Tanuja Puttaswami: తనూజ పుట్ట స్వామి పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెరపై ముద్దమందారం(Muddamandaram) సీరియల్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె అనంతరం పలు సీరియల్స్ లో నటించారు. ఇలా బుల్లితెర నటిగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న తనుజ ఇటీవల బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9) కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె రన్నర్ బయటకు వచ్చారు. ఇక ఈ కార్యక్రమం అనంతరం తనూజ ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు ఇక త్వరలోనే ఈమె నటించిన” హతః” (Hatah)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ సినిమా దీపావళి పండుగను పురస్కరించుకొని నవంబర్ ఆరవ తేదీ విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న తనూజ ఈ సినిమా గురించి అలాగే ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. బిగ్ బాస్ తర్వాత మీకు సినిమా అవకాశాలు వస్తున్నాయా? అనే ప్రశ్న ఎదురవడంతో తనకు బిగ్ బాస్ తర్వాత సినిమాలలో అవకాశాలు వస్తున్నాయని తెలిపారు. అయితే హతః మాత్రం బిగ్ బాస్ వెళ్లడానికి ముందే తాను సైన్ చేశానని తెలిపారు. తనకు ఈ సినిమా అవకాశం ఇచ్చినందుకు మేకర్స్ కు ఈమె ధన్యవాదాలు తెలియజేశారు.
ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా మరొక మీడియా ప్రతినిధి ఈమెను ప్రశ్నిస్తూ.. సాధారణంగా సీరియల్స్ నుంచి సినిమాలలోకి వెళ్లిన వారిని చిన్నచూపు చూస్తారు రెమ్యూనరేషన్ కూడా తక్కువగా ఉంటుంది అని చెబుతుంటారు మీకు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఉందా? అంటూ ప్రశ్న వేశారు. ఈ ప్రశ్నకు తనూజ సమాధానం చెబుతూ.. తనకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ లేదని తెలిపారు. నేను ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలు పాటు కొనసాగాను అయితే ఒకానొక సమయంలో ఇక ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోదాం అని ఆలోచించాను కానీ ఎక్కడికి వెళ్లినా తనూజ వస్తుందా? తనూజ రాలేదా అంటూ అడిగేవారు అందుకే అభిమానుల కోసం తాను తిరిగి కొనసాగుతున్నానని తెలిపారు.
ఇక రెమ్యూనరేషన్ గురించి కూడా ఈమె మాట్లాడుతూ.. తాను ఏదైనా ఒక ప్రాజెక్టుకు కమిట్ అయ్యాను అంటే ఆ పాత్రకు నేను 100% న్యాయం చేయాలని మాత్రమే ఆలోచిస్తాను తప్ప, నాకు ఇంతే రెమ్యూనరేషన్ కావాలని ఎప్పుడూ డిమాండ్ చేయలేదని తనూజ ఈ సందర్భంగా తెలిపారు. ఇలా ఇండస్ట్రీని వదిలి వెళ్దాం అనుకున్నానని తనూజ చెప్పడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. మరి బిగ్ బాస్ తర్వాత తనూజ నటించిన హతః సినిమా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలా బ్లాస్ట్ అవుతుందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు అనుష్ గోరక్ దర్శకత్వం వహించగా, కిరణ్ అబ్బవరం సమర్పణలో మిస్టరీ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Also Read: రాజకీయాల కంటే సినిమానే బెటర్… రియాలిటీలోకి వచ్చిన రోజా!