E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode July 8th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: నందు ఎట్రీతో అదిరిపోయిన రేఖ – షాక్ అయిన అపర్ణ  

Brahmamudi Serial Today Episode July 8th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: నందు ఎట్రీతో అదిరిపోయిన రేఖ – షాక్ అయిన అపర్ణ  
Advertisement

Brahmamudi serial today Episode: రాజుకు ఫోన్‌ చేసిన అపర్ణ ఇంట్లో జరిగిన విషయాలు చెప్తుంది. రాజు సంతకం కూడా రేఖ పేపర్స్‌ మీద తీసుకున్నది అని చెప్పగానే రాజు షాక్ అవుతాడు. నాతో ఎలా చేయించుకుంది అంటూ అడగ్గానే.. అపర్ణ అవును రాజు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇందు కూడా ఏమీ చేయలేదు.. నువ్వు వచ్చి ఏదో ఒకటి చేయకపోతే ఆస్థి మొత్తం మింగేస్తుంది. నువ్వే ఏదో ఒకటి చేయాలి రాజు లేదంటే ఇందు ఓడిపోతుంది. రేఖ గెలుస్తుంది. రేపు రేఖ అనుకున్నట్టు జరిగితే ఇరవై ఏళ్లుగా నేను పడ్డ కష్టం మొత్తం వృథా అయిపోతుంది అంటూ ఎమోషనల్‌ అవుతుంది అపర్ణ.. రాజు రేఖ ఆస్థి మొత్తం తీసుకోవడం కాదు కదా చిల్లిగవ్వ కూడా ముట్టుకోనివ్వను నేను చూసుకుంటాను నువ్వు వెళ్లి పడుకో అమ్మమ్మ అంటూ చెప్పగానే.. అపర్ణ సరే అంటూ కాల్‌ కట్‌ చేస్తుంది. రాజు ఎవరికో ఫోన్‌ చేసి అర్జెంట్‌గా కలవాలి అంటాడు.

దుగ్గిరాల ఇంట్లో కూర్చున్న భ్రమరాంబ ఎవరికో ఫోన్‌ చేసి బంజారాహిల్స్‌ లో ఎకరం లాండ్‌ కావాలని అడుగుతుంది. అంతా గమనిస్తున్న శేషు ఆశ్చర్యంగా అక్కడ రేటు ఎంత ఉంటుందో తెలుసా..? అని అడగ్గానే.. ఎంత ఉన్నా కొంటానని భ్రమరాంబ చెప్తుంది. అప్పుడే అపర్ణ కాపీ తీసుకొని వచ్చి కలలు రాత్రి పూట కంటే నిజమవుతాయేమో కానీ పగలు కంటే నిజం కావు అంటుంది. ఏంటి రాత్రి నీ ముఖం మాడిపోయింది. ఇప్పుడేంటి నీలో కంగారు కనబడటం లేదని భ్రమరాంబ అడగ్గానే.. ఎందుకు కంగారు పడాలి అసలు ఆస్థి రేఖ పేరు మీదకు ట్రాన్స్‌ఫర్‌ అయితే కదా భయపడాలి అంటుంది. అప్పుడే వచ్చిన రేఖ అయితే ఇప్పుడు మాది ఊహ అంటావా..? అనగానే.. అపర్ణ అవును అనగానే.. చూస్తూ ఉండండి మా ఊహే నిజం అవుతుంది చూస్తూ ఉండండి.. అంటూ చెప్పగానే.. ఈ ఆస్థి కోసం మీ అమ్మ కూడా చాలా ప్రయత్నం చేసింది.. ఎన్నో ప్లాన్లు వేసింది కానీ చిల్లిగవ్వ కూడా దక్కించుకోకుండానే పైకి పోయింది అంటూ చెప్పగానే.. రేఖ కోప్పడుతుంది. నీ నమ్మకం నీది మా నమ్మకం మాది ముందు వెళ్లి ఇందును రమ్మని చెప్పండి అనగానే.. ఇందును రెడీ అవ్వమని చెప్తాను.. కానీ ఆస్థి పేపర్స్‌ మీద సంతకాలు పెట్టడానికి కాదు.. ఆఫీసుకు వెళ్లడానికి అంటూ వెళ్లిపోతుంది.

Advertisement

తర్వాత రిజిష్ట్రార్‌ ఆఫీసర్లు రాగానే.. రేఖ హ్యాపీగా వాళ్లను రిసీవ్‌ చేసుకుని ఇందును పిలుస్తుంది ఇందు రాగానే.. పేపర్లు అన్ని ఆపీసర్లకు చూపిస్తుంది రేఖ. తర్వాత ఇందును సంతకం చేయమని చెప్తుంది. అపర్ణ, స్వాతి సుభాష్‌ రాజు కోసం ఎదురుచూస్తుంటారు. స్వాతి మెల్లగా అదేంటి నాన్నమ్మ రాజు బావ వస్తాడు అన్నావు కదా ఇక్కడ చూస్తేనేమో రాజు బావ రాలేదు ఇప్పుడెలా నాన్నమ్మ అంటూ అడుగుతుంది. ఇందు ఆలోచిస్తుంటే.. భ్రమరాంబ ఏంటి ఆలోచిస్తున్నావు ఇప్పుడు నువ్వు సంతకం పెడతావు కదా అంటుంది. సుభాష్ వద్దని సంతకం పెట్టొద్దని వారిస్తాడు.   రేఖ బలవంతంగా ఇందు చేత సంతకం చేయిస్తుంటే అప్పుడే నందు వస్తుంది. ఎవరి ఆస్థి ఎవరి చేత సంతకం చేయించుకుంటున్నారు అంటూ అరుస్తుంది.

నువ్వెవరు ఇక్కడికి వచ్చి ఆపడానికి ఇక్కడ పోలీసులకు ఎంట్రీ లేదు అంటుంది భ్రమరాంబ.. దీంతో నేను పోలీస్‌గా రాలేదని చెప్తుంది అయినా బలవంతంగా సంతకం చేయించుకోవడం ఏంటి…? అంటుంది. దీంతో భ్రమరాంబ మా ఇందు ఇష్టపూర్వకంగానే సంతకం పెడుతుంది అని చెప్తుంది. ఇంకెవరు పెట్టాలి రాజు పెట్టాడు కదా..? అనగానే ఇంకొకరు ఉంటారు కదా..? ఈ ఆస్థి వారసురాలు అంటూ ప్రకాష్‌, ధాన్యలక్ష్మీల మనవరాలు, అప్పు, కళ్యాణ్‌ల కూతురు నందుకు కూడా ఆస్థి మీద హక్కు ఉంటుంది కదా..? అనగానే.. శేషు నందు తిరిగొచ్చిందా..? అనగానే.. అవును ఆ నందును నేనే తిరిగి వచ్చాను ఇప్పుడు చెప్పండి ఆస్థిలో నాకు కూడా బాగం ఉంటుంది కదా అనగానే.. అపర్ణ ఆశ్చర్యంతో సంతోషిస్తుంది. రేఖ, భ్రమరాంబ షాక్‌ అవుతారు.  ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode July 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: నిజం చెప్పమని రాథోడ్‌ ను నిలదీసిన మిస్సమ్మ

Illu Illalu Pillalu Today Episodes: బావిలో దూకిన వల్లి.. నిజం దాచిన వేదవతి.. రామరాజు మాటతో శ్రీవల్లి కన్నీళ్లు..

Karthika Deepam 2 Serial Today Episode July 8th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: బాలాను బెదిరించి హోటల్ కొన్న మాలిని  

Intinti Ramayanam Today Episode: పల్లవి మాస్టర్ ప్లాన్.. మాట నిలబెట్టుకున్న అవని.. కమల్ దెబ్బ అదుర్స్ కదూ..

Meghasandesham Krishna Prasad : ‘ మేఘసందేశం’ సీరియల్ లవర్స్ కు షాకింగ్ న్యూస్.. కృష్ణ ప్రసాద్ అవుట్..

Podarillu Maha : ‘పొదరిల్లు’ మహా ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ గాయాలు ఏంటి..?

Wedensday Movies in Tv : బుధవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. ఆ రెండు వెరీ స్పెషల్..

Big Stories

Advertisement
×