Brahmamudi serial today Episode: రాజ్ బాధగా నేను మా అమ్మను తప్పుగా అర్థం చేసుకున్నాను అంటాడు. దీంతో కావ్య మీరు మీ అమ్మను ఒక్కదాన్నే కాదు ఆడవాళ్లందరినీ తప్పుగా అర్థం చేసుకుంటారు. అసలు మీరు మీ డిగ్రీతో పాటు ఆడవాళ్లను ఎలా తిట్టాలో కూడా డిగ్రీ చేశారేమో అంటుంది. అంతొద్దు కానీ ముందు ఈ డబ్బు లోపల పెట్టు.. అంటాడు. బయటి నుంచి రాహుల్ చూస్తాడు. రెండు కోట్ల డబ్బు వీళ్లకు ఎక్కడి నుంచి వచ్చింది అనుకుని వెళ్లిపోతాడు.
ధాన్యలక్ష్మీ కోపంగా రుద్రాణిని తిడుతుంది. కొన్ని రోజులు నోరు మూసుకని ఉందామంటే వినకుండా చివరకు నన్ను కూడా అందరి ముందు తిక్కల దాన్ని చేశావు అంటుంది. రుద్రాణి విసుగ్గా మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు.. నువ్వు కూడా నన్నే అంటున్నావా..? అంటుంది. దీంతో ధాన్యలక్ష్మీ.. అనడంతోనే ఆపేశాను సంతోషించి.. నాకు వస్తున్న కోపానికి నిన్ను చంపేయాలనుంది అంటుంది. ధాన్యలక్ష్మీ అంత తప్పు నేనేం చేశాను అంటుంది రుద్రాణి. రాజ్, కావ్య చేసే ప్రతి పనిలో వేలు పెడుతున్నావు. వాళ్లు చేసేది తప్పు అని గొడవ చేసి చివరకు వాళ్లు గొప్పవాళ్లను నువ్వే చేస్తున్నావు. ఈరోజు వాళ్లు ఇంట్లో వాళ్ల ముందు మంచివాళ్లు అయ్యారు.
నీ మాటలు నమ్మి నేను చెడ్డదాన్ని అయ్యాను అంటుంది ధాన్యలక్ష్మీ.. ఇంతలో స్వప్న వచ్చి కరెక్టుగా చెప్పారు ఆంటీ.. కుక్కతోక పట్టుకుని గోదారి ఈదాలనుకుంటే ఇలాగే ఉంటుంది అంటుంది. రుద్రాణి కోపంగా ఏయ్ నన్ను కుక్కతో పోలుస్తావా..? అంటుంది. కుక్కతో పోల్చాను సరిపెట్టుకో.. అంటుంది. ధాన్యలక్ష్మీ చిరాగ్గా మీ ఇద్దరి గొడవ బయట పెట్టుకోండి నాకు తల పట్టేసినట్టు ఉంది అంటుంది. దీంతో స్వప్న నేను మీ కోసమే వచ్చాను ఆంటీ.. ఒక్కసారి మీరు ఈ ఇంటికి వచ్చిన్నప్పటి నుంచి ఈ ఇంట్లో మీ విలువ ఎలా ఉండేది.. మా అత్త మాటలు పట్టుకున్నాక ఎలా ఉంది కంపేర్ చేసుకోండి అని చెప్పి వెళ్లిపోతుంది స్వప్న. ధాన్యలక్ష్మీ ఆలోచనలో పడిపోతుంది.
తర్వాత రాహుల్ , రుద్రాణి దగ్గరకు వచ్చి రాజ్ దగ్గర ఉన్న కోటి రూపాయల గురించి చెప్తాడు. దీంతో ఇద్దరు వ్యక్తులను పురమాయించి రాజ్ డబ్బుతో బయటకు వెళ్తుంటే ఆ డబ్బు కొట్టేయాలని ప్లాన్ చేస్తుంది. అనుకున్నట్టుగానే.. రాజ్, కావ్య డబ్బు తీసుకుని వెళ్లిపోతుంటే.. ఆ ఇద్దరు వ్యక్తులు రుద్రాణిని పిలుస్తూ వస్తారు. సుభాష్ వచ్చి ఎవరు మీరు అని అడగ్గానే.. ఆ వ్యక్తి ఆది ఆవిడనే అడగండి అంటాడు. అపర్ణ కూడా ఏంటి రుద్రాణి ఏంటిది.. ఎవరు వాళ్లు అని అడుగుతుంది. దీంతో రుద్రాణి.. డబ్బులు సంపాదించాలని షేర్స్ లో ఇన్వెస్ట్ చేశాను.. అని చెప్తుంది. దీంతో అంత డబ్బు నీకెక్కడిది అని ఇందిరాదేవి అడుగుతుంది.
ఆవిడ దగ్గర లేదని మా దగ్గర అప్పు చేసింది. రెండు రోజుల్లో ఇస్తానని చెప్పింది. వారం రోజుల నుంచి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు అందుకే ఇంటికి వచ్చాము అని చెప్తాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. రుద్రాణి గారు మాకు టైం లేదు.. మాకు డబ్బు ఇవ్వండి మేము వెళ్లాలి.. లేదంటే పరిస్థితులు వేరేగా ఉంటాయి అని బెదిరించడంతో రుద్రాణి భయంగా రాజ్‌ను అడుగుతుంది. రెండు కోట్లు ఇవ్వమని అడుక్కుంటుంది. కావ్య కోపంగా రెండు కోట్లు అంటే రెండు ఇడ్లీలు ఇచ్చినంత ఈజీగా అడుగుతున్నారేంటి అంటుంది. అందరూ రుద్రాణిని తిడతారు. అయినా కానీ వినకుండా రుద్రాణి రాజ్‌ను వేడుకుంటుంది.
ఎలాగైనా నన్ను కాపాడు అంటూ నాటకం ఆడుతుంది. అయినా రాజ్ సారీ అత్తా మా దగ్గర డబ్బు లేదు అంటాడు. దీంతో అందరినీ అడుక్కుంటుంది. ఎవ్వరూ కూడా స్పందించకపోవడంతో ఇంట్లో వాళ్లకు మేము అంటే గౌరవం లేనప్పుడు మేము ఇంక బతికి ఉండటం దేనికి అంటుంది. రాజ్, కావ్య మాకు అర్జెంట్ పని ఉందని వెళ్లిపోతారు. అందరూ వెళ్లిపోయాక రుద్రాణి ఓరేయ్ రాహుల్ నా పని అయిపోయింది. ఇక నువ్వు చేయాల్సిందే ఉంది అనగానే.. నేను వెళ్లి సక్సెస్‌ఫుల్ గా ఆ రెండు కోట్లు కొట్టుకొస్తాను చూడు అంటూ వెళ్లిపోతాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: సకల బాధలను దూరం చేసే షణ్ముఖి రుద్రాక్ష ధారణ ఎవరు చేయాలి..?