Big Tv Kissik Talks:కిస్సిక్ టాక్స్’…బిగ్ టీవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ క్రేజీ పాడ్ కాస్ట్ ఆడియన్స్ ని ఎంతగా అలరిస్తుందో చెప్పక్కర్లేదు.ఇక తాజాగా ఈ ‘కిస్సిక్ టాక్స్’నుండి 75 ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమో లేటెస్ట్ గా రిలీజ్ అయింది.ఇక ఈ పాడ్ కాస్ట్ లో జబర్దస్త్ తో తనదైన శైలిలో నవ్వులు పండించిన కెవ్వు కార్తీక్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన ఇండస్ట్రీ జర్నీ అంత ఈజీగా లేదంటూ ఛాన్స్ కోసం తిరిగిన రోజులని ఇలా గుర్తు చేసుకున్నాడు.
అన్నపూర్ణ స్టూడియోలో ఛాన్స్ కోసం ఏడు నెలలు
కెవ్వు కార్తీక్ మాట్లాడుతూ సినిమా, టీవీ ఇండస్ట్రీలోకి రావాలని చాలామంది కలలు కంటారని కానీ ఆ కలను నిజం చేసుకోవడానికి ఎన్ని రోజులు తిరగాలో మాత్రం ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాతే తెలుస్తుందని తెలిపాడు. ముఖ్యంగా అన్నపూర్ణ స్టూడియోలో ఛాన్స్ కోసం ఏకంగా ఏడు నెలలు వెయిట్ చేసినట్టు ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
అంతేకాదు.. అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవో చెప్పడానికి మరో సంఘటనను కూడా కెవ్వు కార్తీక్ గుర్తు చేసుకున్నారు. కృష్ణానగర్ నుంచి పంజాగుట్ట వరకు నడుచుకుంటూ వెళ్లిన సందర్భం గురించి ఆయన చెప్పారు. ఇప్పుడు కారు, బైక్‌ల్లో తిరిగే సెలబ్రిటీలను చూస్తే ఈ విషయం ఊహించుకోవడం కాస్త కష్టమే. కానీ ఒకప్పుడు అవకాశం కోసం కృష్ణానగర్ నుంచి పంజాగుట్ట వరకు కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన చెప్పడం బట్టి చూస్తే దక్కిన ఈ క్రేజ్ వెనక ఎన్ని క్లష్టాలు ఉన్నాయో అర్థం అవుతుంది.
లైఫ్ ఎప్పుడూ మనం అనుకున్నట్టుగా జరగదు
ఇక ఇదే ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను కూడా ఆయన పంచుకున్నట్టు ప్రోమోలో కనిపిస్తోంది. లైఫ్ ఎప్పుడూ మనం అనుకున్నట్టుగా జరగదని, మనం ఒకటి అనుకుంటే దేవుడు మరోటి అనుకునే పరిస్థితులు వస్తుంటాయని ఆయన చెప్పిన మాటలు ఆసక్తిని పెంచుతున్నాయి.
లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ గురించి కూడా కెవ్వు కార్తీక్ తన అభిప్రాయాన్ని చెప్పినట్టు ప్రోమోలో ఉంది. దూరంగా ఉంటూ రిలేషన్‌షిప్‌ను కొనసాగించడం అంత సులభం కాదని, ఫోన్‌లో మాట్లాడుకోవడం మాత్రమే కాకుండా ఒకరికి ఒకరు అర్థం చేసుకోవడం కూడా చాలా ముఖ్యమని తెలిపాడు. తన భార్యతో కలిసి బయటకు వెళ్లే సందర్భాలు, ఫ్యామిలీ లైఫ్‌కు సంబంధించిన విషయాలను కూడా సరదాగా పంచుకున్నారు.
పూర్తి ఎపిసోడ్ కోసం ఆసక్తిగా
అన్నపూర్ణ స్టూడియో గేట్ బయట ఏడు నెలలు ఎదురుచూసిన వ్యక్తి.. కృష్ణానగర్ నుంచి పంజాగుట్ట వరకు నడుచుకుంటూ ఛాన్స్ కోసం వెళ్లిన వ్యక్తి.. అదే కెవ్వు కార్తీక్ ఇప్పుడు పోడ్‌కాస్ట్‌లో తన అనుభవాలను చెప్పే స్థాయికి రావడం వెనుక పట్టుదల కనిపిస్తోంది. జబర్దస్త్‌లో నవ్వించిన ఈ కమెడియన్ జీవితంలో ఇంతటి కష్టాలున్నాయా అంటూ ప్రోమో చూసిన ప్రేక్షకులు ఇప్పుడు ఈ ఆదివారం రాత్రి 8గంటలకి వచ్చే పూర్తి ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.