E-Paper
Advertisement

జబర్దస్త్ లో కాంట్రవర్సీలు ఎక్కువ.. ఎన్నో అవమానాలు పడ్డాను:కెవ్వు కార్తీక్

జబర్దస్త్ లో కాంట్రవర్సీలు ఎక్కువ.. ఎన్నో అవమానాలు పడ్డాను:కెవ్వు కార్తీక్
Advertisement

Big Tv Kissik Talks: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలలో జబర్దస్త్ (Jabardasth) కార్యక్రమానికి ఎంతో మంచి ఆదరణ ఉంది . కామెడీ షోగా ప్రసారమవుతున్న ఈ కార్యక్రమం దాదాపు 13 సంవత్సరాల నుంచి మంచి ఆదరణ సొంతం చేసుకుని విజయవంతంగా ప్రసారమవుతుంది. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకుని ప్రస్తుతం ఇండస్ట్రీలో డైరెక్టర్లు, హీరోలు, కమెడియన్లుగా కొనసాగుతూ ఉన్నారు. జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో కెవ్వు కార్తీక్(Kevvu Karthik) ఒకరు.

జబర్దస్త్ సొసైటీలో మంచి పేరును ఇచ్చింది..

తాజాగా కెవ్వు కార్తీక్ బిగ్ టీవీలో ప్రసారమవుతున్న కిస్సిక్ టాక్స్(Kissik Talks) కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరియర్ కి సంబంధించిన విషయాలు గురించి కూడా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే వర్ష జబర్దస్త్ కార్యక్రమానికి ముందు తరువాత ఎలా ఉంది అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు కార్తీక్ సమాధానం చెబుతూ జబర్దస్త్ అనేది ఒక గ్రేట్ ఫ్లాట్ ఫామ్ అని చెప్పారు.. నాకు డబ్బులు ఇచ్చింది, ఫేమ్ ఇచ్చింది, సొసైటీలో మంచి నేమ్ ఇచ్చిందని తెలిపారు. జబర్దస్త్ అనేది నాకు రెడ్ కార్పెట్ మీద కేక్వాక్ లాగా జరగలేదని తెలిపారు.

ఫుడ్డు కూడా దొరకదు..

Advertisement

జబర్దస్త్ కార్యక్రమంలో అవకాశాలు అందుకోవడం కోసం తాను ఎన్నో ఇబ్బందులు పడ్డానని కార్తీక్ తెలిపారు. ఇక వర్షా మరో ప్రశ్న వేస్తూ ముందు ఉన్న జబర్దస్త్ కి ఇప్పుడున్న జబర్దస్త్ కు ఏదైనా మార్పులు ఉన్నాయా? అంటూ ప్రశ్న వేయడంతో జబర్దస్త్ లో చాలా కాంట్రవర్సీలు చూసామని తెలిపారు. ఒక ఫంక్షన్ చేస్తే చాలా తప్పులు జరుగుతాయి. ఈ ఫంక్షన్ లో ఒకరికి ఫుడ్డు దొరుకుతుంది, మరొకరికి దొరకకపోవచ్చు. ఇలాంటి ఒక లాంగ్ రన్ షో ఆర్గనైజింగ్ లో చాలా తప్పులు జరుగుతాయని తెలిపారు. అదేవిధంగా తన జీవితంలో ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొన్నానని కార్తీక్ తెలిపారు.

Advertisement

ఇక బుల్లితెరపై మిమిక్రీ కింగ్ అంటే మీ పేరు కూడా వస్తుంది అని చెప్పగానే వెంటనే వర్ష ఫోన్ తీసుకొని కార్తీక్ మీరు ఇలాంటి వాళ్ళని అసలు అనుకోలేదు అంటూ వర్ష గురించి మాట్లాడారు. అదే విధంగా వర్ష మొబైల్ లాక్ తెలియనప్పటికీ తన మొబైల్ లాక్ తీసి ఈయన ఎవరికో కాల్ చేసినట్టు ఈ ప్రోమో వీడియోలో చూపించారు. మరి ఆ కాల్ ఎవరికి చేశారు ఏం మాట్లాడారు? జబర్దస్త్ లో ఇంకా ఎలాంటి కాంట్రవర్సీలు తప్పులు జరిగాయి అనేది తెలియాలి అంటే ఆదివారం వరకు ఎదురు చూడాల్సిందే. ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రసారం అవుతుంది.

Also Read: కెవ్వు కార్తీక్ జబర్దస్త్ కు దూరం అవడానికి అదే కారణమా?

Related News

ఛాన్స్ కోసం అన్నపూర్ణ స్టూడియో గేట్ బయట 7 నెలలు.. కెవ్వు కార్తీక్ పడిన కష్టాలు ఇవే!

మనుషులు అన్నాక చచ్చిపోరా? అమ్మ మరణం పై కార్తీక్ ఎమోషనల్!

కెవ్వు కార్తీక్ జబర్దస్త్ కు దూరం అవడానికి అదే కారణమా?

ఇండస్ట్రీని వదిలేద్దాం అనుకున్నా..తనూజ షాకింగ్ స్టేట్మెంట్!

షారుక్ ఖాన్ తో సృష్టి.. కామనర్ గా బిగ్ బాస్ లోకి.. మరీ ఇంత మోసమేంటి నాగ్ సార్!

తండ్రి భూస్వామి.. 150 ఎకరాలు దానం..ఉదయభానుకి దక్కిందెంతో తెలుసా?

ఉదయ భాను యాంకరింగ్‌కు అంత పారితోషికమా? ఒక్కో షోకు ఎంతంటే!

Big Stories

Advertisement
×