E-Paper
Advertisement

Brahmamudi Serial Today February 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: పాపను చంపేందుకు రుద్రాణి ప్లాన్  

Brahmamudi Serial Today February 9th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: పాపను చంపేందుకు రుద్రాణి ప్లాన్  
Advertisement

Brahmamudi serial today Episode:

హాస్పిటల్ లో పాపకు ఆపరేషన్‌ చేయడానికి డాక్టర్లు పాపను ఐసీయూలోకి తీసుకెళ్తుంటారు. అది చూసిన కావ్య ఏడుస్తుంది. కావ్యను కావ్యను రాజ్‌ ఓదారుస్తాడు. దీంతో కావ్య నా పాప ఇంకోకరి ఒడిలో క్షేమంగా ఉందని నాకు తెలుసు, అయినా ఈ నెల రోజులు నా రక్తం పంచుకున్న బిడ్డ దూరమైపోయింది. ఇప్పుడు ఇంకొక పాపని ఈ చేతులతో ఆపరేషన్‌ కోసం పంపించాను, ఏదైనా జరగరానిది.. జరిగితే పాప తిరిగిరాకపోతే, ఈ బిడ్డను కన్నతల్లికి ఏ సమాధానం చెబుతాం. శాశ్వతంగా బిడ్డ దూరమైందని చెబితే ఆ తల్లి ఎలా తట్టుకుంటుంది? అంటూ ఎమోషనల్‌ అవుతుంది కావ్య..

దీంతో రాజ్‌ నువ్వు నీ బిడ్డ కోసం ఎంత తపిస్తున్నావో? ఈ బిడ్డను తన కన్నతల్లి దగ్గరికి చేర్చాలని అంతకంటే ఎక్కువగా ఆశపడుతున్నావు. నీ పేగు బంధం గట్టిది కాబట్టి.. నీ బిడ్డ ఎక్కడుందో తెలిసింది, నీ బిడ్డ నీ చుట్టూనే తిరుగుతోంది. అలాగే ఆ తల్లి అమ్మతనమే ఈ బిడ్డ ప్రాణాన్ని నిలబెడుతుంది, అమ్మకి దగ్గర చేస్తుంది అని రాజ్‌ చెప్తాడు. మరోవైపు రుద్రాణి రౌడీలకు ఫోన్‌ చేసి హాస్పిటల్‌లో ఉన్న పాప ఆపరేషన్‌ థియేటర్‌ నుంచి ప్రాణాలతో బయటకు రాకూడదని చెప్తుంది. రౌడీలు సరే అంటారు. వెంటనే నర్సు నీలవేణికి ఫోన్‌ చేసి హెల్ప్‌ అడుగుతుంది రుద్రాణి. దీంతో నీలవేణి ఒక్కసారి మినిస్టర్ గారికి సాయం చేసి ఇరుక్కుపోయాను, ఆ కావ్య గారు మంచోళ్లు కాబట్టి కొట్టి వదిలేశారు ఇక నేనే సాయం చేయలేను అంటుంది.

Advertisement

దీంతో రుద్రాణి.. ఈసారి నువ్వు అంత రిస్క్ చేయాల్సి పనిలేదు.. ఆపరేషన్ థియేటర్‌లోకి నా మనుషుల్ని తీసుకెళ్తే సరి నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను అంటుంది రుద్రాణి. దీంతో నీలవేణి భయంగా.. నాకు ఏ డబ్బు వద్దు.. మళ్లీ మీరు పాపకి ప్రమాదం తలపెట్టబోతున్నారు, నన్ను ఈ గొడవలోకి లాగొద్దు మేడం అంటూ రిక్వెస్ట్‌ చేస్తుంటే.. రుద్రాణి కోపంగా ఇప్పుడు నేను చెప్పింది నువ్వు చేయకపోతే .. నా మనుషులు హాస్పిటల్ కన్నా ముందు నీ ఇంటికి వెళ్తారు. నీ పిల్లలు ఈరోజు స్కూల్‌కి వెళ్లలేదనుకుంటా.. చూడు నేను ఏదైనా ఫస్ట్ అడుగుతాను, వినకపోతే ఇలాగే బెదిరిస్తాను.. అంటూ వార్నింగ్‌ ఇవ్వగానే.. నీలవేణి భయంగా ఇంతకీ ఆ పాపను ఏం చేయబోతున్నారు మేడం అని అడుగుతుంది. శాశ్వతంగా ఈ భూమ్మీదే లేకుండా చేయబోతున్నానని రుద్రాణి చెప్తుంది. దీంతో నీలవేణి మీరు చెప్పినట్టే చేస్తాను మేడం అంటుంది. బయటకు వెళ్లి రాజ్‌, కావ్యలకు రౌడీల గురించి చెప్తుంది నీలవేణి.

దీంతో ఇద్దరూ షాక్ అవుతారు. ఇప్పటికే నేను మీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను, ఇప్పుడు నోరు విప్పకపోతే ఇంకా పెద్ద తప్పు చేసిన దానిని అవుతాను సార్‌..  అని చెప్పగానే.. రాజ్‌ కోపంగా పాపని చంపాలని చూస్తున్నది ఎవరు..? అని అడుగుతాడు. దీంతో నీలవేణి మినిస్టర్ గారే పాపను చంపబోతున్నారు.. వాళ్లు చెప్పినట్టు వినకపోతే నా పిల్లలను చంపేస్తామని బెదిరిస్తున్నారు అని నీలవేని చెప్పగానే.. రాజ్‌ కోపంగా నువ్వేం కంగారు పడొద్దు ఈ  బిడ్డను నేను కాపాడతాను అని రాజ్‌ చెప్పగానే.. నీలవేని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత రుద్రాణి మనుషులు హాస్పిటల్‌కు రావడం చూసి నీలవేణి రాజ్‌కు ఫోన్‌ చేసి చెప్తుంది. రౌడీలను పక్కదారి పట్టిస్తుంది నీలవేణి. మరోవైపు రుద్రాణి మినిస్టర్‌ ను కలిసి మీ పాపను చంపమని రౌడీలను పంపినట్టు ధర్మేంద్రకు చెప్పగానే.. ధర్మేంద్ర కోపంగా రుద్రాణిని కొడతాడు. నా భార్య కోసం తప్పు చేశాను కానీ కన్నబిడ్డను చంపుకునేంత కసాయివాడిని కాదని తిట్టి అక్కడి నుంచి హాస్పిటల్‌కు బయలుదేరుతాడు.

Advertisement

మరోవైపు డాక్టర్‌ వచ్చి ఆపరేషన్‌ సక్సెస్‌ అయిందని పాప స్పృహలోకి రావడానికి టైం పడుతుందని చెప్తుంది. ఇంతలో రౌడీలు పాపను చంపడానికి ప్రయత్నిస్తుంటే.. రాజ్‌ అడ్డు పడతాడు. వాళ్లతో ఫైట్‌ చేస్తుంటాడు. ఒక రౌడీ రాజ్‌ను పొడవబోతుంటే.. మినిస్టర్‌ ధర్మేంద్ర వచ్చి అడ్డు పడతాడు. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

Big Stories

Advertisement
×