుతం పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఎన్నో విషయాలు పంచుకుంటున్నా ఈమె.. తన తండ్రి గురించి, తన బ్యాక్ గ్రౌండ్ గురించి చెప్పుకొచ్చింది. తన తండ్రి భూస్వామి అని, అయితే అందులో తనకు వచ్చింది ఎంత అనే విషయంపై కూడా ఆమె క్లారిటీ ఇచ్చింది.

150 ఎకరాలు ఊరికోసమే ఇచ్చారు..

Advertisement

ఉదయభాను తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని.. నాకు ఐదు సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా నాన్న చనిపోయాడు. మా అమ్మకి ఒక నర్సింగ్ హోమ్ ఉండేది. ఆమె ఆయుర్వేద వైద్యురాలు. మా అమ్మ పేరు అరుణ. మా అమ్మ పేరు పెట్టుకున్న పిల్లలు కూడా ఉన్నారు మా ఊర్లో.. సంతానలేమికి మా అమ్మ చేసే వైద్యం బహుశా మరెవరు చేయలేరేమో. మా నాన్న గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మా నాన్న ఊర్లో పెద్ద భూస్వామి. ముఖ్యంగా తన ఆస్తి ఎక్కువే. 150 ఎకరాలు ఊరికోసమే పంచారు.

మా నాన్న ఆస్తి నుండి మాకు వచ్చింది ఎంతంటే?

అయితే మా నాన్న ఆస్తిలో మేము చిల్లిగవ్వ కూడా తీసుకోలేదు.. ఎందుకో అలా అయిపోయింది. కానీ నేను మా నాన్నను చాలా మిస్ అవుతున్నాను. అయితే నా జీవితంలో బాగా గుర్తుంది ఏమిటంటే.. నాకు ఐదు సంవత్సరాల వయసున్నప్పుడు మా నాన్న చనిపోతే చల్లటి ఐస్ క్యూబ్ మీద పడుకోబెట్టారు. నా చేతులతో మా నాన్నను ముట్టించారు. అప్పుడు ఆయన బాడీ చాలా చల్లగా ఉంది. అదొక్కటే ఇప్పటికీ నాకు గుర్తుంది అంటూ ఎన్నో విషయాలను పంచుకుంది ఉదయభాను.

Advertisement

also read: సంపాదన.. కుటుంబాన్ని ఎడబాపుతుందా? ఉదయభాను షాకింగ్ కామెంట్స్!

చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు..

1986 ఆగస్టు 5న తెలంగాణలోని కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ లో జన్మించింది. ఈమె తండ్రి ఎస్ కే పటేల్.. ఆయన ఒక డాక్టర్ అలాగే కవి కూడా.. ఆయన కలం పేరు ఆధారంగానే ఈమెకు ఉదయభాను అని నామకరణం చేశారు. ఈమె తల్లి పేరు అరుణ .ఒక ఆయుర్వేద వైద్యురాలు.. అంతేకాదు రెండు మూడు చిత్రాలలో కూడా నటించారట. ఇప్పటికీ పలు యాడ్ లలో సందడి చేస్తున్నట్లు ఉదయభాను తెలిపారు. ఈమెకు ఒక సోదరుడు కూడా ఉన్నారు. తండ్రి చనిపోవడంతో చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చిందట. తల్లి ప్రోత్సాహంతో చిన్నప్పుడే క్లాసికల్ డాన్స్ ,కూచిపూడి నాట్యం కూడా నేర్చుకొని స్టేజ్ షోలు కూడా ఇచ్చానని తెలిపారు.

Related News

షారుక్ ఖాన్ తో సృష్టి.. కామనర్ గా బిగ్ బాస్ లోకి.. మరీ ఇంత మోసమేంటి నాగ్ సార్!

ఉదయ భాను యాంకరింగ్‌కు అంత పారితోషికమా? ఒక్కో షోకు ఎంతంటే!

సంపాదన.. కుటుంబాన్ని ఎడబాపుతుందా? ఉదయభాను షాకింగ్ కామెంట్స్!

నిమజ్జనాలతో నీరంతా కలుషితం.. గ్లాసు నీళ్లతో అన్వేష్ ప్రయోగం, చివరికి..

ఉదయ భాను ఆ హీరోయిన్ కు డబ్బింగ్ చెప్పారా?

కొత్తింట్లోకి అడుగుపెట్టిన అమర్ దీప్… తేజు ఎక్కడ అంటున్న ఫ్యాన్స్!

రూ.100 కోట్లు ఉంటేనే ఎమ్మెల్యే.. నిజాలు బయటపెట్టిన ఉదయభాను!

Big Stories

Advertisement
×