Big TV Kissik Talk Show : ప్రముఖ తెలుగు న్యూస్ ఛానెల్ బిగ్ టీవీ ఎన్నో రకాల కొత్త ప్రోగ్రాం లను ప్రేక్షకులకు అందిస్తుంది. అలాంటి వాటిలో ప్రేక్షకుల మనసు దోచుకున్న షో బిగ్ టీవీ కిసిక్ టాక్స్(Big TV Kissik Talk Show). జబర్దస్త్ ద్వారా ఫేమ్ వర్ష ఈ షోకు యాంకర్ గా వ్యవహారిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ప్రసారం కాబోతోంది. ప్రతివారం పెద్ద ఎత్తున బుల్లితెర నటీనటులు సినీ సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. తాజాగా ఈ కార్యక్రమానికి బుల్లితెర విలన్, నటి శోభా శెట్టి గెస్ట్ గా వచ్చింది. తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు, కన్నీళ్లు గురించి బయట పెట్టింది. తల్లి చేసిన త్యాగం గురించి వివరించి ఎమోషనల్ అయ్యింది.
తల్లి తాళి తాకట్టు పెట్టి అద్దె కట్టాం..
కన్నడ బ్యూటి శోభా శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. బిగ్ బాస్ సీజన్ 7 లో కంటెస్టెంట్ గా పాల్గొని అందరినీ ఆశ్చర్యపరిచింది. కన్నడ బ్యూటీ శోభా శెట్టి తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా పరిచయమే.. బిగ్ బాస్ లో శివాజీ బ్యాచ్ కు కౌంటర్ వేస్తూ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. బిగ్ బాస్తర్వాత బిజీ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ అక్కడ నెగిటివిటీ రావడంతో పెద్దగా సీరియల్స్లలో కనిపించలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడంతో పాటు బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు ఈవెంట్లలో మెరుస్తుంది. తాజాగా ప్రముఖ న్యూస్ ఛానల్ బిగ్ టీవీ కి ఇంటర్వ్యూ వచ్చింది . ఆమె జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను పంచుకుంది. ముఖ్యంగా తల్లి తాళి తాకట్టు పెట్టిన విషయాన్ని బయటపెట్టి ఎమోషనల్ అయింది. ఒకప్పుడు తినడానికి తిండి లేక మా అమ్మ తాళిని తాకట్టు పెట్టి ఇంట్లోకి కావాల్సిన సరుకులు అద్దె కట్టాము అని కన్నీళ్లు పెట్టుకుంది. అలాగే ఎన్నో సార్లు ఎయిర్‌పోర్ట్‌లోనే నిద్రపోయాం అని తెలుపుతూ ఎమోషనల్ అయ్యింది శోభ శెట్టి..
Also Read:వామ్మో.. 5 నిమిషాల కోసం మౌనీరాయ్ రెమ్యూనరేషన్ అన్ని కోట్లా..?
శోభా శెట్టి కెరీర్ విషయానికొస్తే..
తెలుగులో కార్తీక దీపం సీరియల్‌లో మోనిత క్యారెక్టర్ ఎంత పాపులరో తెలిసిందే. ఈ పాత్రలో నటిస్తోన్న భామ కన్నడ నటి శోభా శెట్టి. కన్నడలో పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా కనిపిస్తున్న ఈ భామ ఎప్పటికప్పుడు స్టైలిష్ గా రెడీ అవుతూ ఫోటోలను షేర్ చేస్తుంది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యూట్యూబ్ ద్వారా వీడియోలను చేస్తూ క్రేజ్ ను పెంచుకుంటుంది. తాజాగా ఈమె ఓ సీరియల్ లో నటిస్తుందని టాక్.. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ రాబోతుంది. ప్రస్తుతం శోభా శెట్టి ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పైకి కోపంగా కనిపించిన ఇంత బాధలను అనుభవించిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.