Intinti Ramayanam Today Episode February 4th: నిన్నటి ఎపిసోడ్ లో.. అక్షయ్ అవని కోసం వెతుకుతూ ఉంటాడు. అవని నాకు ఒక్కసారి కనిపిస్తే చాలు.. నాకు చూడాలనిపిస్తుంది.. అసలు అవని ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అవని శ్రీకర్ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు.. నన్ను ఇంట్లో వాళ్ళందరూ ముందర చెడ్డ చేసింది నన్ను ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టేలా చేసింది. పల్లవి చేసిన పనికి నాకు ఎంత కోపం రావాలి అని అంటుంది. కేవలం పల్లవిని భరించడానికి కారణం కమల్.. అందుకే మౌనంగా ఉన్నాను. ఇప్పుడు వెళ్లి నిజం చెబితే మీ అమ్మ తట్టుకోలేదు. అయితే పల్లవికి బుద్ధి వచ్చే పని మనం చెయ్యాలి. అప్పుడే అంతా సెట్ అవుతుంది అని అవని అంటుంది. ఇక అవినీతి శ్రీకర్ కలిసి ఒక పెద్ద ప్లాన్ వేస్తారు. పల్లవి నోటిని వెంటనే నిజాలు చెప్పించాలని అనుకుంటారు. ఇక శ్రీయా కూడా శ్రిఖర్ కూడా అవనికి సపోర్ట్ గా నిలుస్తారు.. ఇక అవని ప్లాన్ ప్రకారం శ్రీకర్ శ్రీయళ్లిద్దరూ ఆ ఇంటికి వెళ్లడానికి రెడీ అవుతారు. రాజేంద్రప్రసాద్ పర్మిషన్ తీసుకోవాలని రాజేంద్రప్రసాద్ వెళ్తూ ఉంటే ఆయన కారుకి అడ్డుగా వెళ్తారు అయితే పక్క నుంచి కారు బొమ్మని రాజేంద్రప్రసాద్ అంటే శ్రియ వచ్చేసి మావయ్య మీ శ్రేయోభిలాషులుగా నేను మాట్లాడుతున్నాను. మాకు అవి అక్క వెళ్లిపోవడం ఎంత బాధగా ఉందో మీకు తెలియట్లేదు అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని నేను శ్రీకర్ ప్రయత్నిస్తున్నామని అంటుంది. అసలు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అన్న మమ్మల్ని కొద్ది రోజులు ఇంట్లో ఉన్నాను అని నాన్న అనేసి శ్రీకర్ రాజేంద్రప్రసాద్ అంటాడు. రాజేంద్రప్రసాద్ వాళ్ళిద్దరు ఇంట్లో ఉంచడానికి ఒప్పుకుంటాడు.. అవని ప్లాన్ ప్రకారం శ్రీకర్ శ్రీయా ఇద్దరూ కూడా రాజేంద్రప్రసాద్ ఇంటికి వస్తారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శ్రీయా, శ్రీకర్ లు ఇంటికి రావడం పల్లవి సహించలేక పోతుంది. తన కొడుకు కోడలు రావడంతో పార్వతి చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇంట్లో జరుగుతున్న గొడవలు కి బాధపడాలు మీద వచ్చినందుకు సంతోష పడాలోఅని కమల్ అంటాడు. ఇక అందరూ సంతోషంగా ఉంటారు. అవని శ్రీకర్కు ఫోన్ చేస్తుంది. ఇంటికెళ్ళమని చెప్పాను కదా వెళ్ళావా అంటే ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నాము వదిన మీరు లేరని లోటు మాకు తెలుస్తుంది అనేసి అనగానే మావయ్య గారు నువ్వు రావడానికి ఒప్పుకున్నారు కదా ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా మావయ్య గారిని అత్తయ్య గారిని అలాగే ఆరాధ్యను బాగా చూసుకోండి అని శ్రీకర్కు అవని చెప్తుంది. ఇక శ్రీయా ఫోన్ తీసుకొని అవినీతో మాట్లాడుతుంది. ఇంట్లో ఉన్న సమస్యల గురించి నీకు ఆల్రెడీ శ్రీకర్ చెప్పారు కదా మీరు జాగ్రత్తగా ఉండండి అందరిని బాగా చూసుకోండి అనేసి అంటుంది.
ఇక శ్రీయ బాధపడుతూ ఉంటుంది. పెళ్లి జరగడానికి అవని అక్క ఎంతో కష్టపడింది ఆమెతో కలిసి ఉండాలనుకున్నాను కానీ ఇప్పుడు ఆమె లేకుండా పోయిందని బాధపడుతుంది. ఇక కమల్ దగ్గరికి శ్రీకర్ వస్తాడు.. ఏమైందిరా అలా ఉన్నావ్ ఎందుకు బాధపడుతున్నావ్ అంటే మీరు వచ్చినందుకు సంతోష పడాలో తెలియట్లేదు అన్నయ్య వదిన లేనందుకు బాధపడాలో అర్థం కావట్లేదని కమలంటాడు అప్పుడే ఆరాధ్య బాబాయ్ నాకు అమ్మ కావాలి అనేసి వస్తుంది. అమ్మొస్తుంది అమ్మ నువ్వు ఏడవకు అని అందరూ ఓదారుస్తారు. ఆరాధ్య కోసం బొమ్మలు తీసుకొని వస్తాడు అక్షయ్.. కానీ ఆరాధ్య మాత్రం వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లడానికి ఇష్టపడదు. అందరూ కలిసి నచ్చ చెబుతారు ఇక కమ్మలతో బాబాయి నాకు ఐస్క్రీం కావాలి బయటికి వెళ్దాం పద అని బయటికి తీసుకెళ్తుంది. శ్రీకర్ ను చూసి అక్షయ్ కంగారు పడతారు. కానీ మేము నాన్న ఒప్పుకున్నాకే వచ్చామని అంటారు.
బయటికి వెళ్ళిన ఆరాధ్య అమ్మ కోసం వెతుకుదామని కమల్ తో అంటుంది. బయట రాత్రిపూట వాళ్ళిద్దరూ రోడ్లు పట్టుకొని తిరుగుతూ అవని కోసం వెతుకుతారు. ఇక పల్లవి శ్రియా శ్రీకర్ ఇంటికి రావడం ఓర్వలేక పోతుంది. ఈ విషయాన్ని వెంటనే చక్రధరితో చెప్పాలని పల్లవి అనుకుంటుంది. ఇక శ్రీకర్ పల్లవి ఫోన్ మాట్లాడే దగ్గర మైక్రోఫోన్ అని పెడతాడు. గమనించిన పల్లవి వాళ్ళ నాన్నతో అసలు విషయాన్ని చెప్పేస్తుంది. ఇక పార్వతి శ్రియ గదికి వెళ్లడంతో పల్లవి కొత్త కోడలు పైన అత్తయ్యకు ఇష్టం పెరిగిపోతుంది ఏం మాట్లాడుతుందో వినాలని అక్కడికి వెళుతుంది. తొందర మాట్లాడుకుంటుంటే పల్లవి దొంగ చాటుగా వింటుంది. శ్రీయ బయటకు వచ్చి ఎందుకు పల్లవి లో బయటినుంచి చూస్తూ అలా వింటున్నావ్ లోపలికి రావచ్చు కదా అని అడుగుతుంది. దానికి పల్లవి సీరియస్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. అవని ఆరాధ్య కోసం దిగులు పెట్టుకొని ఒంటరిగా ఏడుస్తూ కూర్చుంటుంది.. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..