E-Paper
Advertisement

Brahmamudi Serial Today January 30th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యను ఇంట్లోకి రానివ్వని రాజ్

Brahmamudi Serial Today January 30th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కావ్యను ఇంట్లోకి రానివ్వని రాజ్
Advertisement

Brahmamudi serial today Episode:

బిడ్డ కోసం మినిస్టర్‌ ఇంటికి వెళ్లిన కావ్య హాస్పిటల్‌ లో మారిపోయిన రిపోర్ట్స్‌ ధర్మేంద్రకు ఇస్తుంది. అవి చూసిన దర్మేంద్ర షాక్‌ అవుతాడు. నేను హాస్పిటల్‌లో పక్కాగా మార్చేసిన రిపోర్ట్స్‌ని కూడా పట్టుకోగలిగావు అంటే నువ్వు చాలా దూరం వచ్చేశావు అంటాడు. దీంతో  కావ్య నీ దగ్గర ఉన్న బిడ్డ.. నా బిడ్డ అని చెప్పడానికి ఈ రిపోర్ట్స్ అక్కర్లేదు. నా చూపు చాలు.. నాకు తగిలే నా బిడ్డ ఊపిరి చాలు. నువ్వు దుర్మార్గానికి పూనుకున్నావని తెలుసుకోవడానికి అంటుంది కావ్య. దీంతో మినిస్టర్‌ కోపంగా  నీ బిడ్డను నేనే మార్చాను… నీ బిడ్డను నీ దగ్గరికి ఇక చేర్చను అంటాడు. దీంతో కావ్య కోపంగా నీ బిడ్డను మార్చి.. నా ఒడిలోకి చేర్చే హక్కు నీకు ఎవరిచ్చారు? అని ప్రశ్నించగానే..

కావ్య నీ మీద నాకు ఎలాంటి పగ, ద్వేషం ఏం లేవు.. ఆ రోజు మాకు పుట్టిన బిడ్డకు ఆరోగ్య సమస్య ఉందన్నారు.. బతకదన్నారు. కానీ పాప గురించి తెలిస్తే నా భార్య నాకు దక్కదు. అందుకే మరో మార్గం లేక అలా చేశాను అంటూ మినిస్టర్‌ చెప్పగానే.. కావ్య ఏమోషనల్‌ అవుతూ.. అందుకని మరో తల్లికి కడుపుకోత మిగులుస్తావా? ఇంకో ఆడదాని చేత కన్నీళ్లు పెట్టిస్తావా? అంటూ కోప్పడగానే.. ధర్మేంద్ర మాత్రం నా భార్య సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను, ఎంత దూరమైనా వెళ్తాను.. నువ్వు తెలుసుకున్న నిజం, ఈ రిపోర్ట్స్ చాలా చిన్నవి.. ఈ బిడ్డ నీది అని చెప్పడానికి ఒక్క సాక్ష్యమైనా ఉందా? మీరు చేయించిన డీఎన్ఏ రిపోర్ట్స్ కూడా నేనే మార్చేశాను.. నువ్వు ఎక్కడ పట్టుకోలేవు, ఇండియాలో ఎక్కడ డీఎన్ఏ టెస్ట్ చేయించినా నాకు అనుకూలంగానే రిపోర్ట్స్ వస్తాయి మీకు ఈ పాప కాకపోతే మరో బిడ్డను కనేందుకు అవకాశం ఉంది.. కానీ మాకు ఆ అవకాశం లేదు. కాబట్టి నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను… నీ బిడ్డను మాత్రం మరిచిపో అంటూ ధర్మేంద్ర కావ్యకు ఆఫర్‌ ఇస్తాడు.

Advertisement

దీంతో కావ్య కోపంగా డబ్బు, పలుకుబడి, పదవి ఉందని విర్రవీగుతున్నావు… నీ పవర్‌ని అడ్డం పెట్టుకుని ఎందరి జీవితాలతోనైనా ఆడుకోవచ్చని అనుకుంటున్నావు, వాటిని నేను పెకిలిస్తున్నాను. పదవితో వచ్చిన పవర్ నీది, పేగు తెంచుకుని కన్న మమకారం నాది. నీది బిడ్డల్ని మార్చిన కిరాతకం, నాది రక్తం పంచిన అమ్మతనం. ఇక నీకు, నాకే పోటీ. ఆట నువ్వు మొదలుపెట్టావు.. ముగింపు నేను ఇస్తాను, నా బిడ్డను నేను తిరిగి తీసుకెళ్తాను.. నీకు 15 రోజులు గడువు ఇస్తున్నాను.. గడువులోపు నీకు నువ్వుగా చేసిన తప్పు ఒప్పుకునేలా నీ చేతుల్లో బిడ్డని, నా చేతుల్లో పెట్టేలా చేస్తాను. నా పాపని నేను తీసుకెళ్తాను అంటూ వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది కావ్య. అంతసేపను డోర్‌ చాటు నుంచి వింటున్న రుద్రాణి, ధర్మేంద్ర దగ్గరకు వస్తుంది. దాని కాన్ఫిడెన్స్ ఏంటీ? మినిస్టర్‌తో మాట్లాడుతున్నానన్న భయం కూడా లేదు అని ధర్మేంద్ర అనగానే.. అది ఒంటరి ఆడది, దాని భర్త, దాని కుటుంబమే దానిని నమ్మడం లేదు. దానికి అంత సీన్ లేదు అని రుద్రాణి చెప్తుంది.

మరోవైపు ఇంటికి వెళ్లిన కావ్యను ఇంట్లోకి రానివ్వడు రాజ్‌. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది అపర్ణ వచ్చి కావ్యను తిడుతుంది. ఎందుకు పిచ్చిదానిలా రోడ్ల మీద కార్ల వెంబడి పరుగెడుతున్నావని ప్రశ్నిస్తుంది. నువ్వు ఇలాగే ఉంటే ఏమైపోతావో అని భయంగా ఉందని అపర్ణ బాధపడుతుంటే.. కావ్య కూల్‌గా ఇప్పటిదాకా నా అనుమానంతో, నా మాటలతో మిమ్మల్ని చాలా కష్టపెట్టాను. కానీ ఇప్పుడే నిజం తెలుసుకున్నాను.. ఇకపై నా వల్ల మీరు బాధపడరు, నా వల్ల మీరు ఇబ్బందిపడరు.. ఈరోజే నాకు క్లారిటీ వచ్చిందని చెప్పి లోపలికి వెళ్లిపోతుంది కావ్య. అప్పుడే రేఖ వచ్చి కావ్యకు పిచ్చిపట్టినట్టు ఉంది. ఇలాగే వదిలేస్తే ఇంటి పరువు పోతుందని.. బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడాలని చెప్తుంది. అందరూ ఆలోచనలో పడిపోతారు. తర్వాత రుద్రాణి ఫోన్‌ చేసి మినిస్టర్‌ ఇంట్లో జరిగిన విషయం రేఖకు చెప్తుంది. మరోవైపు రూంలోకి వెళ్లిన రాజ్‌తో కావ్య నిజం చెప్తుంది. మీకు నమ్మకం కలగాలంటే రేపు తనతో పాటు మినిస్టర్‌ ఇంటికి రావాలని చెప్తుంది.  రాజ్‌ సరే అంటాడు మరునాడు కావ్య రాజ్‌ను తీసుకుని మినిస్టర్‌ ఇంటికి వెళ్తుంది. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×